Gabbar Singh of Sholay
హీరోలకు కాదు.. విలన్‌కు స్టార్ డమ్ వచ్చింది. సినిమా ఎంత హిట్ అయిందో.. అందులో విలన్ కూడా అంతే హిట్ అయ్యాడు. ఆయన డైలాగ్స్‌కు, మేనరిజానికి ప్రేక్షకులు ఎడిక్ట్ అయిపోయారు. అంతగా కుర్రకారు నరనరాల్లో ఎక్కేసిన క్యారెక్టర్ గబ్బర్ సింగ్ (Gabbar Singh). షోలే సినిమాలో ‘అరే.. ఓ సాంబా’.. అంటూ కనబడే గబ్బర్ సింగ్.. రియల్ స్టోరీ ఏంటో తెలుసా..?
కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు కలకాలం ఉండిపోతాయి. దానికి గబ్బర్ సింగ్ క్యారెక్టరే ఉదాహరణ. షోలే సినిమాలు అంజాద్ ఖాన్ ప్రతి నాయకుడు పాత్రలో జీవించి.. స్టార్ విలన్‌గా గుర్తింపు పొందాడు.
ఆ పాత్రతో అంతగా కిక్ ఇచ్చిన అంజాద్ ఖాన్ (Amjad khan).. ఇంటి ముందు డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూలు కట్టాలి. ఆయన కెరీర్.. దూసుకుపోవాలి. కానీ అంత తలకిందులైంది.. అతని జీవితాన్ని కాలం మాత్రం వేరేగా నిర్ణయించింది.
Gabbar Singh of Sholay
1975లో షోలే సినిమా (Sholay movie) విడుదలైంది. అందులో విలన్ క్యారెక్టర్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ (Gabbar Singh)పేరు వింటే ఇప్పుడు కూడా ఎంతో క్రేజ్. పవన్ కళ్యాణ్ కూడా ఆ టైటిల్‌తో సినిమా తీసేంత రేంజ్ ఉంది. నిజానికి షోలేలో గబ్బర్ సింగ్ క్యారెక్టర్‌కు అంజాద్ ఖాన్ ఫస్ట్ ఛాయిస్ కాదు. చాలామందిని అనుకున్నారు.
చివరికి అంజాద్ ఖాన్‌ను (Amjad khan) ఆ క్యారెక్టర్ వరించింది. అయితే అంజాద్ ఖాన్ ఆ పాత్రని అంత ఆషామాషీగా చేయలేదు. చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. చంబల్ లోయలోని బందిపోట్లకు సంబంధించిన పుస్తకాలను చదివి మరీ ఆ పాత్రను చేశాడు.
అంజాద్ ఖాన్ నటుడు జయంత్‌కు నవంబర్ 12, 1940 న పాకిస్థాన్‌లో జన్మించాడు. ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్లో స్కూల్ విద్యను పూర్తి చేసి ఆర్‌డీ నేషనల్ కాలేజీలో చదువుకున్నాడు.
Gabbar Singh of Sholay
అంజాద్ కాలేజీలో పొలిటికల్‌గా చురుకుగా ఉండేవాడు. స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. ప్లేటో, సోక్రటీస్, ఎస్. రాధాకృష్ణన్ ఫిలాసఫీ (Plato, Socrates and S. Radhakrishnan) పుస్తకాలను ఇష్టపడేవాడు. ముంబై విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత తన తండ్రి బాటలో పయనిస్తూ.. యాక్టింగ్ వైపు మళ్లాడు.
తెరపై విలనిజాన్ని పండించిన అంజాద్ ఖాన్ (Amjad khan) .. నిజ జీవితంలో మాత్రం చాలా మృదువైన వ్యక్తి. అంజాద్ ఖాన్ డైరక్టర్ కూడా. కొన్ని సినిమాలను డైరక్ట్ చేశారు. తన కెరీర్ మొత్తంలో 132 సినిమాల్లో చేశాడు.
షోలే (Sholay) సినిమాలో తిరుగులేని సక్సెస్ పొందిన అంజాద్ ఖాన్.. కెరీర్.. బ్రహ్మాండగా సాగిపోతుందని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ఒక కారు యాక్సిడెంట్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
Gabbar Singh of Sholay
ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గోవా వెళ్తుండగా అంజాద్ ఖాన్ (Amjad Khan) ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన 13 పక్కటెముకలు విరిగి స్టీరింగ్ అతని ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయింది. తర్వాత అతను చాలా కాలం పాటు వీల్ చైర్లోనే ఉండాల్సి వచ్చింది. దాదాపుగా మూడు నెలల మంచం మీదే ఉండాల్సి వచ్చింది. తర్వాత కూడా మూడేళ్లు వ్యాయామాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.
ఆ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కాలికి గాయమైంది. దీని తర్వాత 1984లో మళ్లీ పక్షవాతాని గురయ్యాడు. దీనికారణంగా వైద్యులు స్టెరాయిడ్స్ ఇచ్చి అతను ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. కానీ స్టెరాయిడ్స్ కారణంగా ఆయన బరువు విపరీతంగా పెరిగిపోయాడు. అలా వెయిట్ పెరిగిన తర్వాత కూడా ఆయన చాలా సినిమాల్లో నటించాడు.
Gabbar Singh of Sholay
పెరిగిన బరువు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఆయన్ని వెంటాడాయి. 1992లో తన 51 వయస్సులో అంజాద్ ఖాన్ గుండె ఆగిపోవడంతో చనిపోయాడు. పాత్రకు ప్రాణం పోసి.. మన ముందు చిరకాలం ఉండేలా చేసిన అంజాద్ ఖాన్ నిజ జీవితం మాత్రం చాలా విషాదకరంగా ముగిసింది.
అయితే తన జీవితంలో ఎదురైన దెబ్బలకు అంజాద్ ఖాన్ ఎక్కడా కుంగిపోలేదు. తన ఆరోగ్య సమస్యలతోనే సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లలో నటించాడు. జనాల్ని మెప్పించాడు. కానీ యాక్సిడెంట్ జరగకుండా ఉంటే.. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటే.. బహుశా అంజాద్ ఖాన్.. లెవల్ వేరేలా ఉండేదేమో.. కచ్చితంగా ఇంత తొందరగా దూరమయ్యేవాడు కాదు.
గబ్బర్ సింగ్(అంజాద్ ఖాన్) నిజ జీవితం ఒక మెరుపు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. కాని దీపం అతడికి చక్కబెట్టుకునే అవకాశం ఇవ్వలేదు. కాని ప్రతిభకు ఆ సమయం చాలని నిరూపించాడు. ఒక సమయంలో జీవితం అతడిని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మెరుపులా మెరిశాడు. టాలెంట్ ఉన్నా.. ఆర్థికంగా అవకాశం ఉన్నా జీవితం అనుకోని విధంగా ఊహించని మలుపు తిప్పేసింది. చాలా మందికి ముఖ్యంగా సౌత్ లో అతడి జీవితం గురించి తెలియదను కుంటాను. ఇది మంచి ప్రయత్నం