Menu

బాలీవుడ్ ‘మహా నటి’ మీనా కుమారి

Legendary Actor Meena Kumari Telugu

ఇంట్లో పేదరికం.. పెళ్లిలో మోసం.. దరికి చేరని ప్రేమ బంధం.. ఇవి ఓ మంచి నటిని మద్యానికి బానిస చేశాయి. వెండి తెరకు దూరం చేశాయి. 38 ఏళ్లకే మృత్యువు ఒడిని చేర్చాయి. ఆమె బాలీవుడ్ మహానటి మీనా కుమారి.

Meena Kumari బాలీవుడ్ సావిత్రి..

చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగి నిజ జీవితంలో మాత్రం చీకటిని నింపుకున్న మహా నటి సావిత్రి జీవితానికి.. మీనా కుమారి లైఫ్‌కు చాలా దగ్గర పోలికలున్నాయి. దాదాపుగా ఇద్దరిది ఒకటే స్ట్రగుల్.. ఒకటే అవస్థ.. ఒకటే యాతన. మీనా కుమారి కూడా మద్యానికి బానిసై లివర్ పాడై వెండితెరపై తన చిరు సంతకాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. బాలీవుడ్ స్క్రీన్‌పై ట్రాజడీ క్వీన్‌గా పేరుతెచ్చుకున్న ఆమె.. తన లైఫ్‌లో అలాగే మిగిలిపోయింది. ఆమె జీవితంలో పుట్టిన దగ్గర నుంచి అన్ని ట్విస్ట్‌లే చోటుచేసుకున్నాయి.

Meena Kumari బేబీ మీనా

మీనా కుమారి బాలీవుడ్‌లో మంచి నటి. ఇంట్లో పేదరికం కారణంగా తల్లీదండ్రులు మీనా కుమారిని పుట్టిన వెంటనే అనాథశ్రమంలో విడిచి పెట్టేశారు. కానీ కొన్ని గంటల్లో మనస్సు మార్చుకుని ఇంటికి తెచ్చుకున్నారు. ఆగస్టు ఒకటో తేదీ 1933లో ఆమె జన్మించింది. మీనా కుమారి నాలుగేళ్ల వయస్సు నుంచే నటించడం ప్రారంభించింది. ఒక సమయంలో ఆమె ఆదాయం ఇంట్లో 31 మంది కుటుంబాన్ని పోషించింది. ఆమె బాల్యం ఎంత కష్టతరంగా సాగిందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మీనాకుమారి అసలు పేరు మెహజా బీన్. డైరక్టర్ విజయ్ భట్ ఆమె పేరును బేబీ మీనాగా మార్చారు. ఆ పేరు పెద్దయ్యాక మీనా కుమారిగా స్థిరపడిపోయింది. మీనా కుమారి తండ్రి ముస్లిం, తల్లీ క్రిష్టియన్. మీనా తన 30 ఏళ్ల జీవితంలో 90కి పైగా సినిమాల్లో నటించింది. మీనా కుమారి నటనతో దిలిప్ కుమార్, రాజ్‌ కుమార్ వంటి హీరోలు పోటీపడలేకపోయేవారంట.

Meena Kumari పాకిజా మూవీ..

ఇప్పటికీ బాలీవుడ్ స్క్రీన్‌పై పాకిజా మూవీ ఏ మాత్రం వన్నె తగ్గలేదు. దానికి కచ్చితంగా మీనా కుమారి అభినయమే కారణంగా చెప్పుకోవచ్చు. బైజు బైరా, పరాయీ, ఫుట్ పాత్, చార్ దిల్ చార్ రహెన్, దేరా, అజాద్, మిస్ మేరీ, శారద, దిల్ ఏక్ మందిర్, కాజల్ వంటి సినిమాల్లో నటించింది. మీనా కుమారి నటించిన సినిమాలు ఆస్కార్‌‌‌కు నామినేట్ అయ్యాయి. 1954లో మొట్ట మొదటి ఫిల్మ్ పేర్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత ఏడాదిలో ఒకసారి గెలుచుకుంది. 1963లో మూడు సినిమాలకు నామినేట్ అయింది. సాహెబ్ బీబీ ఔర్ గులాం, పరిణిత, బైజు బావ్రా సినిమాలకు ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.

మీనా కుమారి చాలా డెడీ కేటడ్ యాక్టర్. ఒక సమయంలో యాక్సిడెంట్ అయి తన ఎడమ చెయ్యి ఆకారం కోల్పోయింది. దాంతో ఆమె కొన్ని సినిమాల్లో ఎడమచేయి కనబడకుండానే నటించింది. మీనా కుమారి మంచి నటి మాత్రమే కాదు. మంచి రచయిత్రి కూడా. చదువుకోకపోయినా ఉర్దూలో నాజ్ అనే కలం పేరుతో మంచి కవితలు రాసేది. అందులో చాలా వరకూ పబ్లిష్ అయ్యాయి. హిందీలో కూడా ప్రావీణ్యం ఉంది.

22 ఏళ్ల వయస్సులో పెళ్లి..

మీనా కుమారి తన 22 ఏళ్ల వయస్సులో డైరక్టర్ కమల్ అమ్రోహీని పెళ్లి చేసుకుంది. కమల్‌కు అది మూడో పెళ్లి. అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. 1949లో కమల్ అమ్రోహి సినిమాలు తీసి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. డైరక్టరే కాదు మంచి రచయిత కూడా. కవితలు అంటే ఇష్టపడే మీనా కుమారి తనకు తెలియకుండానే కమల్‌ను ఆరాధించింది. అతడిపై ప్రేమ పెంచుకుంది. మీనాకుమారితో ఓ సినిమాను ప్లాన్ చేసిన కమల్ ఆమెకు సినిమా కథ చెప్పడానికి వెళ్లడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. 1952లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Tedy ragqueen వరుస విజయాలు…

పెళ్లైన తర్వాత కూడా మీనామా కురి వరస విజయాలు అందుకుంది. ఎన్నోఅవార్డులను సొంతం చేసుకుంది. దీంతో కమల్ మనస్సులో అసూయ ఏర్పడింది. ఆ సమయంలో కమల్ అమ్రోహీ… మీనా కుమారిని హీరోయిన్‌గా పెట్టి పాకీజా సినిమా మొదలు పెట్టాడు. ఆ టైంలో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి తారాస్థాయికి చేరుకున్నాయి. దాంతో సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది.

తర్వాత నుంచి మీనా కుమారి కమల్ అనేక ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. ఎవరితోనూ మాట్లాడుకూడదు. ఎవరి కారులోనూ వెళ్లకూడదు, ఆదివారాలు నటించకూడదు, ఈ టైంకే వెళ్లాలి. పలానా టైంకే రావాలనే రూల్స్ పెట్టాడు. దీంతో మీనా కుమారి మానసికంగా కుంగిపోయింది. అంతేకాదు మీనా కుమారికి వచ్చిన అద్భుతమైన సినిమా అవకాశాలను కమల్ దూరం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ పరిణామంతో మీనా కుమారి మద్యానికి బానిసైంది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

దర్మేంద్రతో పరిచయం..

తర్వాత కాలంలో మీనా కుమారికి సినిమాల్లో కో యాక్టర్ దర్మేంద్ర పరిచయం అయ్యాడు. అప్పటికీ దర్మేంద్ర అప్ కమింగ్ యాక్టర్. అయినా మీనా కుమారి దర్మేంద్ర పట్ల ఆకర్షితురాలైంది. ఒంటరి తనంలో తనకు మంచి తోడుగా భావించింది. కానీ ధర్మేంద్ర ఆమె స్టార్ డమ్‌ను వాడుకుని.. తర్వాత కాలంలో ఆమెను దూరంగా పెట్టాడు. దాంతో మళ్లీ ఒంటరిగా మిగిలిపోయింది. దాంతో మళ్లీ మద్యం మత్తులో మునిగిపోయింది.

Pakeezah పాకిజా సినిమా..

అలాంటి సమయంలో సునీల్ దత్, నర్గిస్ దత్‌లో మధ్యలో ఆగిపోయిన పాకిజా సినిమాను మళ్లీ ప్రారంభించారు. ఆ సినిమా 1972లో విడుదలై ఘన విజయం సాధించింది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే మీనా కుమారి మద్యం కారణంగా లివర్ చెడిపోయి చనిపోయింది. ఆమె చనిపోవడంతో పాకిజా సినిమాకు అభిమానులు పోటెత్తారు. అలా భారీ వసూళ్లతో పాకిజా సినిమా రికార్డ్ సృష్టించింది.

వివాహ బంధం విచ్ఛినమై.. ప్రేమించిన మనిషి దూరమై మీనా కుమారి ఒంటరిగా మిగిలిపోయింది. మనస్సు విరిగి జీవితంలో విషాదాన్ని నింపుకుంది. వెండితెరపై తన నటనతో ఒలికించిన విషాదం.. తన జీవితంలో చేరుకుంది. అలా ట్రాజడీ క్వీన్ వెండితెర వినీలాకాశంలో ఓ ధ్రువ నక్షత్రంగా మిగిలిపోయింది.

హిందీ సావిత్రిగా మీనాకుమారికి పేరు ఉంది. అంతగా వారిద్దరి జీవితాల మద్య సారూప్యత ఉంది. సహజంగా ఆడవాళ్లు కోరుకునేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ కోసం పరితపిస్తారు. పాకులాడుతారు. ఎంత టాలెంట్ ఉన్నా.. ఎంత మంచి కెరీర్ ఉన్నా అవన్నీ మహిళలకు సంతృప్తినివ్వవు. నిజమైన ప్రేమ, అభిమానం కోసం తన్లాడుతుంటారు. అలాంటి తోడు దక్కనప్పుడు ఇలాంటి విషాదాలు బలి అయిపోతుంటారు.

దేశం కోసం ప్రాణం వదిలిన తొలి ముస్లిం : అష్ఫాకుల్లా ఖాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *