Amrita Shergil Telugu
భారత ప్రముఖ చిత్రకారిణీ ఓ లెస్బియన్ అని తెలుసా..? అమ్ముడు కానీ పెయింటింగ్సే… దేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్స్‌గా ఎలా మారాయో తెలుసా..? దేశానికి అద్భుతమైన కళాఖండాలను అందించిన ఆమె చిన్నవయస్సులోనే ఎందుకు చనిపోయింది..?
అందం.. ప్రతిభ ఆమె సొంతం. ఆమె అమృతా షేర్-గిల్. చూడ్డానికి ఆమె ఓ మంచి పెయిటింగ్‌గా ఉంటుంది. ఆమె చేతుల్లో ఎన్నో కళాఖండాలు రూపుదిద్దుకున్నాయి. రవివర్మ, ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్ల పెయింటింగ్స్‌తో పోల్చి చూస్తే అమృతా వేసిన ఆర్ట్స్ ఏ మాత్రం తీసిపోవు.
Amrita Shergil
అందుకే అమృతా షేర్ గిల్‌ను మెక్సికన్ చిత్రకారుడు ఫ్రీడా కా హ్లోతో పోల్చారు. భారతదేశపు ఫ్రీడా హ్లోగా ఆమెకు పేరు. అమృత షేర్ గిల్ తన పెయింటింగ్స్‌లో భారతీయు సంస్కృతిని బంధించింది.
Bride’s Toilet, Brahmacharis, South Indian Villagers Going to Market వంటి పెయింటింగ్స్ ఆమె కుంచె నుంచే జాలు వారాయి. తన పెయింటింగ్స్‌లో ఉద్వేగాలను కలబోసేది. భారతీయ జీవన విధానాన్ని తన క్వానాస్‌పై వ్యక్తపరిచింది. అద్భుతమైన కళతో ఆమె ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుంది.
Amrita Shergil
దేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌లను చిత్రీకరించిన మహిళా చిత్రకారులు అమృతాయే. కానీ విషాదం ఏమిటంటే ఆమె బతికుండగా ఎవరూ ఆమె పెయింటింగ్స్ కొనలేదు. దాని కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసేది.
అమృత తండ్రి పంజాబీ, తల్లీ హంగేరీ యూదు. తండ్రి పేరు ఉమ్రావ్ సింగ్ షేర్, తల్లీ పేరు మేరీ ఆంటోనియట్ గోటెస్. అమృతకు ఒక చెల్లి ఉంది.
ఐదో ఏట నుంచే అమృత షేర్ గిల్ పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టింది. పెయింటింగ్‌పై ఉన్న ఆసక్తితో 16 ఏళ్ల వయస్సులో ఫ్రాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. 1932లో అమృత వేసిన యంగ్ గర్ల్స్ ఆ మరుసటి సంవత్సరం ప్యారిస్ లోని అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్ పురస్కారానికి ఎంపికైంది.
ఈ పురస్కారం గ్రహించిన అతి చిన్న వయస్కురాలు, ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి, అమృతాయే.
Amrita Shergil
అమృత కుంచెలో ఎన్నో రంగులున్నట్టే.. ఆమె జీవితంలోనూ ఎన్నో కోణాలున్నాయి. ఆమె మగవాళ్లతోనూ.. ఆడవాళ్లతో కూడా సన్నిహితంగా ఉండేది. లైంగిక సంబంధాలు ఉండేవి. Two Women అనే పేరుతో వేసిన చిత్రపటం, తన ప్రేయసి మేరీ లూయిస్‌దేనని అప్పట్లో చాలామంది భావించేవారు.
అమృత 1935లో షిమ్లాలో కలిసిన జర్నలిస్ట్ మాల్కం మగ్లరిడ్జ్‌తో కొంతకాలం సహజీవనం చేసింది. 1938లో విక్టోర్ ఈగాన్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లో ఉండేది. అప్పుడే తన పెయింటింగ్స్‌లో గ్రామీణ జీవితాలను కళా వస్తువుగా ఎంచుకుని చాలా చిత్రపటాలను చిత్రీకరించింది.
Amrita Shergil
అమృతా పెయింటింగ్స్ ప్రముఖ కళా విమర్శకుల మన్ననలను పొందాయి. అయితే ఆమె చిత్రపటాలను ఎవరూ కొనుగోలు చేసేవారు కాదు. ఆ కళా ఖండాలను పట్టుకుని దేశం మొత్తం తిరిగినా ఎక్కడా అమ్ముడుపోయేవి కావు.
లాహోర్‌లో 1941లో పెద్ద కళా ప్రదర్శన ప్రారంభించే కొద్ది రోజుల ముందు అమృత తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆ ఏడాది డిసెంబరు ఆరో తేదీ అర్థరాత్రి చనిపోయింది. లాహోర్‌లోనే అమృతా అంత్యక్రియలు జరిగాయి.
Amrita Shergil
అమృత చనిపోయిన నాటికి వయస్సు 28 ఏళ్లు మాత్రమే. అయితే ఆమె ఎందుకు సడన్‌గా అస్వస్థతకు గురైందనే విషయం ఇప్పటికీ తెలియదు. ఆమె తల్లీ మాత్రం దీనికి కారణం భర్త విక్టోర్ కారణమని ఆరోపించింది. అలా అమృత మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
[…] లెస్బియన్ కుంచె నుంచి అద్భుత పెయింటి… […]