Menu
Farmers

అది వాళ్ల ‘ప్రాబ్లమ్’ మాత్రమేనా..?

Farmers To Customers Rights

ఏదైనా వస్తువు మన ఇంటికొచ్చిన వ్యక్తి దగ్గర కొనాలంటే.. వంద బేరాలు ఆడతాం.. వారి ఎంత తక్కువ చెప్పినా ఇంకా తగ్గించమంటాం. అదే ఏ మోర్‌లోనో, డీ మార్ట్‌లోనో.. బిగ్ బజార్… రిలయన్స్ స్మార్ట్‌లోనో అయితే ఎంత అంటే అంత ఇచ్చి కొనేస్తాం. ఎందుకని..?

క్వాలిటీ ఉంటుందని మాత్రం అనకండి. దగ్గరకు వచ్చిన వ్యక్తుల పట్ల చనువు. వాళ్లతో డైరక్ట్‌గా మాట్లాడే అవకాశం కారణాలు. వాళ్లు.. వాళ్ల శ్రమను, పెట్టుబడిని అన్నీ లెక్కలు వేసుకుని.. లాభానికి అటుఇటుగా మనకు అమ్ముతారు.పెద్ద పెద్ద మాల్స్‌లో ఆ ఛాన్స్ ఉండదు. అక్కడ ఎంత నిర్ణయిస్తే.. అంతకే కొనాలి.

Farmers

అంటే డైరక్ట్ వ్యక్తి దగ్గర కొంటే లాభం పది రూపాయల దగ్గర ఐదు రూపాయలు వచ్చినా చాలు అని కన్వీన్స్ అవుతారు. దాంతో వారికి లాభం. మనకు కరెక్ట్ రేట్ పడుతుంది.

కానీ మాల్స్‌లో ఆ అవకాశం ఏ మాత్రం ఉండదు. వాడు 20 రూపాయలు లాభం పొందాలనుకుంటే.. అంతా మనం ఇవ్వాల్సిందే. మరి దీనికి కన్వీన్స్ అవుదామా..?

Farmers To Customers Rights

ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు రైతులు చేసే పోరాటంలో ఫార్మర్ రైట్సే కాదు.. కస్టమర్స్ రైట్స్ కూడా ఉన్నాయి. అంటే మనందరి హక్కులు ఉన్నాయి. ఈ మధ్య చేసిన వ్యవసాయ సంస్కరణల్లో ఇది ప్రధానమైన పార్ట్.

తాజాగా చేసిన వ్యవసాయ సంస్కరణల్లో ఓ మార్పు చేశారు. అది భీష్మ సినిమాలో చూపించినట్టు రైతులు పంట వేయడానికి ముందే ఏదైనా కంపెనీతో ఒప్పందం చేసుకోవచ్చు. చూడగానే ఇదేదో బాగుంది కదా.. రైతులకు మంచిదే కదా అని అనిపిస్తుంది. కానీ కొంచెం లోతుగా వెళ్లి ఆలోచిస్తే.. అసలు విషయాలు అర్థమవుతాయి.

Farmers

అందులో ఒకటి పెట్టుబడి పెట్టినవాళ్లకే రైతులు తమ పంటను చచ్చినట్టు అమ్మాలి. అంటే తన పంటపై తనకే హక్కు ఉండదు. ఎవరి కోసమే కూలీగా మారి పంటను పండించే పరిస్థితి ఏర్పడుతుంది.

రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఆకలితో అలమటించినా.. ఇప్పటి వరకూ మన దేశంలో రైతే రాజు. కానీ ఇక రైతు కూడా కూలీగా మారబోతున్నాడు.

Farmers To Customers Rights

కార్పొరేట్ సంస్థలు జిల్లాకు జిల్లాలే రైతులకు పెట్టుబడి పెడతాయి. వారి ఉత్పత్తులన్నీ అవే కొంటాయి. అవసరమైన శీతల గిడ్డంగులను, గోదాములను నిర్మించి నిల్వలు ఉంచుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అధిక ధరలకు కస్టమర్‌కు అమ్ముతాయి.

అలాగే డబ్బులు ఎవరు పెడతారో వాళ్లే ధరను నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వ్యవసాయానికి ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్లే ధరను నిర్ణయిస్తారు. కంపెనీలెప్పుడు లాభం కోసం ఆలోచిస్తాయి. కాబట్టి పండించిన రైతుకు తక్కువ ధర ఇస్తాయి. అమ్ముకునేటప్పుడు ఎక్కువ ధరకు సేల్ చేస్తాయి.

Farmers To Customers Rights

కనుక రైతులే కాదు.. కస్టమర్స్‌ కూడా ఇబ్బంది పడతాం. అసలే అంతంత మాత్రం జీతాలున్న మనలాంటి వాళ్లకు..ఇప్పటికే నిత్యావసర సరుకులు ధరలు భయపెడుతున్నాయి. ధరలు తగ్గించాలని అడపాదడపా డిమాండ్ చేస్తున్నాం. ఈ కొత్త మార్పు వల్ల రేపు కంపెనీలే ధరలు నిర్ణయిస్తాయి.

రేట్లు తగ్గించమని మరీ రేపు ఎవరినీ అడుగుతాం..? పైగా వాళ్లు ఎంతకి చెబితే అంతకే కొనాలి. తప్పదు గనుక కొంటాం. ఈరోజు కేజీ కొనాల్సిన చోట… రేపు పావు కేజీ కొనుక్కోవాల్సి వస్తుంది.

Farmers

సొసైటీలో అందరూ వినియోగదారులే. ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసే వాళ్లమే.. బియ్యం నుంచి.. అన్ని వస్తువులను కొంటాం. అందుకే రైతుల పోరాటంలో మనకు భాగం ఉంది.

వాళ్లు పోరాటం చేసేది వాళ్ల కోసం మాత్రమే కాదు. మనకోసం కూడా. మరీ ఫార్మర్స్ పోరాటానికి సపోర్ట్ చేద్దామా..?

ఆ ‘వాయిస్’ వింటున్నారా..?

4 Comments

 1. Hi there! This is my first visit to your blog!
  We are a group of volunteers and starting a new initiative in a community
  in the same niche. Your blog provided us valuable
  information to work on. You have done a wonderful job!

 2. My partner and I stumbled over here different web
  address and thought I may as well check things out. I like what I
  see so now i am following you. Look forward to looking at your web page for a second
  time.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *