Different Voice
అధికార పక్షం ‘‘మేం చేస్తున్నాం’’ అంటుంది.. ప్రతిపక్షం.. ప్రభుత్వం ఏమి చేసినా వ్యతిరేకిస్తుంది. ఇందులో కుర్చీ కాపాడుకోవాలనేది ఒకరి లక్ష్యమై ఉంటే.. కుర్చీని సాధించుకోవడం మరొకరి లక్ష్యమై ఉంటుంది.
ఈ రెండు పక్షాల వాయిస్‌లు కాకుండా.. మరో వాయిస్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. అదీ పీడిత ప్రజల కోసమే వినిపిస్తుంది. ప్రజల్లో ఒకరిగా ఉంటూ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారంతా ప్రజాపక్షాన నిలబడుతున్నారు.
ఇందులో ఓ యంగ్ యూ ట్యూబర్ ఉన్నారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విలక్షణ నటుడున్నాడు. ఓ కథా రచయిత ఉన్నాడు. ఓ సామాజిక కార్యకర్త ఉన్నాడు.
Different Voice
ఇలా డిఫరెంట్ వేల్లో తమకంటూ ఓ స్థానాన్నిఏర్పరచుకున్నవాళ్లంతా.. ఇప్పుడు తమ గళాలను విప్పుతున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయం కాదని తెగెసి చెబుతున్నారు. ఎవరికి వారే విడివిడిగా ఉంటూనే అందరూ ఒకే లక్ష్యం కోసం తమ గొంతులను సవరించుకుంటున్నారు.
ఎవరు ఏ రంగంలో ఎక్స్‌పర్ట్స్ అయినా సమాజంలో కల్లోల పరిస్థితులున్నప్పుడు స్పందించడం ఓ ఆరోగ్యకరమైన విషయం. అటువంటి సందర్భాల్లో ఈ మధ్య వివిధ రంగాలకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. తమదైన వాణీని వినిపిస్తున్నారు. సమాజం పట్ల తమకున్న బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అలా పంజాబ్ రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై చాలామంది రియాక్ట్ అయ్యారు.
Different Voice
‘‘కేంద్రం దిగివచ్చి రైతుల డిమాండ్లను ఆమోదిస్తుందన్నది ఉత్తమాట. అయితే వారు రెండు అంశాల్లో విజయం సాధించారు. ఢిల్లీకి రాకుండా ఏ శక్తీ వారిని అడ్డుకోలేకపోయింది. తమపై పడిన ఖలీస్తానీ నిందను తుత్తినియలు చేశారు. తమను అడ్డగించడానికి వచ్చిన పోలీసులకు కూడా ఆహారం అందించి నిరసనంటే మానవత్వాన్ని మరవడం కాదని నిరూపించారు.’’ అంటూ ప్రముఖ కమేడియన్ ఆకాశ్ బెనర్జీ స్పష్టంగా తెలియజేశారు.
ధ్రువ్ రాతీ అనే 26 ఏళ్ల యంగ్ యూ ట్యూబర్ అయితే.. ఇంకొంచెం ముందుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ తీరుపై తనదైన శైలీలో రియాక్ట్ అయ్యాడు. బీజేపీ దృష్టిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఝాన్సీకీ రాణి అని.. 80 ఏళ్ల వృద్ధురాలైన మహిళా రైతు ఖలీస్థానీ అంటూ ఓ సెటైర్‌ను ట్వీట్ చేశాడు.
‘‘ఢిల్లీలో అనేక మసీదులు పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైతుల కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాయి. సీఏఏ, ఎన్‌ఆర్సీ ఉద్యమాల సమయంలో సిక్కులు బాసటగా నిలిచినందుకు కృతజ్ఞతగా తాము ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. ఈ కారుణ్య దృక్పథం, ఐక్యత అసహన పాలకులను కలవరపరుస్తున్నాయి.’’ అంటూ ఓ సామాజిక కార్యకర్త, మహమ్మద్ అజ్మల్ ఖాన్ అన్నారు.
Different Voice
రైతుల పోరాటంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. ‘‘ప్రియమైన నరేంద్ర మోడీజీ రైతుల మీ అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తూనే ఉంటారు. మిమ్మల్నీ జవాబుదారీగా మారుస్తారు. మీ ఈ వాస్తవం నుంచి ఎంతకాలం పారిపోతారు..?’’ అంటూ ప్రశ్నించారు.
అలాగే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటగా ముస్లింలపై తర్వాత ఉదారవాదులపై జాతీ వ్యతిరేక ముద్ర పడింది. ఇప్పుడు రైతుల వంతు వచ్చినట్టు కనిపిస్తోంది.. అంటూ ప్రముఖ కథా రచయిత శివ్ రాందాస్ స్పందించారు.
అదే విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఓ సినిమాలో ఇద్దరు ప్రేమికులు ఓ గుడి దగ్గర ముద్దు పెట్టుకునే సీన్ ఉందని చెబుతూ ఒక బీజేపీ యువ నాయకుడు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రేమను, మతంతో ముడిపెట్టడంపై చాలామంది తప్పుబట్టారు. ఆ విషయాన్ని అలా చూడడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు.
‘‘నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే అది లవ్ జీహాద్. కానీ నీపై అత్యాచారం చేసిన మనిషిని మాత్రం పెళ్లి చేసుకోవచ్చు. ఇదేనా న్యాయం..?’’ ఇందిరా జైసింగ్, అనే న్యాయవాది క్వశ్చన్ చేశారు. ‘‘2020లో ఇండియా నెమ్మదిగా ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ఎలా ఉండిందో అలా కనబడుతోంది’’ అంటూ ఆర్థిక వేత్త రూపా సుబ్రహ్మణ్య అన్నారు.
Different Voice
ఇలా సొసైటీలో వస్తున్న అనేక ప్రాబ్లమ్స్‌పై చాలా మంది సోషల్ మీడియా డయాస్‌పై స్పందిస్తున్నారు. ధైర్యంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఇదొక పాజిటివ్ విషయం. అయితే ఇన్ని గళాలను వినిపించాల్సిన సందర్భం ఎందుకొచ్చిందనే విషయాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.
సమాజంలో నిజంగా రైతులు, కార్మికులు బాగుంటే.. ఇంతమంది స్పందించాల్సిన అవసరం ఉండకపోయేది. ప్రతీది డెమోక్రటిక్‌గా సాగుతుంటే సోషల్ మీడియాలో సెటైర్లు, కార్టూన్లు హల్ చల్ కాకుండా ఉండేవి. అందుకే అలాంటి రోజు కోసం ఈ భిన్న స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి.
భ్రష్టు బ్రాహ్మణత్వ నశించాలి