Jhalkari Bai
ఒక అసామాన్య మహా రాణి వెనుక.. ఒక సామాన్య విరోచిత మహిళ ఉందని మీకు తెలుసా..? ఓ దళిత మహిళ.. మహా రాణికి అండగా ఉందని తెలుసా..? అసలు బ్రిటీష్ వాళ్లతో వీరోచితంగా పోరాడింది.. ఝాన్సీ లక్ష్మీ బాయా..? ఝల్కారీ బాయ్‌నా..? రణ రంగంలో పోరాడుతూ చనిపోయిన అసలు వీరనారి ఎవరు..? ఝల్కారీ బాయ్..ఝాన్సీ లక్ష్మీ బాయ్ షాడో నా..? అసలు ఝల్కారీ బాయ్ ఎవరు..?
Jhalkari Bai
ఝల్కారీ బాయ్
బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన వీరనారి ఝాన్షీ లక్ష్మీ బాయ్. ఇది ఇప్పటి వరకూ మనకు తెలిసిన చరిత్ర. కానీ ఇప్పుడు ఝాన్షీ లక్ష్మీబాయ్ స్థానంలో ఝల్కారీ బాయ్ పేరు వినిపిస్తోంది.
అసలు వీరనారి ఈమెనని, దళిత మహిళ కావడంతో.. ఈమె పేరు బయటకు రాలేదని, రానివ్వలేదనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఝాన్సీ లక్ష్మీ బాయిని స్మరించుకునే ప్రతిసారి ..ఝుల్కారీబాయిని కూడా తలుచుకోవాలి.
Jhalkari Bai
ఝాన్షీ లక్ష్మీ బాయి సైన్యంలో ఝల్కారీ బాయ్ ప్రముఖ పాత్ర పోషించింది. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతి రూపంగా కీలక భూమికను పోషించిన ఘనత ఝల్కారీ బాయికే దక్కుతుంది.
ఝల్కారిబాయి ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవీ దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మించింది .
ఝల్కారీ చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలోనే పెరిగింది.
దీంతో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. ఝల్కారీ బాయ్ ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేసే పూరణ్‌సింగ్‌ను పెళ్లి చేసుకుంది.
తన భర్త దగ్గర సైనిక విద్యలన్నీ నేర్చుకుంది. ఆ తర్వాత లక్ష్మీబాయి దుర్గావాహిని మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.
Jhalkari Bai
1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టిముట్టినప్పుడు.. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ఖంగు తినిపించింది.

ఆ దాడిలో
ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అనేదానికి స్పష్టమైన ఆధారాలు లేవు.
Jhalkari Bai
కానీ ఝుల్కారీబాయి సాహసాన్ని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జానపద, పాటల రూపంలో గుర్తుకు చేసుకుంటారు. ఇప్పటికీ ఝుల్కారీ బాయ్‌పై ఎన్నో పాటలు ఉన్నాయి. జనం నుంచి వచ్చిన ఆమె సాహసాన్ని కథలు కథలుగా వినిపిస్తారు.
Jhalkari Bai Telugu
దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు.
భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. అయితే చరిత్రలో ఝాన్సీ లక్ష్మీ బాయ్ తెలిసినంతగా ఝుల్కారీ బాయ్ ఎవరికీ తెలియదనే చెప్పుకోవాలి.
ఫ్రెండ్స్.. ఝల్కారీ బాయ్ గురించి మన చరిత్ర పాఠాల్లో లేదు.. చరిత్ర పుటల్లో అట్టడుగున మాత్రం ఉంది. దానికి సాక్ష్యమే ఝల్కారీ బాయ్ స్టాంప్. ఝల్కారీ బాయ్ జానపద గీతాలు. సో ఝల్కారీ బాయ్ గురించి మీరేమనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
చాలా బాగుంది. మంచి సమాచారం