అనుకున్నా…
ఆ హృదయం
పూలవనమనీ
వణికే చిగురాకనీ
కరిగే వెన్నముద్దనీ
చల్లని మంచుబిందువనీ
అందుకే ముద్దాడాను
వెర్రిబాగులదాన్ని కదా
నా బుగ్గ నెత్తురుముక్కయ్యింది
అర్థం చేసుకున్నా…
ఆ హృదయం గాజుపెంకని..
— అన్నపూర్ణ