Biography of Milkha Singh
ఆయన వెళ్లిపోయుండొచ్చు.. కానీ అతని విజయగాథ ఇక్కడ సంభాషిస్తూనే ఉంటుంది. దేహం విడిచిపోయుండొచ్చు.. దేశం మాత్రం ఆయనిచ్చిన ప్రేరణ స్మరిస్తూనే ఉంటుంది. ఆకలి వెతల నుంచి.. అంతర్జాతీయ స్థాయికి తీసిన ఆయన పరుగు.. ఎంతోమంది గుండెల్లో ప్రేరణగా నిలిచే ఉంటుంది. ఆయనే మిల్కాసింగ్ (Biography of Milkha Singh).
ఏ రంగంలోనైనా తమ ప్రతిభతో ఎదిగిన వారంటే ఎవరికైనా.. అభిమానం ఉంటుంది. కానీ కన్నీళ్లను, ఆకలితో నిండిన రోదనను, అయినవాళ్లు అందరూ దూరమైన కఠిన క్షణాలను దాటుకుని తన ప్రతిభను చాటుకున్న వారిపై ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తే మిల్కా సింగ్.
Biography of Milkha Singh
మిల్కా సింగ్ లైఫ్‌లో (Biography of Milkha Singh) కేవలం పరుగు మాత్రమే లేదు. కన్నీటి కథ ఉంది. ఎవరూ తీర్చలేని దు:ఖం ఉంది. ఆయన జీవితంలో రాచపుండులా సలిపే ఓ నెత్తుటి గాయం ఉంది. గుండె పగిలిన కాలాన్ని దాటి.. అత్యున్నత స్వర్ణ యుగంలోకి అడుగులు వేసిన గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మిల్కాసింగ్.
జీవితం సజావుగా సాగదు.. ఎన్నో పరీక్షలు పెడుతుంది. చంపకుండా.. చావుదెబ్బలు కొడుతుంది. ఓడగొట్టి.. పడగొట్టి.. పరిహసిస్తుంది. అలాంటి అనుభవాలను మిల్కా సింగ్ దాటుకొచ్చాడు. అందుకే ఆయన లైఫ్ స్టోరీ తెలుసుకోవడం ఓ అవసరం.
Biography of Milkha Singh
మిల్కాసింగ్ (early life of milkha singh 1932 నవంబర్ 20న పంజాబ్‌లోని గోవింద్‌పురలో జన్మించాడు. ఇండియా, పాకిస్థాన్ విడిపోయే రోజుల్లో మత హింస జరిగింది. హిందువులు, సిక్కుల మధ్య అల్లర్లు జరిగేవి. అలా అల్లరిమూక ఓ ఇంటిపై చేసిన దాడిలో బాలుడుగా ఉన్న మిల్కా సింగ్ ఇతర బాలురతో కలిసి అడవిలోకి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ దాడిలో మిల్కా సింగ్ తల్లీదండ్రులు, తోబుట్టువులు ప్రాణాలు కోల్పోయారు.
తన వాళ్ల మరణ ఘోషను గుండెల్లో నింపుకుని.. ఆ పెను దు:ఖాన్ని కన్నీటితో దింపుకుని దేశం దాటాలని ఢిల్లీ రైలెక్కాడు. మహిళల కంపార్టుమెంటులో వాళ్ల కాళ్ల దగ్గర అడుక్కుని సోదాల నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకున్నాడు.
అలా ఢిల్లీ చేరుకున్న మిల్కా సింగ్ (Biography of Milkha Singh) బతకడానికి ఎంతో కష్టపడేవాడు. తర్వాత ఆయన సైన్యంలో చేరడానికి ప్రయత్నించారు. అలా మూడుసార్లు విఫలమయ్యారు. నాలుగో ప్రయత్నంలో ఎంపికయ్యాడు. చిన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పాఠశాలకు వెళ్లివచ్చిన అనుభవం దీనికి ఉపయోగపడింది.
Biography of Milkha Singh
తర్వాత ఆయన జీవితం ఓ టర్న్ తీసుకుంది. అక్కడ అదనంగా ఒక గ్లాసు పాలు కోసం పరిగెత్తడం ఆరంభించి ఆటలకు సెలక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి పరుగే ప్రాణంగా పరిగెత్తడం ప్రారంభించాడు.
కాళ్లకు బూట్లు, ట్రాక్ సూట్, ట్రైనర్ లేకుండా మూడేళ్లు పరిగెత్తాడు. తన కాళ్లలో ఉండే సామర్థ్యాన్ని గుర్తించిన తను.. చాలా కఠినమైన వ్యాయమాలను చేసేవాడు. ఒక్కోసారి.. కాళ్ల నుంచి రక్తం కూడా వచ్చేది.
ఆయన పరుగుకు 1958లో మొదటి గుర్తింపు లభించింది. అప్పుడు కార్డిఫ్‌లో జరిగిన కామన్ వెల్త్ పోటీల్లో గెలుపొంది పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అక్కడ నుంచి పతకాలు ఆయన వెంటే పరుగులు తీశాయి.
మొత్తం 80 ఈవెంట్లలో పాల్గొన్న అతడు 77 సార్లు గెలిచాడు. ఇందులో మొదటిది పాకిస్థాన్‌లో జరిగిన ఓ పోటీలో పాల్గొనడం. ఈ పోటీలో పాకిస్థాన్ ప్రత్యర్థినే కాదు అక్కడి ప్రజల హృదయాల్నీ గెలుచుకున్నాడు.
Biography of Milkha Singh
మిల్కా పరుగుకు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ “మిల్కా, నువ్వు మా దేశంలో పరుగెత్త లేదు, ఆకాశంలో పక్షివై ఎగిరావు” అన్నాడు, అతడికి “ఫ్లయింగ్ సిఖ్” అనే బిరుదునిచ్చాడు. అదే పేరుతో మిల్కా ప్రసిద్దుడయ్యాడు.
1958 జాతీయ క్రీడల్లో మిల్కాసింగ్‌కు (Bio sketch of milkha singh) రెండు స్వర్ణ పతకాలు లభించాయి. కామన్‌వెల్త్ పోటీల్లో అరుదైన ఘనత సాధించాడు. మిల్కా 46.6 సెకన్లలో 440 యార్డ్స్ పరిగెత్తి స్వర్ణం గెలిచాడు. భారత్ తరపున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా మిల్కా గుర్తింపు పొందాడు. నాలుగు దశాబ్దాలుగా మిల్కాసింగ్ రికార్డు చెక్కు చెదరలేదు.
Biography of Milkha Singh
1959లో మిల్కాసింగ్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తర్వాత ఆయనకు 2001లో అర్జున పురస్కారం ప్రకటించింది. కానీ ఆయన ఆ అవార్డును తిరస్కరించాడు. మిల్కాసింగ్ జీవితం ఆధారంగా భాగ్ మిల్కా భాగ్ చిత్రం తెరకెక్కింది. అందులో ఫర్హాన్ అక్తర్ మిల్కాసింగ్ పాత్రను పోషించాడు.
నేల మీద నుంచి నింగికెగిసిన… మిల్కా లైఫ్.. ఎంతో మంది యువతకు ఒక పాఠం. నిరాశ, నిస్పృహలతో కూలబడిన వారిని తట్టి లేపే.. అంకుశం. ప్రతి ఒక్కరూ Milkha Singh గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.