Menu
Organic Products

Is Organic Food Healthier ?

Is Organic Food Healthier ?

When We take Healthy Food, We Stay Healthy. We all know this proverb, and we are hearing from long – long ago. But are we really taking healthy food? If you are taking “Organic” then definitely a big YES, if not then NO.

Yes, I am going to summarize the existing evidence on the impact of Organic food on human health. It compares Organic vs Conventional food production Conventional food production means the food which are grown under synthetic chemicals and pesticides.

Many theories say that Organic food consumption may reduce the risk of Allergic disease and of over weight and obesity, when it is comparative to conventional food.

Organic Vegetables

Natural farming/ Organic farming fills food with disease fighting factor. This was found from a study comparing Organic foods with foods from sustainable and conventional farms. Many Food Scientists studied the compounds called Flavonoids.

Means the plant’s grown under Organic farming have more nutrients and flavors.  For example if we buy an Organically grown Tomato it will be more juicy and flavored. Where ad in conventional farming because of using pesticides and chemicals the flavor of fruits and veggies will lose their original flavor.

Organic

A recent evidence suggests that the micro nutrients in Organic products plays a very important role in preventing Cancer and Heart disease.

And I think it is to some degree naïve to think Organic foods are more nutritious, One might buy Organic foods for lots of reasons. As for nutritional quality, a lot of the product that is sold in the supermarket is grown hydroponically that means with no Organic matter.

Today in this pandemic every person wants to make their immune system strong, so if you take Organic food products it will definitely help you to change your food habits and lifestyle and also helps to fight the internal and external diseases.

                                                                                                                                                                                                              Anuradha Lanka..

……………………………………………………………………………………………………………………..

Is Organic Food Healthier ? Telugu

ఎంత మంచి ఆహారం తీసుకుంటే.. అంత ఆరోగ్యంగా ఉంటాం. అయితే మనం నిజంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామా..?  ప్రతిదానికి ఆస్పత్రికి వెళ్లాల్సిన వస్తున్న ఈ టైంలో ఈ ప్రశ్న వేసుకోవడం చాలా అవసరం. రోజూ మూడు పూటలా తింటున్నాం..? కానీ మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ మాత్రం ఉండడం లేదు.

కరోనా వైరస్ ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేసింది.  మనం తింటున్న ఆహారంలో ఏ మాత్రం ‘పవర్’ లేదని తేల్చేసింది. అందుకే మనం తినే ఫుడ్ మారాలి.  కొలస్ట్రాల్ పెంచే ఫుడ్ కాదు.. నిజమైన శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.

Organic Products

ఇప్పుడు మనం తిండే ఆహారంలో శక్తి ఉండకపోగా.. హాని చేసే కారకాలు ఉంటున్నాయి. పండిస్తున్న పంటలన్నీ వివిధ రకాలైన రసాయనాలు, పురుగు మందులు వేసి పండిస్తున్నవి. అందుకే ఆ ఉత్పత్తులు మన ఆరోగ్యానికి మేలు చేయకపోగా.. కీడు చేస్తున్నాయి.

అందుకే ఎటువంటి రసాయనాలు వేయకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండించే ఉత్పత్తులను తినడం అలవాటు చేసుకోవాలి. సేంద్రీయ ఉత్పత్తుల వల్ల ఎటువంటి అలర్జీ సమస్యలు రావు. అధికంగా బరువు పెరిగే సమస్య ఉండదు. ఊబకాయ సమస్య రాదు.ఈ ప్రమాదాలన్నీ తగ్గుతాయని చాలా అధ్యయనాల్లో తేలింది.

Is Organic Food Healthier ?

సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిన పంటల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఉదాహరణకు సేంద్రీయంగా పెరిగిన టమోటాను కొనుగోలు చేస్తే అది మరింత జ్యూసీగా, రుచిగా ఉంటుంది.పురుగు మందులు, రసాయనాలను ఉపయోగించి పండించిన పళ్లు, కూరగాయలు రుచిని కోల్పోతాయి. చాలామంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Organic Produtcts

తాజా అధ్యయనాలు.. సేంద్రీయ ఉత్పత్తుల్లోని సూక్ష్మ పోషకాలు.. క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతున్నాయి. అయితే సేంద్రీయ ఉత్పత్తులను వాడడంతో ఏ జబ్బులు రాకుండా ఉంటాయా..? పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులైపోతామా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అలా అని ఏ పరిశోధనల్లోనూ తేలలేదు. కానీ ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడని సేంద్రీయ పంటలు.. మామూలు వాటితో పోల్చుకుంటే 30, 40 శాతం కచ్చితంగా ఆరోగ్యాలకు మంచివే అని చాలా స్టడీలు చెబుతున్నాయి.

రకరకాల వైరస్‌లు విజృంభిస్తున్న ఈ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో సేంద్రీయ ఆహార ఉత్పత్తులను తీసుకుంటే.. అది కచ్చితంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో అనేక వ్యాధులు రాకుండా జాగ్రత్తగా పడొచ్చు.

–Rudras–

Why The Demand For Organic..?

3 Comments

  1. అవును నిజం అండి.. ఆహారం బాగుంటే.. ఆరోగ్యం బాగుంటది.. ఆరోగ్యం బాగుంటే.. మనం బాగుంటం….సేంద్రియ ఆహారం తీసుకోవడం.. చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *