Menu
Positving Thinking

ఆ ‘ప్రకటనలు’ అర్థమయ్యాయా..?

Good Thoughts Ads Telugu

మిమ్మల్నే ఆ మార్పు గమనించారా..? అర్థం అవుతుందా..? నమ్మినా నమ్మకపోయినా.. ఈ మధ్య ఓ గొప్ప ఛేంజ్ కనిపిస్తుందండి. ఎక్కడ అనుకుంటున్నారా..? సొసైటీ మనుగడలో..

అదే మన యాడ్స్‌లో కూడా కనిపిస్తుంది.

మన లైఫ్‌లో మన అనుకునేవాళ్లతోనైనా ఎక్కువగా గడపవేమో కానీ.. యాడ్స్‌తో ఎక్కువగా గడుపుతాం. అవును. ఓ సీరియల్ చూస్తాం. ఓ సినిమా చూస్తాం. అవి మాత్రమే చూస్తున్నాం అనుకుంటే తప్పే. వాటితోపాటు ఎన్నో యాడ్స్ చూస్తుంటాం. అలాంటి యాడ్స్‌లో గొప్ప థాట్స్ కనిపిస్తున్నాయి. వ్యక్తుల్లో వచ్చే మెట్యూరిటీకి అద్దం పడుతున్నాయి.

Good Thoughts

నిజానికి చెడు కనిపించినంత వేగంగా.. మంచి కనిపించదు. అందుకే ఆ యాడ్స్‌ను చాలామంది పట్టించుకుని ఉండరు. కానీ. ఆ యాడ్స్ కచ్చితంగా మన ఆలోచనల్లో వచ్చిన మెట్యూరిటీని ఇండికేట్ చేస్తున్నాయి. రేపు సమాజం గొప్పగా ఉండబోతుందనే ఆశను కలిగిస్తున్నాయి. బతకడానికి మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

We Are Pregnant

ప్రెగా న్యూస్ అని ప్రెగ్నెన్సీ కిట్‌పై వచ్చే యాడ్స్ అన్ని దాదాపుగా హార్ట్ టచ్చింగ్‌గా ఉంటాయి. అందులో ఒకటి We are Pregnant అనే క్యాప్సన్‌తో వచ్చింది. అందులో ఓ న్యూ కపుల్ జర్నీ ఉంటుంది. భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె భర్తచాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడు.Good Thoughts Ads ఒకసారి ఆ భర్త తన జాబ్‌లో భాగంగా టూర్ వెళ్లాల్సి వస్తుంది. కానీ క్యాన్సల్ చేసుకుంటాడు. దానికి ఆమె ఎందుకు క్యాన్సల్ చేసుకున్నావ్ అని అడుగుతుంది. ‘‘ఓ నేను ప్రెగ్నెంట్ అనా..?’’ అంటోంది.. దానికి ఆ భర్త We are Pregnant అని చెబుతాడు.

Good Thoughts Ads

ఇప్పటి వరకూ ప్రెగ్నెన్సీ అనేది కేవలం ఆడవాళ్లకు సంబంధించిన విషయమే అనే మామూలు ఆలోచన అందరిలో ఉంది. కానీ అది ఇద్దరి బాధ్యత అనే విషయం ఈ యాడ్ ప్రెజెంట్ చేసింది. ఈ థాట్ ప్రతి కపుల్స్‌లో ఉంటే బాగుంటుంది కదా.

Good Thoughts Ads

టైటాన్ రాగా వాచ్‌ కోసం ఆ మధ్య కాలంలో హల్ చల్ చేసిన ఓ యాడ్ చాలా చాలా ఆకట్టుకుంటుంది. అందులో కత్రినా కైఫ్‌ను పెళ్లి కూతురుగా అలంకరిస్తుంటారు. ఆ సందర్భంలో మీ బాయ్ ఫ్రెండ్‌కు పెళ్లి అయిపోయిందనో, మీ ఫ్రెండ్ పెళ్లి అయిందనో, వాలంటైన్స్ డే రోజు లోన్లీగా ఉన్నారనో, ఓల్డేజ్ సమయంలో ఒంటరిగా ఉంటామనో పెళ్లి చేసుకోకండి.

మీకు సరైన సమయంలో సరైన వ్యక్తి దొరికినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోండంటూ మెసెజ్ ఇవ్వడం జరుగుతుంది. అలా చిన్న చిన్న విషయాలకు డోంట్ గెట్ మేరీడ్ అనే కాప్సన్‌తో ఓ మంచి మెసెజ్‌ను అందిస్తుంది.

Don’t to be Licking Ass

అప్ గ్రేడ్ యాప్‌కు Donta to be Licking Ass.. ఈ కాప్సన్‌తో రన్ అవుతున్న యాడ్ చూశారా. తప్పకుండా చూడాల్సిందే. UP grade యాప్ యాడ్‌లో ఒక ఆఫీస్‌లో అందరూ పనిచేసుకుంటూ ఉంటారు. ఆ ఆఫీస్ మధ్యలో ఓ గాడిద ఉంటుంది. ఆ గాడిదను కొంతమంది ఒకరు తర్వాత ఒకరు వచ్చి నాకి వెళ్తుంటారు. లేట్‌గా వచ్చిన ఓ ఎంప్లాయ్ కూడా గాడిదను నాకి లోపలికి వెళ్తాడు. అయితే అటుగా వచ్చే ఇంకో వ్యక్తి మాత్రం ఆ గాడిదను పట్టించుకోడు. నో నో అంటూ గాడిదను తప్పించుకుని వెళ్లిపోతాడు.

Good Thoughts Ads

తర్వాత When it comes to rising up in your career, be a Champion, Don’t Be A Cheat ! Don’t resort to licking ass, instead kick ass. అని మెసెజ్ ఇస్తాడు. ఆఫీసులో బాసులను కాక పట్టడం మానేసి.. స్వశక్తితో పైకి రావాలనే సందేశం ఇందులో ఉంది.Good Thoughts Ads

స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి.

ఓ కోల్గెట్ యాడ్ మంచి సందేశంతో ఈ మధ్య రన్ అవుతుంది. ఓ ఓల్డ్ లేడీ తన పిల్లలను లంచ్‌కు ఇన్‌వైట్ చేసి వారి కోసం ఎదురుచూస్తుంటుంది.  అదే టైంలో ‘‘లాక్‌డౌన్‌లో ఒంటరిగా గడిపాక తెలిసింది.. నేను ఎప్పటి నుంచో ఒంటరిగా ఉన్నానని.  ఓ పక్క అందరూ ఏమంటారనే భయం రెండో పక్క మళ్లీ బతకాలనే ఆశ. అందుకే ఇంట్లోంచి బయటపడగలిగిన రోజున.  నేను భయం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నానంటూ.. తాను ఓ పెద్ద వయస్కుడైన ఓ వ్యక్తిని తన పిల్లలకు పరిచయం చేస్తుంది.

Good Thoughts @ Ads

అదే సమయంలో తన చేతికుకున్న రింగ్‌ను ఆ పిల్లలకు చూపిస్తుంది. దాంతో ఆమె పిల్లలు షాక్ అయి.. ఆ పరిణామాన్ని అంతే హాయిగా ఆహ్వానిస్తారు. ఓ కొత్త స్వేచ్ఛ అనుభవించండి. స్మైల్ చేయండి.. స్టార్ చేయండంటూ ఆ యాడ్ ముగుస్తుంది. ఇప్పటికీ ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకోవడం చాలామంది నేరంగానే చూస్తున్నారు.

కానీ ఒంటరిగా ఉన్నవాళ్లు ఏ వయస్సులోనైనా తమకంటూ ఓ తోడును వెతుక్కోవడం ఎప్పటికీ తప్పు కాదు కదా.

Good Thoughts Ads

ఎప్పుడూ అత్యాచారాలు, మర్డర్లు, దొంగతనాలు, అవినీతి వంటి వార్తలే వింటూ ఉంటాం.

మంచి కాలం పోయిందంటూ విసుగ్గా అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్లు, మన సొసైటీ ఇలా ఉండకూడదు కదా అని తెగ బాధపడతాం. అందుకే ఇలా ఉండకూడదనే కాదు..

ఎలా ఉండాలో కూడా అప్పుడప్పుడు చెప్పుకోవాలి. అలాంటి అల్ట్రానేట్ థాట్సే ఈ యాడ్స్‌లో కనిపిస్తున్నాయి.

ఇలాంటివి అప్పుడప్పుడు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తాయి. ఇంత మంచిగా మన సొసైటీ ఉంటే బాగుంటుంది కదా.

చరిత్ర చెప్పని కథ … ఝల్కారీ బాయ్

4 Comments

  1. Oppo F17 Pro ఫోను గురించి చూపే టీవీ యాడ్ కూడా బాగుంటుంది. ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ లో హిందువులు, ముస్లింలు దీపావళీ జరుపుకునే పూర్వ వైభవాన్ని మళ్లీ ఆవిష్కరింపచేయడం ఒక మంచి ఆలోచన. దాన్నే తన ఫోనులో బంధించే ప్రయత్నంలో భాగంగా సహృదయం, లౌక్యం గల ఓ హిందూ యువకుడు ముస్లిం చిన్నారులను కాకర పువ్వోతులు కాల్చే దృశ్యాన్ని బంధిస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *