A woman life Telugu
నాకు చొరవ ఎక్కువ. ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటాను. మాదో మధ్య తరగతి జీవితం. నాన్న ఒక హేతువాది కావడం వలన కొంత నాలెడ్జ్ ఉంది. ఇతరుల పట్ల సానుభూతి. సమాజం బావుండాలి అందుకేమన్నా చేయాలనే చిన్న కోరిక. కానీ పెళ్ళి నేనెలా ఉండాలో నిర్ణయించింది.రాజీపడుతూ.. వీలుకానప్పుడు ఘర్షణ పడుతూ పెళ్ళి బండి నడుపుతున్నాను. స్వతహాగా మధ్య తరగతి కుండే కొన్ని విలువలు నీతి, నిజాయితీ, అబద్దాలు చెప్పకూడదు లాంటివి నాతో నాలో మిగిలాయి.
నా భర్త ఒక లాయర్. కాన్ఫిడెన్స్ తక్కువ. ఆ కారణంగా 50 యేళ్ళు వచ్చినా వాళ్ళ నాన్నకు అసిస్టెంట్ గానే మిగిలిపోయాడు. మా మావకు మంచి పేరుంది. మాకుటుంబానికి మావే ఆధారం అన్నట్టు నడిచిపోతుంది.మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి. నేనంటే మా ఆయన ఫామిలీకి చిన్న చూపు. మేము వాళ్ళ కంటే పేదవాళ్ళమని. నాన్న వయసులో ఉన్నప్పుడు పేదవాళ్ళకి పనిచేసాడు.
A woman life
ఏమీ సంపాదించుకోలేదు. నేను ఒక జాబ్ చేస్తున్నాను. మా ఆయనకు ఎడతెగని అనుమానం. నేను ఆఫీసుకు వెళ్ళిన కాసేపటికే వస్తాడు. ఆఫీసుముందు చూసి చూసి ఎప్పటికో ఇంటికెళ్తాడు. దొంగ పేర్లతో మా ఆఫీసుకి ఫోన్ చేస్తుంటాడు.
ఇంటి పని వంటపని అత్త మావ, వాళ్ళ జేజి లకు సేవలు.
మొత్తం అందరికీ అన్ని చేసి ఆఫీసుకి వెళ్తాను. లేటుగా..
బాస్ తో చివాట్లుతో నా పని ప్రారంభం అవుతుంది.
ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఇంటికి పారిపోదామనే యాతన. అక్కడెన్నో పనులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయిగా. అందువలన వేరే మగాళ్ళతో మాటాడ్డానికో స్నేహాలు చేయడానికో తీరిక, ఇంట్రస్ట్ ఏమీ లేవు.
అది మా ఆయనకు అర్థం కాదు. అర్థం చేయించలేను. వదిలేసాను. నేను సరిగ్గానే ఉన్నానుగా.
A woman life
ఇలాంటి నా జీవితంలోకి ఒక తుఫాన్ చెలరేగింది. ఒకరోజు మా ఆయన ఊరెళ్ళాడు.
రాత్రప్పుడు ఒక చేయి నా మీద తచ్చాడుతుంది. భయంతో తుళ్ళిపడ్డాను. మెళుకువొచ్చింది. చీకట్లో మావగారి నీడ. గొంతుపెగల్లేదు.
నేను లేచేసరికి అక్కడినుండి జారుకున్నాడు. నేనింకా తేరుకోలేదు. తెల్లార్లు నిద్ర లేదు. ఎలాగో రాత్రి గడిచింది.
అప్పటి నుండి బాత్రూంకి వెళ్ళినా, గదిలో సారీ మార్చకుంటున్నా అబ్జర్వ్ చేసాను.
A woman life
ఆ కళ్ళు నా చుట్టూ తిరుగున్నాయని అర్ధమైంది. నా శరీరం చచ్చిపోయింది. ఇప్పటివరకూ నేను గుర్తించనందుకు. ఇక భరించలేకపోయాను. మా ఆయనకు చెఫ్పాను. కళ్ళు పోతాయన్నాడు. అత్త తిట్టింది. ఆమె సలహాలతో నా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేసాను.
నా మాట నమ్మరని అర్థమయ్యాక బరితెగించాడు.అతని హేరాస్మెంట్ ఎక్కవయ్యింది. ఇక విడిగా ఉందామని అడిగాను. మా ఆయనను వేరే ప్రాక్టీస్ పెట్టమని ఇల్లు మారదామని గొడవ పెట్టాను. కానీ అతను వినలేదు. మావగారితో కలిసుండటానికి నేనంత మాత్రం సిద్ధంగా లేను. నా వల్ల కాక నాన్న మిత్రులు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. నాన్న అతని దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ మహిళా సంఘం ఆమెని పరిచయం చేశారు. కుటుంబ పరువు పోతుందేమోని ఇంటర్న్ల్ల్ ల్ గానే సర్దుబాటు చేసుకుందామని ఆమె సలహాలతో
A woman life
నా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేసాను.మా ఆయన వినలేదు.
తర్వాత పోలీసు కంప్లైంట్ ఇవ్వడం అనివార్యమైంది. కానీ వాళ్ళు నా సమస్యను పట్టించుకోలేదు.
పోలీసులు అంత పెద్దాయన మీద అలా చెప్పడం తప్పన్నారు. 70 యేళ్ళ ముసలాయన అలా చేయడన్నారు.
అతని దగ్గర డబ్బులు తీసుకుని నా గోడు పట్టించుకోలేదు. అడిగితే ఈ ఆడోళ్ళకేం పని ఉండదంటూ అవమానంగా మాటాడేవారు.
విసిగిపోయి సిపి దగ్గరకెళ్ళి చెప్పాను. ఆయన కేస్ పెట్టి యాక్షన్ తీసుకోమని రాసారు.
A woman life
కానీ సదరు పోలీసువారు తప్పు చేసిన మా మావగారిని అబస్కాండ్ చూపించి మా ఆయనను అరెస్ట్ చేసారు.
మా ఆయనను విడిపించడానికి జైలు చుట్టూ కోర్టు చుట్టూ బెయిల్ కోసం నానా అవస్థలు పడ్డాను. మా ఆయనకు శత్రువయ్యాను.
అప్పటినుండి మామ అరెస్ట్ అవుతాననే భయంతోనో ఏమో మా అత్త మామ వాళ్ళ ఊళ్ళోనే ఉండిపోయారు.
నా సమస్య ఆ విధంగా పరిష్కారమయ్యింది. మహిళల జీవితాల్లో నిత్యం ఎన్నోవెతలు వెంటాడుతూ ఉంటాయి.
A woman life
చెప్పలేని నీడలు తచ్చాడుతూ ఉంటాయి. వాటిని సానుభూతితో అర్థం చేసుకోవాలి. సహకరించాలి. చేయూతనివ్వాలి.
ఎందుకంటే తనకంటూ గౌరవమైన చోటు లేని ఈ ప్రపంచంలో అన్నీ తానై ప్రపంచాన్ని నడిపించేది మహిలలే కదా.
అందుకే మన ఇంట్లో మనతో ఉన్న మనకోసమే జీవిస్తున్న అమ్మను, భార్యను, బిడ్డను గౌరవిద్దాం, ప్రేమిద్దాం.
Annapurna..