irrfan khan
సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక ముద్రను వేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతగా అంటే.. వాళ్లు దాని కోసమే పుడతారు.. వాళ్లు లేకుండా దాన్ని చూడలేం.. ఊహించలేం..! అది ఏ రంగమైనా కావొచ్చు. అలాంటి వాళ్లలో ఇర్ఫాన్ ఖాన్ (irrfan khan) కూడా ఒకరు.
ఇర్ఫాన్ ఖాన్ (irrfan khan) నటించిన ఏ సినిమాలోనూ ఆయన కనిపించడు.. ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. నిశ్శబ్ధంలో కూడా యాక్ట్ చేయగలడు. ఆయన ఎన్ని పాత్రలు చేసినా.. ఏ పాత్రకు ఆ పాత్ర కొత్తగానే ఉంటుంది. ఇర్ఫాన్ సినిమా రంగానికి దొరికిన గొప్ప వనరు.
ఏ పాత్రలోనైనా ఇర్ఫాన్ ఇమిడిపోయినట్టు ఇంకెవరూ ఇమడరు అంటే ఆశ్చర్య పడక్కర్లేదు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ప్రతీ సినిమా ఒక ప్రత్యేకమైంది. ఒక్కో పాఠం లాంటిది. ప్రతి క్యారెక్టర్ చాలా భిన్నమైనది. ఆ పాత్రలను ఇర్ఫానే క్రియేట్ చేసుకున్నాడా..? లేక ఆ పాత్రలే తనని వెతుక్కుంటూ వచ్చాయా..? అనిపిస్తుంది .
irrfan khan
ఇర్ఫాన్ ఖాన్ (irrfan khan) ఎంచుకున్న సినిమాలు, అందులో పాత్రలు కూడా అంతే గొప్పవి. అలా ఎంచుకోవడానికి మంచి వ్యక్తిత్వం ఉండాలి. ముఖ్యంగా ఆయనకు రియాల్టీ తెలుసు. అందుకే ఆయన ఎంచుకున్న సబ్జెక్టులన్నీ అవే. ఎక్కువగా ఓ మధ్య తరగతి తండ్రీగా, సగటు మనిషిగా, వృద్ధుడిగా, 40 ఏళ్ల మధ్య వయస్కుడుగా అచ్చం అలాగే చేశాడు. అందుకే ఇర్ఫాన్ ఖాన్‌కు హాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది.
irrfan khan
ప్రతి కళకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని ఇర్ఫాన్ ఖాన్ (irrfan khan) చాలాబాగా అర్థం చేసుకున్నాడు. జనాల మనస్సులను రంజింప చేస్తునే మనుషులు చేసే తప్పులను, ఉండే లోపాలను ఎత్తి చూపాలి. సమాజం చెంప మీద సున్నితంగా కొట్టాలి. ఆ పని ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు నూటికి నూరు శాతం చేశాయి. ఒక పక్క కమర్షియల్ ఎలిమెంట్ ఉంటూనే మరోపక్క సామాజిక లోపాలను ఎత్తి చూపేలా ఇర్ఫాన్ సినిమాలుంటాయి.
irrfan khan
బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లో కూడా తనదైన ముద్రను వేసుకున్నాడు ఇర్ఫాన్. జురాసిక్ వరల్డ్‌లో తన నటనకు హాలీవుడ్ దాసోహం అంది. పెద్ద పాత్ర కాకపాయినా ఎప్పటికీ మరిచిపోలేని నటన అది. అలాగే Life of pi సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీటితో పాటు salaam bombay, మక్బూల్ (Maqbool), మదారి, కూన్ మాఫ్, తల్వార్ (talvar), బ్లాక్ మెయిల్, హిందీ మీడియం (Hindi Medium), అంగ్రేజీ మీడియం (Angrezi Medium), లంచ్ బాక్స్ (lunch box movie), పాన్ సింగ్ తోమర్ (paan singh tomar), పీకు (Piku) వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో మైల్ స్టోన్స్.
ఇర్ఫాన్ తన పేరులో ఖాన్‌ను తీసేశాడు. ఎందుకంటే తనను నిర్వచించేది తన పనే కానీ.. వంశం కాదని తన అభిప్రాయం
ఇర్ఫాన్ (irrfan khan) నటించిన మదారి సినిమా 2013లో వచ్చింది. ఇందులో హీరో అంటే ఇర్ఫాన్ హోమ్ మంత్రి కొడుకును కిడ్నాప్ చేస్తాడు. ఆ పిల్లాడిని వాడు చదువుకునే హాస్టల్ నుంచి తీసుకుపోతాడు. దానికోసం రెక్కీ కాస్తాడు. పోలీసులకు దొరకకుండా ఎక్కడెక్కడో ఉంచుతాడు. ఒక స్కూల్ కూలి పోవడంతో ఇర్ఫాన్ కొడుకు చనిపోతాడు. దానికి కారణం ఎవరో.. ఆ బాధ ఎలా ఉంటుందో.. తెలపడానికి ఆ కిడ్నాప్ చేస్తాడు. జనరల్‌గా హీరోలు పగ తీర్చుకుంటారు. ఇందులో హీరో మాత్రం బుద్ధి మాత్రమే చెబుతాడు.
