Menu

పొట్టి కథలు..లోతైన జీవితాలు

Metro Life Telugu Movie

మనుషుల్లోని ఏమోషన్స్‌కు రూపాన్ని ఇస్తే మెట్రో కథలు. OTT ఫ్లాట్‌ఫాంపై ఆడుతున్న ఈ ఫిల్మ్. సమస్యలను, ప్రేమను, ఆడవాళ్ల నిస్సహాయతను కళ్లకు కట్టాయి. ఏదైనా కాస్త భిన్నంగా జరిగితే ఇది తప్పు కదా.. అని తేలికగా చెప్పే మనం వాటి వెనుక ఉన్న లోతులను చూడలేం. ఆ ప్రయత్నమే మెట్రో కథలు. ఇందులో నాలుగు కథలు ఉన్నాయి. ప్రపోజల్, ఘటన, సెల్ఫీ, తేగలు. అన్నీ మనస్సును తడుముతాయి. పది, 15 నిమిషాల్లో అయిపోయే ఈ కథలు ముగిసిన తర్వాత కూడా మన బుద్ధికి, మనస్సుకు పరీక్ష పెడతాయి.

Metro Life Telugu Movie ప్రపోజల్

ప్రపోజ్ చేసినంత ఈజీ కాదు.. వాళ్లని వాళ్లగా జీవితంలోకి యాక్సెప్ట్ చేయడం.  ప్రపోజల్ స్టోరీలో ఒక అబ్బాయి ప్రపోజల్‌కు ఓ అమ్మాయి స్పందించిన తీరు చాలా బాగుంటుంది. చాలా సూటిగా తన బ్యాక్ గ్రౌండ్‌ను చెబుతుంది. తన కావాల్సిందిగా వివరిస్తుంది. నిజాయితీగా పాత లవ్‌ ఎఫైర్ గురించి చెబుతుంది. ఇక ముందు ఎలా ఉండాలనేదానిపై తనకున్న స్పష్టతను వెల్లడిస్తోంది. అయితే ప్రపోజ్ చేసిన అబ్బాయి మాత్రం.. ఇంటర్‌లో అమ్మాయికి ఉన్న లవ్‌ ఎఫైర్‌ దగ్గరే ఆగిపోతాడు.

Metro Life Telugu Movie  ఘటన

Metro Lifes

జీవితంలో చాలా చాలా జరుగుతాయి. అందులో మంచివి ఉండొచ్చు. చెడు ఉండొచ్చు. అలాగే  ఈ ఘటన స్టోరీలో  ఓ మధ్య వయస్సు గల  మహిళ ఓ యంగ్ మ్యాన్‌తో అనుకోకుండా ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తుంది. చూస్తే ఇదేంటీ అని అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఓ నిస్సహాయ స్థితి ఉంటుంది.  బాధ్యతలకు భయపడి పారిపోయిన భర్త..  తిరుగొచ్చి భారంగా మారతాడు. ఇంటా, బయట వేధింపులు, దక్కని సుఖం, దొరకని భద్రత.. ఇవన్నీ ఒత్తిడిగా మారి సతమతం చేస్తాయి.  ఆ ఒత్తిడిలో జరిగే పొరపాటో, తప్పో.. అలా జరిగిపోతుంది అంతే. దానికి ఏ పేరు పెట్టలేం.

Metro Life Telugu Movie సెల్ఫీ

మంచి జాబ్, మంచి భర్త ఉండే ఓ అమ్మాయి.. వేరే మగవాడితో హోటల్ రూమ్‌కు వెళ్తుంది. మంచి భర్త ఉంటే సరిపోదు.. మంచి భర్తగా కూడా ఉండాలి. ఇదే ఈ స్టోరీ లైన్. భార్య, భర్తల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండాలి. అది లేకపోతే ఫిజికల్లీ, మెంటల్లీ ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీ చెబుతుంది. భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత భర్త రియలైజ్ అయి దగ్గరకు వస్తానంటాడు. అయితే ‘నిన్ను పొందాలంటే నేను ఏదన్న కోల్పోవాలా..?’అని భార్య అడిగే ప్రశ్న  ప్రేక్షకులను వెంటాడుతుంది.

Metro Life Telugu Movie తేగలు

ఏ వస్తువుతోనైనా కనెక్ట్ అయ్యాం అంటే దాని వెనుక ఏదో ఏమోషన్ ఉండే ఉంటుంది. ఆ కథే.. తేగలు. ఈ కథలో ఓ వ్యక్తి తేగలంటే తెగ ఇష్టపడతాడు. విసుక్కున్నా సరే  ఇంట్లోవాళ్లతో తినిపిస్తూ ఉంటాడు. చిన్నప్పటి విషయాలను ఏది మరిచిపోని ఆ వ్యక్తిని.. ఓసారి భార్య  తేగలంటే ఎందుకిష్టం అని అడుగుతుంది.

తేగలంటే తన తండ్రికి చాలా ఇష్టమని.. ఆ తేగలు తినేందుకు డబ్బులు లేక చాలా కష్టాలు పడేవాడని చెబుతాడు. కానీ తన చిన్నప్పుడే నాన్న చనిపోయాడని బాధపడతాడు.  అలా ఆ తేగల్లో తన తండ్రిని చూసుకుంటూ ఉంటాడు. మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తులకు ఇష్టమైనదేదైనా మనం ఇష్టపడతాం.  ఆ స్టోరీ చూసినంత సేపు తేగల వెనుక దాగి ఉన్న ప్రేమ వెంట మన మనస్సు పరుగులు తీయక మానదు.

ఈ కథలను మ‌హ‌మ్మ‌ద్ ఖ‌దీర్‌బాబు రాశారు. అప్పట్లో ఈ కథలకు పాఠకుల  నుంచి మంచి స్పందన వచ్చింది. పలాస డైరెక్టర్ కరుణ కుమార్ వీటిని డైరక్ట్ చేసి వెబ్ ఫిల్మ్‌గా తెరకెక్కించారు.

ఈ సమాజంలో పేద, ధనిక తేడాలు, కులం, మతం, లింగ బేధాలున్నాయి. ఈ అసమాన సమాజంలో ఉన్నవాళ్లు అంతే సంక్లిష్టమైన సమస్యలను ఫేస్ చేస్తూ.. ఆ సమస్యలకు తమదైన పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటారు. ఆ పరిష్కారాలు ఈ సమాజంలోని విలవలకు లోబడి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని ఎలా చూడాలనేది కచ్చితంగా ఎవరికివారు ప్రశ్నించుకోవాలి.

You can Also like these posts also

ముద్దు గులాబీలపై.. ముళ్ల వర్షం

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *