Grandmother
ఇది మా అమమ్మ కథ. ఓ లలితా దేవీ జీవితం. ఆమె ఎవరూ.. ఆమె గొప్పతనం ఏంటీ అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఆమె గొప్పతనం ఆవిడ బతికి ఉన్నప్పుడు నాకు తెలియదు. అందరి లాగే నాకు మా అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం. నన్ను బాగా గారం చేసేది. ఈ కథ రాస్తుంది అమ్మమ్మ మీద ఉన్న ఇష్టంతో, గౌరవంతోనో కాదు. నన్ను ప్రభావితం చేసిన లలితా దేవి వ్యక్తిత్వం గురించి.
Grandmother
లలితాదేవీ పుట్టింది, పెరిగింది ఉత్తర్ ప్రదేశ్‌లో పెళ్లైనా కొంత కాలానికి తాతాయకి ఏపీలో రాజమండ్రిలో పేపర్ మిల్లులో జాబ్ వచ్చింది. అప్పటి వరకూ తన పుట్టిన ఊరే దాటని వ్యక్తి పెళ్లైన తర్వాత ఒక కొత్త ప్రదేశానికి భర్తతో పాటు వచ్చేసింది. ఊరు, భాష తెలియని ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఉండగలనా..? అని అనుకుంది. హిందీ తప్ప ఏ భాష రాదు, చదువు లేదు. ఇక్కడ ఉండేది ఎలా అనుకుంది..?
Grandmother
లలితా దేవికి ఆరుగురు సంతానం. తాతయ్య తెచ్చిన సంపాదన అంతంత మాత్రమే. పిల్లలకి కడుపు నిండా మూడు పూట్ల భోజనం కూడా పెట్టడం అయ్యేది కాదు. దీంతో బాధపడిన అమమ్మ.. ఇక లాభం లేదు అని.. తెలిసి తెలియని ఊరులో ఏదో ఒకటి చేసి ఇంట్లో ఆర్థిక సమస్యలను తీర్చాలని నిశ్చయించుకుంది.
Grandmother
ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే రోడ్డు పక్కన టిఫిన్ హోటల్ పెట్టింది. నెటీవ్ ప్లేస్ ఉత్తర్‌ప్రదేశ్ కావడం వల్ల ఆంధ్రా వంటల మీద సరిగ్గా అవగాహన లేదు. కానీ ధైర్యం చేసి టిఫిన్ హోటల్ ప్రారంభించింది.
Grandmother
రోడ్డు పక్కన హోటల్ పెట్టడం వల్ల హోటల్ బాగానే సాగింది. ఇంట్లో ఆదాయం సరిపోతుంది. అలా ముందు ఆడ పిల్లలకి పెళ్లిల్లు చేసింది. ఉన్నదాంట్లోనే పక్కవాళ్లకు సాయం చేసేది. ఆకలితో విలవిల్లాడే వాళ్లకి మూడు పూట్ల భోజనం పెట్టేది. ఎంతోమంది పేదరికంలో ఉన్న ఆడపిల్లలకు తన స్థాయిలో దగ్గరుండి పెళ్లిలు చేసేది. విడిపోతున్న భార్య భర్తలని ఒకటి చేసేది. ఇలా ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది.
ఓ సారి సమ్మర్‌లో మా అమ్మమతో బయట కూర్చుని ఉండగా ఓ పెద్ద నల్లతాచు పాము మా ఇంటి దడిలో దూరింది. అది చూసి నేను భయపడి అమ్మమ్మ పాము, పాము అని అరిచేను. తాతయ్యని పిలుస్తా దాన్ని చంపేద్దాం అన్నాను. మా అమ్మమ్మ నన్ను చేత్తో పట్టుకుని ఆపి. ‘‘ఎందుకు అవసరం లేదు అని నిన్ను ఏమి చేయలేదు కదా.
Grandmother
మరి దాని ప్రాణం ఎందుకు తీయడం, అది కూడా మనలాంటి జీవే కదా’’ అని అంది. ఆ మాటలు నాకు ఆ వయస్సులో ఎక్కడో గుచ్చుకున్నాయి. అప్పటి వరకూ అందరూ పాముని చూస్తే చంపేడయమే చూశాను.
కానీ అలా చెప్పేవాళ్లని ఎవర్ని చూడలేదు. ఏ పాపం చేయకుండా ఓ జీవి ప్రాణం ఎందుకు తీయాలని అమ్మమ్మ అభిప్రాయపడేది. అలా ప్రాణంతో ఉండే ప్రతి జీవిని సమానంగా చూసేది.
Grandmother
ఇంకోసారి ఎండాకాలం సెలవుల్లో అమ్మమ్మ బయట ఓ మామిడి చెట్టు కింద కూర్చుంది అప్పుడే ఓ నలుగురు అడుక్కునేవాళ్లు వచ్చారు. వాళ్లకి భోజనం పెట్టి తిన్న తర్వాత వాళ్లతో కూర్చుని వారి కష్టసుఖాలు అడిగింది. ఇదంతా దూరం నుంచి చూసిన నేను మా అమ్మమ్మ ఏంటీ ఇలా చేస్తుంది..? వాళ్ల పక్కన కూర్చుదేంటీ..?ఛీ అని ఛీదరించుకున్నాను. నాకు బాగా కోపం వచ్చింది. వాళ్లు వెళ్లే వరకూ ఎదురు చూశాను.
వాళ్లు వెళ్లిపోయాక అమ్మమ్మని నిలదీసి అడిగాను. అదేంటీ అమ్మమ్మ నువ్వు వాళ్ల పక్కన కూర్చున్నావు నీకు అసహ్యం అనిపించలేదా..? అని అడిగాను. దానికి మా అమ్మమ్మ నవ్వుతూ ‘‘ఏం వాళ్లు మాత్రం మనుషులు కాదా..?’’ అని అడిగింది. ఈ సృష్టిలో అందరూ సమానమే. ‘‘ఎవరు ఎక్కువ.. తక్కువ కాదు. ఎప్పుడు అలా ఆలోచించకు అని చెప్పింది. అప్పుడు కూడా నాది తెలిసి తెలియని వయస్సు. మా అమ్మమ్మ మాటలు నాకు పూర్తిగా అర్థం కాలేదు.
Grandmother
ఈ సంఘటన జరిగిన రెండు నెలలకు మా అమమ్మమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చి తను చనిపోయింది. తను చనిపోయిందని తెలిశాక రోజుకు పది మంది వచ్చి బాధ పడేవారు. మా అమ్మమ్మ అన్ని పనులు ఎలా చక్కబెట్టిందో వాళ్లు చెప్పేవారు. అప్పటి వరకూ వరకూ మా అమ్మమ్మ గొప్పతనం నాకు తెలియలేదు. నేను పెద్దయ్యాక అమ్మమ్మ మాటల్లోని లోతు మరింతగా అర్థమైంది. ఆమె వ్యక్తిత్వంలోని గొప్పతనం అవగతమైంది.
ఊరు కానీ ఊరు వచ్చి.. హోటల్ పెట్టడంలో ఆమె ఆత్మవిశ్వాసం, పాముని ఏమి చేయకుండా వదిలేయడంలో ఆమె ఔదార్యం, పేదవారి ఆకలిని చూడడంలో ఆమె మానవత్వం.. ఇలా ఎన్నో సుగుణాల ఆమెలో ఉన్నాయి.
Grandmother
ఇలాంటి లలితాదేవీలు.. బహుశా ప్రతి ఇంట్లోనూ ఉంటారు. కాకపోతే మనవాళ్లలో ఉన్న గొప్ప విషయాలను మనం చూడలేం, అర్థం చేసుకోలేం. వారి కష్టాన్నీ, శ్రమని వాడుకునే మనం… వాళ్ల వ్యక్తిత్వాన్ని దర్శించడంలో వెనుకబడే ఉంటాం. ఇప్పటికైనా వాళ్లని తెరిచి చూద్దాం. వారి చేసిన త్యాగాలను, వారి మనస్సు తెరల్లో నిలిచిపోయిన గాయాలను, వారి స్వభావంలో ఉన్న గొప్ప విషయాలను తెలుసుకుందాం.
–AnuRadha Lanka–