Menu
Youtube first video

యూ ట్యూబ్‌ ఫస్ట్ వీడియో ఏంటో తెలుసా..?

Do you know what is the first YouTube video ?

యూ ట్యూబ్ (Youtube) గురించి అందరికీ తెలుసు.. ఎన్నో సంచలనాలకు, ఎన్నో మార్పులకు నాంది పలికిన యూ ట్యూబ్ అసలు ఎలా స్టార్ట్ అయింది..? తెలగులో ఏ యూ ట్యూబ్ ఛానల్‌కు ఎక్కువ ఫాలోయింగ్ ఉందో తెలుసా..? తెలుగులో ఏ యూట్యూబర్ ఎక్కువ సంపాదించారు..?

Do you know what is the first YouTube video?

యూట్యూబ్ అమెరికన్ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ఫ్లాట్ ఫామ్. దీనిని 2005లో Chad Hurley, Steve Chen, and Jawed Karim అనే ముగ్గురు స్టాఫించారు. 2006లో దీనిని 1.65 కోట్ల డాలర్లకు గూగుల్ కొనుగోలు చేసింది.

మొదట Chad Hurley, Steve Chen, and Jawed Karim ముగ్గురు కలిసి మొదట ఆన్‌లైన్ డేటింగ్ సర్వీస్‌ను మొదలుపెట్టారు. కానీ అది చివరికి విఫలమైంది. తర్వాత వాళ్లు సాధారణ ప్రజల వీడియోలేవీ ఇంటర్‌నెట్‌లో లేవనే విషయాన్ని గ్రహించారు. అప్పుడే వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్‌ ఏర్పాటు ఆలోచన వచ్చి.. క్రియేట్ చేశారు.

మొట్టమొదటి యూట్యూబ్ వీడియోlr (Youtube video) ఏప్రిల్ 23, 2005న అప్‌లోడ్ చేశారు. యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం 18 సెకన్ల వీడియోను “మీ ఎట్ జూ” (Me at the zoo) పేరుతో పోస్ట్ చేశారు.

Do you know what is the first YouTube video ?

అప్పుడు మొదలైన యూ ట్యూబ్ ప్రయాణం ఎల్లలు దాటి.. అన్ని దేశాలకు ప్రయాణం చేస్తూనే ఉంది. అన్ని దేశాల ప్రజలను ఏకం చేస్తూ.. ఎక్కడెక్కడో విషయాలని కళ్ల దగ్గరకు తీసుకోచ్చేసింది.

ఎంతో మంది వీక్షకులను తన వశం చేసుకుంది. ఎంటర్‌టైన్ మెంట్‌కు అసలు సిసలు కేరాఫ్‌గా నిలిచింది. ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు యూట్యూబ్‌ ఇప్పుడు.. మంచి వేదికైంది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని… పెద్దవాళ్ల వరకూ అందరిని అలరిస్తుంది. అంతేకాదు యూ ట్యూబ్‌తో సామాన్యుల సైతం సెలబ్రిటీలుగా మారారు.

Do you know what is the first YouTube video ?

యూట్యూబ్‌లో నమోదైన సభ్యులు తమ వీడియోలను ఎన్నైనా ఎక్కించవచ్చు. వేరే వాళ్లు అప్‌లోడ్ చేసిన వీడియోలను చూడొచ్చు. నచ్చిన వీడియోలను ఇతరులకు ఫార్వార్డ్ చేసుకోవచ్చు. రేటింగ్ ఇవ్వొచ్చు. వేరేవారిని ఫాలో అవ్వొచ్చు.

యూ ట్యూబ్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. యూ ట్యూబ్ ఒక సంచలనం.. సమాజ గమనాన్ని అకస్మాత్తుగా పరుగులు పెట్టించిన ఓ సాధనం. అటువంటి యూ ట్యూబ్‌ ద్వారా ఎందరో ధన వంతులుగా మారారు. చిన్న పిల్లల దగ్గర నుంచి.. కడు పేదరికంలో ఉన్నవాళ్లు గుర్తింపు పొందారు.

ప్రస్తుతం ఇండియాలో కామెడీ కంటెంట్ కింగ్‌‌గా వెలుగొందుతున్న అజయ్ నగర్.. పాపులర్ యూట్యూబర్‌గా (Youtuber) ఉన్నారు. నగర్ యూ ట్యూబ్ చానెల్ 25.7 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉంది. అజయ్‌ నగర్‌తో పాటు Gaurav Chaudhary, Ashish Chanchlan

Youtube Videos

యూ ట్యూబ్‌తో పాపులరై అత్యధిక డబ్బును పొందినవారు చాలామందే ఉన్నారు. అందులో ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు. తనే 8 ఏళ్ల Ryan’s World రిచెస్ట్ యూ ట్యూబర్. తన బొమ్మలను ఓపెన్ చేసి.. వాటితో ఆడుకునే వీడియోలను చేసి అప్‌లోడ్ చేస్తుంటాడు.

Do you know what is the first YouTube video ?

తర్వాత Dude Perfect ఐదుగురు ఫ్రెండ్స్‌ కలసి ఈ ఛానెల్‌ను నడుపుతున్నారు. వీరంతా వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను బేస్ చేసుకుని వీడియోలు చేస్తుంటారు. Nastya కూడా చైల్డ్ యూట్యూబర్. ఈ అమ్మాయి తన రెగ్యులర్‌ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది.

కేవలం మేకప్‌కు సంబంధించిన వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వ్యక్తి While Jeffree. తన ఛానెల్లో మేకప్‌కు సంబంధించిన ప్రొడక్ట్‌లను సంబంధించిన బ్రాండ్స్‌పై రివ్యూ చేస్తుంటుంది.

ఇక తెలుగులో సంపన్న యూట్యూబర్ ఎవరంటే.. విక్రమాదిత్య. యూట్యూబ్ ఛానెల్‌లో 1.66 మిలియన్ల మంది సభ్యులతో పాటు, విక్రమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 78 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. విక్రమ్ ఆదిత్య తన యూ ట్యూబ్ ఛానెల్‌తో మహాభారత సిరీస్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించారు.

తెలుగులో ప్రస్తుతం జాహ్నవి దాసెట్టి నడుపుతున్న ‘మహాతల్లి’ యూ ట్యూబ్ ఛానెల్ చాలా పాపులర్ అయి.. ముందు వరసలో ఉంది.

నీ శక్తి ఎంత..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *