Dalton Trumbo
ధిక్కారం ఎప్పుడూ దడ పుట్టిస్తుంది.. వ్యక్తిలోనైనా.. వ్యవస్థలోనైనా సరే..! ఒక మనిషి ‘నేను చేయను’.. అని చెబితే వ్యవస్థల్లో భయం మొదలవుతుంది..! ఆ భయం ఎలా ఉంటుందంటే ఆస్కార్ అవార్డు అందుకోగల మేధావిని కూడా జైల్లో పెట్టేంతగా ఉంటుంది..! అలాంటి వ్యక్తే అమెరికన్ స్క్రీన్ రైటర్ డాల్టన్ ట్రంబో (Dalton Trumbo)
Dalton Trumbo
దేశంలో తమ అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించగలిగే స్వేచ్ఛ ఉండాలి. అది లేకపోతే ఆ స్వేచ్ఛ కోసం ఎందాకైనా వెళ్లాలి. అలా వెళ్లిన వ్యక్తే డాల్టన్ ట్రంబో. ఒక సందర్భంలో సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో జైలు శిక్షకు, హాలీవుడ్ బహీష్కరణకు గురయ్యాడు.
అయితే ఆ జైలు శిక్షలు, బహీష్కరణలు డాల్టన్ ట్రంబోలోని ప్రతిభను అడ్డుకోలేకపోయాయి. ఆయన చేతిలో కలం కదలడాన్ని నియంత్రించలేకపోయాయి. పెద్ద పెద్ద అవార్డులు సైతం వెతుక్కుంటూ వచ్చాయి.
ట్రంబో నవలలు, కథలు రచించారు. అనేక సినిమాలకు స్క్రీప్ట్ రైటర్‌గా పనిచేసి.. తిట్టిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకున్నారు. తన నమ్మే విశ్వాసాలకు కట్టుబడి ఉంటూనే అందరి మన్ననలను పొందారు.
డాల్టన్ ట్రంబో (Dalton Trumbo)
డాల్టన్ ట్రంబో (Dalton Trumbo) 1905లో డిసెంబర్ 9న కొలరాడోలోని మాంట్రోస్లో మౌడ్‌లో పుట్టారు. ట్రంబో అమెరికన్ స్క్రీన్ రైటర్, నవలా రచయిత. ఆస్కార్, ఎక్సోడస్, థర్టీ సెకండ్స్ ఓవర్ టోక్యో వంటి అనేక అవార్డులు గెలుచుకున్న సినిమాలకు డాల్టన్ ట్రంబో స్క్రిప్ట్ అందించారు.
స్పార్టకస్, రోమన్ హాలిడే వంటి అద్భుతమైన హాలీవుడ్ సినిమాలకు కథను అందించిన వ్యక్తి. మాజీ కమ్యూనిస్ట్ సభ్యుడు. కమ్యూనిస్టు పార్టీలో కొన్ని సంవత్సరాలు పనిచేశారు.
Dalton Trumbo బ్లాక్ లిస్ట్, జైలు శిక్ష
1940లో చాలామంది మేధావులు, కళాకారులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అలాగే ట్రంబో (Dalton Trumbo) కూడా 1943లో ఫార్టీలో చేరారు. అయితే తర్వాత కాలంలో పూర్తిగా రచయితగానే ఉండిపోయారు. 1947లో మోషన్ పిక్చర్ పరిశ్రమలో కొంతమంది రచయితలు కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.
దాంతో హౌస్ అన్-అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ (HUAC) విచారణ చేపట్టింది. ఆ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి డాల్టన్ ట్రంబో నిరాకరించారు.
ఆయనతో పాటు మరో తొమ్మిది మంది స్క్రీప్ట్ రైటర్లు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకోలేదు. హాలీవుడ్‌లో ఉన్న కమ్యూనిస్టుల పేర్లు చెప్పడానికి, వారి కమ్యూనిస్ట్ అనుబంధాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
దాంతో వారంతా బహీష్కరణకు గురయ్యారు. అమెరికన్ పార్లమెంట్‌ను ధిక్కరించారనే నేరంతో వారందరికీ 11 నెలలు జైలు శిక్ష పడింది. హాలీవుడ్ పరిశ్రమలో ఇతర వందలాది మంది నిపుణులు ఈ పదిమందిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు.
ఆగని రాత
ట్రంబో జైలుకు వెళ్లి, హాలీవుడ్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ రాయడం మాత్రం ఆపలేదు. విచిత్రంగా ఆ సమయంలోనే మంచి రచనలు చేశారు. జైలు నుంచి బయటకొచ్చాక కూడా మారుపేర్లతో పలు సినిమాలకు స్క్రిప్ట్‌లను అందించారు. క్లాసిక్ గన్, రోమన్ హాలీడే వంటి వైవిధ్యమైన సినిమాలకు స్క్రిప్ట్ రాశారు.
ట్రంబో 1956లో రాబర్ట్ రిచ్ అనే పేరుతో ది బ్రేవ్ వన్ సినిమాకు కథ రాశారు. దీనికి ఆస్కార్ అవార్డు వచ్చింది. 1975లో ట్రంబోను ఆస్కార్‌తో బహుకరించడం జరిగింది. హాలిడే స్క్రిప్ట్ కోసం 1993లో అతని భార్య క్లియో రోమన్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
బేకరీ బాయ్‌గా
ట్రంబో ఒక్కసారిగా రచయిత అయిపోలేదు. తన కెరీర్ మలుచుకోవడంలో అనేక మలుపులు ఉన్నాయి. ఎత్తుపల్లాలు ఉన్నాయి. మొదట్లో డబ్బు కోసం బ్రెడ్ బేకరిలో పనిచేసేవారు. అలా పదేళ్ల పాటు పనిచేశారు. 1925 నుంచి 1934 వరకూ రాత్రిపూట రొట్టెలను ప్యాకింగ్ చేసేవారు. పగటి పూట రచనలు చేసేవారు. 1973 నుంచి ట్రంబో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడేవారు. 1976 సెప్టెంబర్10న 70 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో లాస్ ఏంజిల్స్‌లో మరణించారు.
1995లో ట్రంబో బయోపిక్ కూడా వచ్చింది. ట్రంబో అనే పేరుతో సినిమా విడుదలైంది. చాలామంది ఆ సినిమాని చూసి నచ్చుకున్నారు.
దేశం కోసం ప్రాణం వదిలిన తొలి ముస్లిం : అష్ఫాకుల్లా ఖాన్