Alan turing movie
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది మంది ప్రాణాల కాపాడిన వ్యక్తి.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానమే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ దక్కాల్సిన గౌరవం దక్కలేదు. రావాల్సినంత గుర్తింపు రాలేదు. పైగా ఛీత్కారాలు, బెదిరింపులు, అదిరింపులు..! ఎంత మేధస్సు ఉంటే ఏం గే అవ్వడమే అతనికి శాపమైంది.
ఆ లోపమే తన ప్రాణాలు తానే తీసుకునేలా చేసింది. కొందరు నీళ్లలో చేపల్లా ఉంటూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. ప్రజలపై అపారమైన ప్రేమ కురిపిస్తారు. ప్రాణాలు కాపాడతారు. వ్యవస్థనే మారుస్తారు.
Alan turing movie
అలాంటి వ్యక్తే అలాన్ ట్యూరింగ్. అలాన్ ట్యూరింగ్ బ్రిటన్‌కు చెందిన మేధావి. గణిత శాస్త్రవేత్త, కంప్యూటర్ సైంటిస్ట్, ఎలాంటి పజిల్ నైనా పరిష్కరించగల దిట్ట. సీక్రెట్ కోడ్ భాషలను ఛేదించగల సమర్థుడు, తత్వవేత్త, కంప్యూటర్, రోబోస్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఆద్యుడు.
అలాన్ మతిసన్ ట్యూరింగ్ లండన్.. మెడవైల్లో జూన్ 23, 1912లో పుట్టాడు. అలాన్ తండ్రి జులియస్ మతిసన్ ట్యూరింగ్. బ్రిటిష్ సివిల్ సర్వీస్‌లో పనిచేశాడు. మన ఓడిశాలోని చత్రపూర్లోనే విధులు నిర్వహించాడు.
Alan turing movie
ఆ ప్రాంతం బ్రిటిష్ పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అలాన్ తల్లి ఇథెల్ సెర.. ఆమె తండ్రి ఏడ్వార్డ్ వాలర్ స్టోని. మద్రాస్ రైల్వేశాఖ చీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. అంతేకాదు
అలాన్ ట్యూరింగ్ తాత కుడా బెంగాల్ ఆర్మీ జనరల్‌గా సేవలు చేశాడు. కుటుంబం అంతా ఇండియాలో ఉన్నా పిల్లలను మాత్రం లండన్లోనే ఉంచారు అలాన్ తల్లిదండ్రులు
అలాన్ ట్యూరింగ్‌కు ఉన్న అమితమైన ఇష్టం ..తనను సైన్స్, గణితంవైపు మళ్లించింది. 13 ఏళ్లకే గణితంలో ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయులను ఆశ్చర్యానికి గురిచేసేవాడు. 16 ఏళ్లకే ఐన్ స్టీన్, న్యూటన్ చలన నియమాలను అవపోసన పట్టాడు. తర్వాత కాలంలో అద్భుతాలు చేశాడు. కానీ అలాన్‌కు చరిత్రలో రావాల్సినంత పేరు రాలేదు. అలాన్ ట్యూరింగ్ గే కావడమే దీనికి కారణం.
Alan Turing movie
ఫ్రెండ్ క్రిస్టోఫర్ మోర్ కమ్ ప్రభావం ట్యూరింగ్‌పై చాలానే ఉండేది. స్కూల్ టైంలోనే ఇద్దరు పజిల్స్ పూరించేవారు. సీక్రెట్ కోడ్ భాషలో రాసుకునేవారు. దానికి సంబంధించిన పుస్తకాలు క్రిస్టోఫర్.. అలాన్‌కు ఇచ్చేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది.
ఎంతగా అంటే ఇద్దరు ప్రేమించుకున్నారు. అలాంటి సమయంలో క్రిస్టోఫర్ చనిపోవడంతో అలాన్ ట్యూరింగ్ విషాదంలో మునిగిపోయాడు. అయితే గణిత శాస్త్రవేత్తగా ఎదగడానికి ఆ విషాదం ఒక మలుపుగా మారింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో మరింత కష్టపడ్డాడు.
Alan Turing movie
1931లో ఉన్నతమైన ప్రతిభతో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కింగ్స్ కాలేజీలో స్కాలర్ షిప్ సంపాదించాడు. 1933 మార్చిలో ట్యూరింగ్ గణిత తాత్వికతపై బెర్ట్రాండ్ రస్సెల్ రాసిన పుస్తకం చదివి దానిపై వివరించాడు. దీంతో అతడికి గణితంలో ఉన్న ప్రతిభను అందరు గుర్తించారు.
Alan Turing movie
అప్పట్లో కంప్యూటరర్లు లేవు. మనుషులే అన్ని లెక్కలు వేసేవారు. దీనికి అలాన్ ట్యూరింగ్ ఒక యంత్రాన్ని కనిపెట్టాలనుకున్నాడు. దానికి ట్యూరింగ్ అని పేరు పెట్టాడు. పరిశోధనలు చేసి.. ఒక డ్రాఫ్ట్ట్ తయారు చేశాడు. యాంత్రికంగా చేసే కంప్యూటేషన్ అల్గారిదం, ఏదైనా సరే టూరింగ్ యంత్రం చేయగలదని నిరూపించాడు. ఆ డ్రాఫ్ట్‌ను 1936 మధ్యలో న్యూమన్ కు పంపించాడు. అతడు నివ్వెరపోయాడు.
ఎన్నో చర్చలు, వాదోపవాదాలు నడిచాయి. చివరికి యంత్ర సహాయంతో లెక్కలు కట్టే మార్గాన్ని అలాన్ ట్యూరింగ్ కనిపెట్టాడు. అదే ఇప్పటి కంప్యూటర్‌కు మూలం. టూరింగ్ యంత్రంతో అల్గార్ రిదం అనే భావనకు రూపాన్నిచ్చాడు. ఆర్టీ ఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఆద్యుడయ్యాడు.
Alan Turing movie
Alan Turing movie
ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధన శాలలో చేరాడు. ప్రోగ్రామింగ్ చేస్తే దాన్ని గుర్తు తెచ్చుకుని పనిచేసే కంప్యూటర్‌కు రూపకల్పన చేశాడు. 1946లో మాంచెస్టర్ విక్టోరియా యూనివర్సిటీలో చేరి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పై కూడా కృషిచేశాడు. అప్పట్లో ప్రపంచంలో నిజమైన కంప్యూటర్ ‘మాంచెస్టర్ మార్క్1’ను తయారు చేశాడు.
Alan Turing movie
ట్యూరింగ్ తన మేధస్సుతో రెండో ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. జర్మన్ సైన్యాల రహస్య సందేశాలను డీకోడ్ చేసి జర్మన్లు చేయబోయే దాడులను ముందే కనిపెట్టాడు. అలా కొన్ని లక్షలాది మంది ప్రాణాలను కాపాడాడు. కానీ తర్వాత కాలంలో ట్యూరింగ్ తనకున్న లోపం కారణంగా శిక్షకు గురయ్యాడు.

స్వలింగ సంపర్కం విషయంలో అప్పట్లో కఠినమైన చట్టాలు అమల్లో ఉండేవి. ట్యూరింగ్ ఇంకో పురుషుడితో లైంగిక సంబంధం కలిగి ఉన్న విషయం రుజువు కావడంతో అసభ్య ప్రవర్తన నేరంగా పరిగణించి కోర్టు శిక్ష విధించింది. లైంగిక కోరికలు తగ్గించే హార్మోన్ థెరపి తీసుకోమని కోర్టు ఆదేశించింది.
Alan Turing movie
అయితే ఆ మందులను కొన్నాళ్లు వాడి భరించలేక ట్యూరింగ్ సైనైడ్‌లో ముంచిన యాపిల్ ముక్క తిని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటికతని వయస్సు 41 సంవత్సరాలు మాత్రమే. అయితే దాదాపు 60 ఏళ్ల తర్వాత కంప్యూటర్ యుగంపై ట్యూరింగ్ చేసిన సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 2013లో బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పుకుంది.
అలాన్ ట్యూరింగ్‌పై బయోపిక్ కూడా వచ్చింది. The Imitation Game అనే పేరుతో తెరకెక్తకించారు. అతని జీవితంలోని ఎత్తుపల్లాలను, అతని మేథస్సును కళ్లకు కట్టేలా అందులో చూపించారు.
… సూర్యం…