DNA Rosalind Telugu
కష్టం ఒకరిది.. క్రెడిట్ ఇంకొకరికి..! శ్రమ ఒకరిది పేరు మాత్రం మరొకరికి..! మానవ చరిత్రలో విలువైన విషయాలను, వస్తువులను కనిపెట్టిన నిజమైన వ్యక్తులకు పురస్కారాలు అందలేదు..! వేరే వ్యక్తులు ఆ అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు..! కష్టాన్ని.. మేధో శ్రమని దోచుకున్నారు..! అలా చరిత్ర పుటల కింద ఉండిపోయిన మరో వ్యక్తి రోసలిండ్ ఫ్రాంక్లిన్. కేవలం మహిళ అయినందు వల్లే.. ఈమెకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదు.
ప్రపంచానికి డీఎన్ఏ తెలిసినంతగా.. రోసలిండ్ ఫ్రాంక్లిన్ గురించి తెలియదు. అసలు డీఎన్‌ఏను ఎన్ కోడ్ చేసింది రోసలిండ్ ఫ్రాంక్లిన్. కానీ డీఎన్‌ఏను కనిపెట్టినట్టుగా జేమ్స్ డీ వాట్సాన్, క్రిక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు నోబుల్ ప్రైజ్ తీసుకున్నారు.
DNA Rosalind బాల్యం
రోసలిండ్ ఫ్రాంక్లిన్ 1920లో లండన్‌లో పుట్టారు. టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచే తాను ఓ సైంటిస్ట్ కావాలనుకుంది. కానీ అప్పట్లో మహిళలు చేయగలిగేంత సులభమైన ప్రొఫెషన్ కాదు.
అయినా రోసలిండ్ ఆ వైపుగానే అడుగులు వేశారు. కేంబ్రిడ్జ్ నుంచి స్కాలర్‌షిప్‌ను పొంది కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు. 1951లో కింగ్స్ కాలేజ్‌లో జాయిన్ అయ్యారు. అక్కడ డీఎన్‌ఏ స్టక్చర్‌పై స్టడీ చేశారు.
DNA Rosalind డీఎన్‌ఏపై పరిశోధన.
డీఎన్‌ఏ అనేది సైన్స్‌లో చాలా కష్టమైన టాపిక్. అయినా కాలేజీలో ఎక్స్‌రే ల్యాబ్‌లో నిరంతరం శ్రమించారు. అప్పట్లో తనతోటి కొలిగ్స్ అందరూ మగవాళ్లే ఉండేవారు. కానీ వాళ్లంతా ఆమెతో కలిసేవారు కాదు.
దూరంగా పెట్టేవారు. ఆ క్రమంలోనే మేరిక్ వీకిన్స్ అనే ల్యాబ్ మేట్‌తో కూడా రోసలిండ్ ఫ్రాంక్లిన్‌కు గొడవ జరిగింది. కానీ రోసలిండ్ తన పని ఎక్కడా ఆపలేదు. 1952లో డీఎన్‌ఏకు సంబంధించిన ఎక్స్‌రేను కనుగొన్నది.
వంద గంటల్లో పొందగలిగిన డీఎన్‌ఏ ఇమేజ్‌ను వివరించడానికి, విశ్లేషించడానికి మాత్రం ఒక సంవత్సరం పట్టింది.
DNA Rosalind మోసం
అదే సమయంలో అమెరికా బయోలజిస్ట్ జేమ్స్ వాట్సాన్, బ్రిటిష్ ఫిజియోజిస్ట్ ఫ్రాన్సిక్స్ క్రిక్‌లు కూడా డీఎన్‌ఏ స్ట్రక్చర్‌పై పరిశోధనలు జరిపారు. రోసలిండ్ అంటే పడని ల్యాబ్ మేట్ మేరిక్ వీకిన్స్ రోసలిండ్ కనిపెట్టిన స్ట్రక్చర్‌కు సంబంధించిన ఫొటోను.. వాట్సాన్, ఫ్రాన్సిక్స్ క్రిక్‌లకు అందజేశాడు.
దాంతో వారు ఫ్రాంక్లిన్ డేటాను మొత్తం విశ్లేషించి.. దాని ఆధారంగా వారు డీఎన్‌ఏకు సంబంధించిన కచ్చితమైన స్ట్రక్చర్‌ను కనుగొన్నారు. 1953లోని ఏప్రిల్లోని వారి కనిపెట్టిన డీఎన్‌ఏ మోడల్ గురించి పుస్తకం కూడా రాసి ప్రచురించారు.
అదే సమయంలో రోసలిండ్ కూడా తన పరిశోధనలు పూర్తి చేసి ఆ వివరాలను బుక్‌గా తయారు చేసుకున్నారు. తర్వాత కాలంలో వాట్సన్, క్రిక్‌లు కనుగొన్న విషయాలు, రోసలిండ్ చేసిన పరిశోధనలు కలిపి జర్నల్‌గా ప్రచురించడం జరిగింది. కానీ రోసలిండ్ కనిపెట్టిన అత్యంత విలువైన విషయాలు చివరి పేజీలకు పరిమితం అయ్యాయి. అప్పట్లో వాట్సాన్, క్రిక్‌లు ఆమె పరిశోధనలను సంగ్రహించినట్టు ఎవరికి తెలియదు.
డీఎన్ఏ పరిశోధనలకు సంబంధించి 1962లో వాట్సాన్, క్రిక్, మేరిక్ వీకిన్స్ నోబుల్ ప్రైజ్‌ను అందుకున్నారు.
రోసలిండ్ 1958లో అండాశయ క్యాన్సర్‌తో చనిపోయారు. 1956 చివరిలో ఫ్రాంక్లిన్‌కు అండాశయ క్యాన్సర్ ఉందని తెలిసింది. మూడు ఆపరేషన్లు, కెమోథెరపీ జరిగినప్పటికీ ఆమె నిరంతరం పనిచేస్తూనే ఉండేది. ఏప్రిల్ 16న 37 సంవత్సరాల వయస్సులో మరణించింది.
ఇప్పటికే మన దేశంలో మహిళలపై ఎంతో వివక్షత ఉంది. అలాంటిది ఆ సమయంలో రోసలిండ్.. ఎన్ని ఎదుర్కొని .. తన చదువును, పరిశోధనలను కొనసాగించారో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్‌లో ఫొటోగ్రాఫ్ 51 అనే పేరుతో రోసలిండ్ ఫ్రాంక్లిన్ బయోపిక్ కూడా వచ్చింది.
DNA Rosalind డీఎన్ఏ
వైద్య శాస్త్రంలో డీఎన్‌ఏ (Deoxyribonucleic acid) అనేది ఎంత కీలకమైనదో ఇప్పుడు అందరికీ తెలుసు. ప్రతి జీవిలో డీఎన్ఏ ఉంటుంది. కేవలం డీఎన్‌ఏ కారణంగానే ఒక్కోక్కరూ ఒక్కో విధంగా కనిపిస్తారు.
డీఎన్ఏ శరీరంలోని కణాల్లోని నూక్లియస్‌లో ఉంటుంది. డీఎన్‌ఏ పరీక్ష చేసి ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టవచ్చు. విషయం ఏమిటంటే ప్రాణం ఉన్న ప్రతి జీవిలో డీఎన్ఏ ఉంటుంది. జంతువుల్లో ఉండే డీఎన్‌ఏ, మనుషుల్లో ఉండే డీఎన్‌ఏ 90 శాతం ఒకేలా ఉంటుంది. ఆ పది శాతం మాత్రం తేడా వల్లే మనం మనుషులుగా మారాం.
You can Also like these posts also