Anasuya Sarabhai Biography in telugu
సడన్‌గా వర్కింగ్స్ అవర్స్‌ను 8 గంటల నుంచి 36 గంటల చేస్తే ఎలా ఉంటుంది..? ఏకదాటిగా నిలబడే పని చేయాలంటే.. ఏమై పోతాము..? ఇక అంతే సంగతులు కదా. కానీ అలాంటి ఎన్నో కష్టాలను మన దేశంలో కార్మికులు అనుభవించారు. ఆ అవస్థలకు చెక్ పెట్టడానికి ఎంతో మంది లీడర్స్ పుట్టుకొచ్చారు. వారి చేసిన పోరాటాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. వారి వేసిన బాటల్లోనే సాగుతున్నాం. అలాంటి లేడీ లేబర్ లీడర్ అనసూయ సారాభాయ్ (Anasuya Sarabhai).
Anasuya Sarabhai Biography in telugu
ఉమెన్స్ డే వెనుక ఉన్న అసలు కారణం తెలిసినవారెవరికైనా.. కార్మిక పోరాటాలకు ఆడవాళ్లకు ఎంత దగ్గర సంబంధం ఉందో తెలుస్తోంది.
కార్మిక సంఘాలు, కార్మిక పోరాటాల్లో ఆది నుంచి మహిళలు ముందు వరసలోనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది మహిళలు కార్మికోద్యమాలకు లీడర్‌లుగా వ్యవహరించారు. లేబర్ హీరోయిన్స్‌గా చరిత్రకెక్కారు. అలా మన దేశంలో కూడా అనసూయ సారాభాయ్ (Anasuya Sarabhai Biography) మొట్టమొదటి కార్మిక నాయకురాలు.
36 గంటల ఏకదాటిగా పనిచేసి ఇంటికి వెళ్తున్న మహిళా కార్మికుల పరిస్థితి సారాభాయ్ జీవితాన్ని మార్చేసింది. కార్మికులను మంచి స్థితిని కల్పించే లక్ష్యంతో పిడికిలి బిగించింది. తన చదువుకున్న చదువును, తన నాలెడ్జ్‌ను, శారీరక, మానసిక బలాలను.. కార్మికుల కోసం వెచ్చించింది. అందుకే అనసూయ సారాభాయ్ పేరు లేకుండా భారత కార్మికోద్యమ చరిత్రను స్మరించుకోలేం.
Anasuya Sharabai
అనసూయ సారాభాయ్ (Anasuya Sarabhai Biography)గుజరాత్‌లో (మోటాబెన్) పెద్దక్కగా అందరికీ పరిచయం. అహ్మదాబాద్‌లోని ఓ రిచ్ ఫ్యామిలీలో నవంబర్ 11, 1885లో ఆమె పుట్టింది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టినా.. కార్మిక కష్టాలను చూడడం నిజంగా ఆమె వ్యక్తిత్వంలోనే గొప్పతనంగా చెప్పుకోవాలి.
తొమ్మిదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో బాబాయ్ చిమన్‌భాయ్ సారాభాయ్ ఆమెను పెంచారు. 13 ఏళ్లకే పెళ్లి చేసేశారు. ఆ పెళ్లి ఎంతోకాలం నిలబడలేదు.
దీంతో ఆమె సోదరుడు చదువుకోమంటూ లండన్‌కు పంపించారు. ఆ లండన్ చదువే అనసూయ సారాభాయ్‌పై చాలా ప్రభావం వేసింది. సోషలిజంలోని ఫేబియన్ ఫిలాసఫీ నుంచి ఆమె స్ఫూర్తి పొందింది. ఇంగ్లండ్‌లోని మహిళా హక్కుల ఉద్యమంలోనూ పాల్గొనేలా చేసింది.
Anasuya Sarabhai Biography in telugu
కుటుంబ సమస్యల వల్ల మధ్యలోనే చదువును మానేసి ఆమె ఇండియా వచ్చేసింది. అప్పుడే ఆమె బలహీనమైన వర్గాలతో కలిసి పని చేయాలని నిశ్చయించుకుంది.
కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అనుమతించే అమ్మాయిల కోసం ఒక స్కూల్‌ను ప్రారంభించింది. తర్వాత ఆడవాళ్ల కోసం వెటర్నరీ హోమ్, టాయిలెట్స్, హాస్టల్స్ ఓపెన్ చేసింది.
ఇలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన అనసూయ సారాభాయ్ జీవితాన్ని ఒక ఘటన మార్చేసింది. ఒక రోజు ఉదయం ఆమెకు 15 మంది చాలా నీరసంగా వెళ్తున్న మహిళా కార్మికులు కనిపించారు.
ఏమైందని వారిని అడగగా ఏ విరామం లేకుండా 36 గంటలు పనిచేసి వస్తున్నామని చెప్పారు. దాంతో ఆమె చలించిపోయింది. నూలు పరిశ్రమ కార్మికుల కోసం ఆమె అప్పుడే పోరాటం ప్రారంభించింది.
Anasuya Sharabai
కార్మికుల పని గంటలు, పేదరికం, ఒత్తిడి, అణచివేత గురించి మరింత తెలుసుకున్నాక ఈ పరిస్థితిని మార్చాలని, దాని కోసం పోరాడాలని అనసూయ సారాభాయ్ నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఆమె సొంత జీవితంలో కలకలాన్ని సృష్టించినా ఆగలేదు.
చదువుకోమని ఏ సొదరుడైతే ప్రోత్సహించాడో ఆయనకే వ్యతిరేకంగా అనసూయ సారాభాయ్ గొంతు ఎత్తాల్సి వచ్చింది. తన సొంత సోదరుడికి వ్యతిరేకంగా ఆమె ఉద్యమం చేయాల్సి వచ్చినా.. అనసూయ సారాభాయ్ వెనక్కి తగ్గలేదు.
Anasuya Sharabai
1914లో మిల్లు యజమానులకు వ్యతిరేకంగా 21 రోజులు సమ్మే (Labour Movement) చేసింది. ఆ సందర్భంలో ఆమె సోదరుడు అంబలాల్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ అధిపతిగా ఉంటే.. అనసూయ సారాభాయ్ కార్మిక నాయకురాలుగా (Anasuya Sarabhai Political Career) నిలిచింది. దీంతో సోదరుడి కోపానికి ఆమె గురికాక తప్పలేదు. అయినా అనసూయ సారాభాయ్ కార్మికుల పక్షానే నిలబడ్డారు. కార్మికులకు మెరుగైన వసతులు, నిర్దిష్ట పని గంటల కోసం ఆమె పోరాటం చేశారు. ఆమె నాయకత్వం వహించినా సమ్మెల్లో 1918 నాటి సమ్మె చాలా ముఖ్యమైనది.
Anasuya Sarabhai Biography in telugu
1920లో మజ్దూర్ మహాజన్ సంఘ్‌ను ఆమె స్థాపించారు. ప్రస్తుతం దీనిని అహ్మదాబాద్ టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్ అని పిలుస్తున్నారు. అలా మన దేశంలో కేవలం కార్మికుల కోసమే కాకుండా మహిళల కోసం జరిగిన పోరాటాల్లో ఆమె పాల్గొన్నారు.
అలా చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని రచించుకున్న గొప్ప మహిళా నాయకురాలు అనసూయ సారాభాయ్. అలా తన జీవితాన్నీ సార్థకం చేసుకున్న ఆమె 1972లో ఆమె చనిపోయింది.