పాన్ సింగ్ తోమర్ 2012లో వచ్చింది. ఈ మూవీలో ఇర్ఫాన్ నటనకు దేశం నీరాజనాలు పట్టింది. ఈ సినిమాతో ఇర్ఫాన్ ఒక్కసారిగా మెరిశాడు. ఆ పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ కనిపించడు.. పాన్ సింగ్ తోమర్ కనిపిస్తాడు. పాన్ సింగ్ తోమర్ చంబల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో నానా కష్టాలు పడి సైన్యంలో చేరతాడు. అయితే చంబల్ నుంచి వచ్చిన వాళ్లను బందిపోట్లు అని పై అధికారులు హేళన చేస్తారు.
కానీ దేశం కోసం అవన్నీ భరిస్తాడు. గ్రామంలో అగ్ర కులపెద్దల గొడవల కారణంగా పాన్ సింగ్ తోమర్ జీవితమే మారిపోతుంది. బండిపోటుగా ముద్ర వేస్తారు. దాంతో బందిపోటుగా మారాల్సి వస్తుంది. ఈ సినిమా 45 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందించారు. సూపర్ హిట్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా రూ. 201.80 మిలియన్లు వసూలు చేసింది. ఈ సినిమా 2012లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇర్ఫాన్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చింది.
ఇర్ఫాన్ కెరీర్‌లో పీకు సినిమాకు మంచి స్థానం ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ దేశంలో వసూళ్ల వర్షం కురిపించింది. ఓ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న కూతురుకు, కాన్ స్టిపేషన్ సమస్యతో బాధపడే తండ్ర ఉంటాడు. తండ్రిని కూతురు బాగా చూసుకుంటుంది.
అయితే ఆయనకున్న సమస్య వల్ల కూతురుని చాలా ఇరిటేట్ చేస్తాడు. ఒక్కసారి తమ ఇంటిని అమ్మడానికి కోల్‌కతా వెళ్తారు. వీళ్లని ఫ్రెండ్ ద్వారా పరిచయం ఉన్న రాణా చౌదరి ( ఇర్ఫాన్ ఖాన్) ట్రావెల్ యజమాని తన కార్ మీద తీసుకెళ్తాడు. వాళ్లకి చాలా గొడవలు జరుగుతాయి. చివరకు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అమితాబ్ సమస్యకు ఇర్ఫాన్ మంచి పరిష్కారం కూడా చెబుతాడు. స్నేహం, ప్రేమతో ఉంటూ ఎలాంటి సమస్యనైనా, మనిషినైనా మార్చగలం అని తెలిపేదే .. ఈ సినిమా.
irrfan khan
ఫైటింగ్‌లు ఉండవు, డ్యాన్స్‌లుండవు, పెద్ద డైలాగ్‌లుండవు..పెద్ద కథ కూడా ఉండదు. అయినా ఇర్ఫాన్ సినిమాలంటే అందరికీ ఇష్టం. సింపుల్ డైలాగ్స్, ఈజీ యాక్టింగ్, సరైన సబ్జెక్ట్ అంతే.. వీటితో ప్రేక్షకులను కట్టి పడేసుకున్నాడు. చిత్ర సీమకు సైలంట్ ఎంట్రీ ఇచ్చి.. అంతే సైలంట్‌గా వెండితెరపై చెరగని సంతకం చేసేశాడు.
ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. 2018లో neuroendocrine tumour నిర్ధారణ అయింది. దాంతో చాలాకాలం పోరాడాడు. చివరిగా పెద్ద పేగు ఇన్ఫఫెక్షన్‌తో 2020, ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. 53 ఏళ్లకే తన ప్రస్థానాన్ని ముగించాడు.
ఇర్ఫాన్ ఖాన్ పూర్తి పేరు సహబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్ 1967లో జనవరి 7న టోంక్, రాజస్థాన్‌లో పుట్టాడు. 1995లో రచయిత అయిన సుతాపా సిక్దర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు. బాబిల్, అయాన్.
గబ్బర్ సింగ్@షోలే