Menu

పగిలిన పాదాలకిపుడు ఒకటే ఆశ.

Migrant Workers Telugu

పగిలిన పాదాలకిపుడు
ఒకటే ఆశ
పదిలంగా పల్లెకు పోవాలి
రాజ్యానికి పట్టలేదు లాఠీలేమో
తరిమికొడుతున్నాయి
అందుకే
పట్టణాల నుండి
పట్టాల బాట పట్టారు
Migrant Workers
గుండె చెదిరినా
కాళ్ళు అరిగినా
చర్మం కమిలినా
మనసు రగిలినా
ఊరు వైపే పయనం

Migrant Workers

ఆ పయనాన్ని
ఆకలీ, చావులూ
ఆపలేదు
పురిటి నొప్పులసలే
ఆపలేదు
నవశిశువుల ఏడుపునీ
చెరిగిపోతున్న బాల్యాన్ని
మోస్తూనే.
ఆఖరి మజిలీకి
మిగిలింది నడకొక్కటే.

Migrant Workers

                     – అన్నపూర్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *