Great Movies
-
సిల్వర్ స్క్రీన్‌పై సోషల్ ఇష్యూస్
-
సామాజిక సమస్యలే స్టోరీలు
-
AACTAకు నామినేట్ అయిన సినిమాలు
ఇంట్లో భార్యపై.. భర్త చేయిజేసుకునే ఘటన.. వెండితెరపై కదలాడింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ అమ్మాయిపై యాసిడ్ పోసిన యదార్థ గాథ.
సిల్వన్ స్క్రీన్‌పై తారసపడింది. అనుకోవడానికి. ఆలోచించడానికి కూడా ఒప్పుకోని.. హోమో సెక్సువాలిటీ ఇష్యూ ఓ మూవీగా దర్శనమిచ్చింది.
Great Movies
ఇవన్నీ అతి సున్నితమైన విషయాలు.. మనస్సులను మలిపెట్టే నిజాలు. పైకి చెప్పుకోలేని, ఒప్పుకోలేని మనలాంటి మర్యాదస్తులకు ఓ చెంపదెబ్బ. ఇలాంటి విషయాలపై మౌనం వద్దు.. గొంతు విప్పండంటూ గొప్పగా చెప్పిన సినిమాలు ఇవి. కొత్తగా ఆలోచించండి.. కొంచెం పెద్ద మనస్సు చేసుకోండంటూ కన్వీన్సింగా చెప్పే కథనాలు.
అందుకే ఆ గ్రేట్ మూవీస్‌కు గొప్ప పురస్కారం దక్కింది. బాలీవుడ్‌లో వచ్చిన తప్పడ్, చప్పాక్, శుభ మంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలు ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్‌కి (AACTA) నామినేట్ అయ్యాయి.
ఈ మూడు సినిమాలు సోషల్ ఇష్యూస్‌ను బేస్ చేసుకుని తీసినవి. వీటి ద్వారా సమాజానికి మంచి మెసెజ్‌ను అందించారు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్‌ను అసలు ఇదొక సమస్య అని అనుకునేవారు ఈ సమాజంలో ఇంకా ఉన్నారు. అలాంటి సమస్యలను.. మనస్సు లోతుల్లో ఉండిపోయిన గాయాలను.. బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పెద్దపీట వేసింది.
ముఖ్యంగా తప్పడ్ సినిమాలో స్టోరీ లైన్ అలాంటిదే. ఈ సినిమాలో భార్యను.. భర్త కొడతాడు. దాంతో విడాకులు తీసుకుంటుంది. బహుశా ఈ అంశం చాలామంది మగవాళ్లకే కాదు. ఆడవాళ్లకు నచ్చదు. మన సొసైటీలో భార్యను భర్త కొట్టడం చాలా సహజమైన విషయం.
ఓ భర్త తన భార్యను ఏమైనా చేసుకోవచ్చు, ఏమన్న అనొచ్చు అనే భావన అందరిలోనూ గూడుకట్టుకుని ఉంది. మహిళల జీవితంలో అతి మామూలుగా సాగిపోతున్న ఈ తంతునే ‘తప్పడ్’ డిస్కస్ చేసింది. ‘We Want Respect ‘ అని కోరుకుంటున్న ఎంతో మంది భార్యల మనోగతాన్ని చూపించింది. ఈ సినిమాలో తాప్సి ప్రధాన పాత్రను పోషించింది.
Great Movies
చప్పాక్.. దీపికా పదుకొనే ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఓ యధార్థ గాధ. 2005లో ఓ దుర్మార్గుడు చేసిన పనికి లక్ష్మీ అగర్వాల్ అనే యువతి బలైపోయింది. కేవలం పెళ్లి చేసుకోవడానికి ఓప్పుకోనందుకు ఓ యువకుడు ఆమె మొహంపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె మొహం పూర్తిగా కాలిపోయింది. ఎన్నో ఆపరేషన్స్ చేసి ఆమెను ప్రాణాలతో కాపాడగలిగారు.
Great Movies
శారీరకంగా బతికి బట్టకట్టింది కానీ. చాలాకాలం లక్ష్మీ అగర్వాల్ తన మొహం తానే చూసుకోలేకపోయింది. ఆమె మొహం చూసిన వారు భయపడిపోయేవారు. దాంతో లక్ష్మీ చాలా కుంగిపోయింది. తాను చేయని తప్పుకు.. లక్ష్మీ శిక్ష అనుభవించింది. అయినా తనలా మరెవరూ కాకూడదని ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. అలా పడిలేచిన కెరటాన్ని, ఆమె అంతరంగాన్ని సినిమాగా తీశారు. ఆ మూవీ ఎంతో మంది మెప్పు కూడా పొందింది.
Subh Mangal Jyada Savadhan
ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటేనే తట్టుకోలేని స్థితిలో ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్న కథ హిందీలో సినిమాగా వచ్చింది. ఆ సినిమాయే ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’. ఈ సినిమాలో ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని.. ఒకటవ్వడానికి నానా అవస్థలు పడతారు. ఇది ప్రకృతి విరుద్ధమంటూ తల్లీదండ్రులు మొత్తుకుంటారు.
Great Movies
వారిని కన్వీన్స్ చేసే క్రమంలో వారి మధ్య జరిగే సన్నివేశాలు, మాటలు, అనుమానాలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఇలా హోమో సెక్సూవాలిటీపై ఈ సినిమా మొత్తం సాగుతుంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించారు.
ఈ కథల్లో ప్రధాన పాత్రదారులు అసలు సమస్యతో పాటు.. సమాజం నుంచి ఎదురయ్యే వివక్షతతోనూ ట్రావెల్ చేస్తుంటారు.
అసలే ఓ గాయమై దు:ఖాన్ని అనుభవించే బాధితులనే అవమానంగా చూడడం ఎంతవరకూ కరెక్ట్..? అందుకే అప్పుడప్పుడు ఇంట్లో బూజును దులుపుకోవడంతో పాటు..
ఒంట్లోని బూజుపట్టిన ఆలోచనలను వదిలించుకోగలగాలి.
Valuable analysis
Thank You So Much…
జనాల్లో మార్పు రావడానికి సమయం పడుతుంది. తరాలు మారాల్సివస్తుందేమో.
త్వరలోనే ఆ మార్పు వస్తుందనే ఆశను ఇలాంటి సినిమాలు కలిగిస్తున్నాయ్.. సార్
ఆలోచిద్దాం
తప్పకుండా.. సార్