Menu

థామస్ అల్వా ఎడిసన్ కుట్రలు.. వెలుగులు పంచిన నికోలా టెస్లా

Nikola tesla inventions

బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కుట్రలు పన్నారా..? తనను దాటి ఎవరూ వెళ్లకూడదని భావించారా..?
ప్రపంచ మేధావి నికోలా టెస్లాను తొక్కేయాలని చూశారా..?

ప్రపంచ చరిత్రను మళ్లీ ఒక్కసారి తెరిచి చూస్తే. థామస్ అల్వా ఎడిసన్ పంచిన వెలుగులు వెనుక ఓ చీకటి అధ్యాయం కనిపిస్తుంది. ఆ చీకటిని చీల్చుకుని వచ్చిన గొప్ప మేధావి నికోలా టెస్లా. ఓటమితో చెలిమి చేస్తూ గెలిచిన వ్యక్తి.
Nikola
నికోలా టెస్లా ప్రపంచ మేధావి. భూమిపై కాంతులు విరజిమ్మిన గొప్ప శాస్త్రవేత్త. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. 19, 20వ శతాబ్దంలో విద్యుత్, అయస్కాంతత్వాలకు సంబంధించి అనేక పరిశోధనలు చేశాడు. నికోలా టెస్లాకు 700 కంటే ఎక్కువ పేటెంట్లు ఉన్నాయి.

Nikola tesla inventions

నికోలా క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో 1856 జూలై 10న జన్మించాడు. టెస్లా పుట్టుకతో సెర్బియన్. తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు. నికోలా టెస్లా  పరిశోధనా అంశాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటర్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడ్డాయి.
1894లో వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను కనిపెట్టడంతో అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డాడు. టెస్లా ఆవిష్కరణలు ఆధునిక ఎలక్టికల్ ఇంజనీరింగ్ విభాగానికి మార్గ దర్శకాలు కూడా అయ్యాయి.

Nikola tesla inventions

నికోలా విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ యాంత్రిక ఇంజనీరింగ్ విభాగాల్లో చేసిన కృషి ఫలితంగా రోబోటిక్స్, రిమోట్ కంట్రోల్, రాడార్, కంప్యూటర్ విజ్ఞానం, బాలిస్టిక్స్, కేంద్రక భౌతిక శాస్త్ర రంగాలలో పురోగతి సాధించగలిగాం.

Nikola tesla inventions

Nikola 1
వాస్తవానికి టెస్లా తండ్రి చర్చ్ ఫాదర్, టెస్లాను అలాగే మత ప్రచారకుడు చేయాలని తండ్రి అనుకునేవాడు. టెస్లా మాత్రం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌వైపు అడుగు వేశాడు. 1875లో గ్రాజ్ లోని ఆస్ట్రియన్ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. అక్కడే ఆల్టర్ నేట్ కరెంట్ ఉపయోగాలపై స్టడీ చేశాడు
.

Nikola tsla inventions

పాలిటెక్నిక్‌  అయిన తర్వాత టెస్లా అమెరికా వెళ్లి థామస్ అల్వా ఎడిసిన్‌ దగ్గర జాయిన్ అవుతాడు. ఎడిసన్‌తో కూడా ఆల్టర్ నేటివ్ కరెంట్ గురించి, వైర్ లెస్ కమ్యూనికేషన్స్ గురించి చర్చిచేంవాడు.
అయితే టెస్లాను ప్రోత్సహిస్తే ఎడిషన్ ఉనికికి, వ్యాపారానికే ప్రమాదం ఉందని గ్రహించి అక్కడే ఆపాలని ప్రయత్నించాడు. డైరక్ట్ కరెంట్ జనరేటర్స్, DC లోని లోపాలు సరిచేయగలిగితే టెస్లాకు 50వేల డాలర్లను ఇస్తానని ఎడిషన్ చెబుతాడు.

Nikola tesla inventions

దీంతో టెస్లా ఆ లోపాలన్నీ సరిచేస్తాడు కానీ ఎడిషన్ తాను జోక్ చేశానని అంటాడు. దీంతో నికోలా టెస్లా ఆ కంపెనీని విడిచి పెట్టి సొంతంగా చిన్న ల్యాబ్ పెట్టుకుని ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు.  అయితే అది కొంతకాలానికి అగ్ని ప్రమాదానికి గురై తగలబడిపోతుంది. ఆ పని థామస్ అల్వా ఎడిషనే చేయించాడనే కథనాలు ఉన్నాయి.

Nikola Tesla

ఆ తర్వాత ఎడిషన్ ఎలక్ట్రిక్ కేబుళ్లకు కాలువలు తవ్వే పనిలో జాయిన్ అయి రోజులు గడిపేవాడు. ఇతన ప్రయోగాలు గురించి తెలిసిన ఒక పెద్ద మనిషి టెస్లాని ప్రోత్సహిస్తాడు.

Nikola tesla inventions

తర్వాత టెస్లా AC జనరేటర్స్ పవర్ సిస్టమ్‌ని అభివృద్ధి చేశాడు. ఐదేళ్లలోనే AC మోటర్స్, ట్రాన్స్ ఫార్మర్స్, జనరేటర్స్ మొదలగునవి 30 వాటి మీద పెటెంట్స్ తీసుకుంటాడు. DC కంటే AC కరెంట్ అన్ని విధాలుగా బాగుండడంతో అందరూ AC కరెంట్‌ను వాడటం మొదలుపెట్టారు.
Tesla
అయితే తన వ్యాపారం దెబ్బతింటుందనే కారణంతో థామస్ ఆల్వా ఎడిసన్ AC కరెంట్ తన వ్యాపారానికి  ప్రమాదమని గ్రహించి దానిపై తప్పుడు ప్రచారాలకు పూనుకుంటాడు
AC కరెంట్‌తో కుక్కలను, జైల్లో ఖైదీలను చంపించి ఆల్టర్‌నేటింగ్ విద్యుచ్చక్తి చాలా ప్రమాదమని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆ ఆరోపణలను టెస్లా అంతే ధీటుగా ఎదుర్కొంటాడు.

Nikola Tesla

లక్షల వోట్ల AC కరెంట్‌ను తన మీదే ప్రవహించే చేసుకుని ప్రపంచానికి ఈ కరెంట్ సురక్షితమని నిరూపించాడు. ఆ తర్వాత నయాగరా వాటర్ ఫాల్స్ కి టర్బైన్ ని అమర్చి జనరేటర్స్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి దాన్ని న్యూయార్క్ నగరానికి పంపి ప్రపంచం అంతా అబ్బుర పడేలా చేశాడు.
టెస్లా తనకొచ్చే ప్రతి రూపాయిని ప్రయోగాలకే ఉపయోగించేవాడు. టెస్లా పరిశోధనలు, ఆవిష్కరణలు లేకపోయుంటే టెస్లా ఈ ఆధునిక ప్రపంచం ఇలా మాత్రం  ఉండేది కాదు. అయితే టెస్లా‌ నార్మల్ పర్సన్ కాదు. చాలా మెమరీ పవర్ ఉండేది. రాత్రి పూట 2 గంటలు మాత్రమే పడుకునేవాడు.

Nikola Tesla

అతి పరిశుభ్రత ఎక్కువ పాటించేవాడు. అంటే OCD ప్లాబ్లమ్ ఉండేది. టెస్లాకు నటులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉండేవి. టెస్లా పెళ్లి చేసుకోలేదు. ఇన్ని గొప్ప ఆవిష్కరణలు చేసిన టెస్లా..
కడు పేదరికాన్ని అనుభవించాడు. 1943 జనవరి 7న చనిపోయాడు. నికోలస్ టెస్లాపై హాలీవుడ్‌లో  The Imitation Game అనే పేరుతో  సినిమా కూడా వచ్చింది.

1 Comment

  1. Nice story..
    ఈ కథనం ఏ పుస్తకం ఆధారంగా రాశారో చివర తెలియజేయడం వల్ల దీనికి మరింత బలం చేకూరుతుంది అనుకుంటున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *