Menu
interview

ఇంటర్వ్యూ.. అంటా..!

Interview

సెటైర్లు, పంచ్‌లు, కొటేషన్స్.. ఇది ఇప్పటి కాలం. ఎంతటి పెద్ద ఫిలాసఫీనైనా, బాధనైనా సింపుల్‌గా ఇలా చెప్పేసుకుంటాం… అలా నవ్వేసుకుంటాం..

ఇలా కార్టూన్స్‌ నుంచి మీమ్స్‌కు మారినా, బడా స్టార్స్ కూడా డీ గ్లామర్ పాత్రలకు షిప్ట్ అయినా.. కొన్ని మాత్రం ఏం మారడం లేదు. ముఖ్యంగా పరీక్షలు, ఇంటర్వ్యూల సిస్టం. చాలామంది ప్రష్టేషన్ ఇది.

గుర్రానికి, చేపకు ఒకే టెస్ట్.! వాటి టేస్ట్‌లు వేరు.. వాటి టాలెంట్‌లు వేరురా బాబు అని ఎంత చెప్పినా.. ఈ పద్ధతి మాత్రం మారడం లేదు.

Interview

Interview

అసలే తక్కువ ఉద్యోగాలు.. అందులో రికమెండేషన్స్‌తో, వాళ్ల సామాజిక వర్గాలతో కొన్ని భర్తీ అయిపోతాయి. ఉండేవి ఇంకొన్ని వాటికి పెడతారు ఇంటర్వ్యూలు.

ముందు నువ్వేం చేస్తున్నాం.. ఎందుకొచ్చావ్.. ఏం చేయాలనుకుంటున్నావ్ రోటీన్ క్వశ్చన్స్.. తర్వాత కొన్ని కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు. తర్వాత చేసే జాబ్‌కు సంబంధించి ప్రశ్నలు. అన్నింటికి సమాధానాలు చెబితే ఒకే. తర్వాత సేలరీ బేరం కూడా అయ్యాక.. అపాయింట్‌మెంట్. మధ్యలో సదరు పర్సన్ గురించి ఎంక్వైరీలు కూడా ఉంటాయి.

inter

Interview

ప్రశ్నలకు సమాధానాలు చెప్పేస్తే.. ఆ ఉద్యోగానికి కరెక్ట్ పర్సన్‌ అని ఎలా రూడీకి వచ్చేస్తారో.. అర్థం కాదు. అసలే మనది హెచ్చు, తగ్గులున్నా సొసైటీ.

లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాళ్లకు ఇప్పటికీ ఒక పెద్ద కంపనీ స్టెప్స్ ఎక్కేటప్పుడే.. చెమటలు పట్టేస్తాయి. ఇక లోపలకి వెళ్లి.. వాళ్లు అడిగే ప్రశ్నలకు.. తెలిసినా చెప్పలేని పరిస్థితి. కానీ ఇలాంటి వాళ్లలోనే సిన్సియర్, హార్డ్ వర్కర్లుంటారు.

Interview

చాలా కంపెనీలు ఇలాంటి వాళ్లను మిస్ అయిపోతుంటాయి. కొంతమంది కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్‌‌తో తమను తాము.. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటుంటారు. చేసే పని తక్కువ.. చెప్పుకునేదెక్కువ. అలాంటి వాళ్లను కళ్లకు అద్దుకుని మరి తీసేసుకుంటారు. పనిలో దిగిన తర్వాత వాళ్ల విన్యాసాలు ఉంటాయి.. అబ్బో.. చెప్పక్కర్లేదు. పని చేయరు.. మాటలతో నెట్టుకొచ్చేస్తారు. పని చేసేవాళ్లపై పడేస్తారు.

interviews 1

ఏ వ్యక్తినైనా సెలక్ట్ చేసే ముందు కంపెనీలు ఎంక్వైరీలు చేస్తుంటాయి. ఈ ఎంక్వైరీల్లో నిజాలు తెలుస్తాయా..? వాళ్లంటే పడని వాళ్లు, అసలు వాళ్ల టాలెంట్‌నే గుర్తించని వాళ్లు సరిగ్గా చెబుతారా…? చెప్పరు. ఇందులో సామాజిక వర్గాలు, జెండర్ కూడా పనిచేస్తుంటాయి. నరనరాల్లో నాటుకుపోయాయి కదా.! పైగా అసూయ అనే ఎగ్‌స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది.

Interview

కంపెనీలకు పనిచేసేవాళ్లు కావాలి. కానీ ఆ సంస్థల్లో పెద్ద పొజిషన్లలో ఉండేవాళ్లకు.. వాళ్లకు పనికొచ్చేవాళ్లు కావాలి.. ఈ ఈక్వేషన్‌లో లేని వాళ్లకు ఇలాంటి ఇంటర్వ్యూలు. వీటి వల్ల కష్టపడి, నిజాయితీగా పనిచేసేవాళ్లకు పని దొరకడం లేదు. పనికిమాలినవాళ్లకు మాత్రం ఉద్యోగాలిస్తారు. ఇలాంటి ఇంటర్వ్యూతో ఇన్నర్ వ్యూను తెలుసుకోవడం కష్టం.

Interview

రావు గోపాలరావు చెప్పినా.. రావు రమేష్‌లా చెప్పినా.. విధానాలు మార్చుకోరు. ఎన్నో మారుతున్నాయి.. ఇంటర్వ్యూల్లో కూడా మార్పు వస్తే బాగుండు. క్రియేటివ్‌గా ఇంటర్వ్యూలు చేసే.. కంపెనీలే లేవా..?

యూ ట్యూబ్‌ ఫస్ట్ వీడియో ఏంటో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *