Migrant Workers Telugu పగిలిన పాదాలకిపుడు ఒకటే ఆశ పదిలంగా పల్లెకు పోవాలి రాజ్యానికి పట్టలేదు లాఠీలేమో తరిమికొడుతున్నాయి అందుకే పట్టణాల నుండి పట్టాల బాట పట్టారు గుండె చెదిరినా కాళ్ళు అరిగినా చర్మం కమిలినా మనసు రగిలినా ఊరు వైపే పయనం Migrant Workers ఆ పయనాన్ని ఆకలీ, చావులూ ఆపలేదు పురిటి నొప్పులసలే ఆపలేదు నవశిశువుల ఏడుపునీ చెరిగిపోతున్న బాల్యాన్ని మోస్తూనే. ఆఖరి మజిలీకి మిగిలింది నడకొక్కటే. Migrant Workers – అన్నపూర్ణ ముద్దు గులాబీలపై.. ముళ్ల వర్షం
థామస్ అల్వా ఎడిసన్ కుట్రలు.. వెలుగులు పంచిన నికోలా టెస్లా
Nikola tesla inventionsబల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కుట్రలు పన్నారా..? తనను దాటి ఎవరూ వెళ్లకూడదని భావించారా..? ప్రపంచ మేధావి నికోలా టెస్లాను తొక్కేయాలని చూశారా..?
ముద్దు గులాబీలపై.. ముళ్ల వర్షం
Save Girls ఆ నెత్తురు ధార.. ఆగలేదు ప్రకృతి పాఠశాలలో పాఠాలే నేర్వని ఆరేళ్ళ ముద్దుల శిరీష అత్యాచార విలయంలో ఆగని ఆర్తనాదమయ్యింది. ప్రకృతి దారులు రెండూ ఒకటే రక్తపు ధా(దా)రై బొట్లు బొట్లుగా దారి పొడుగుతునా పారింది ముద్దలై ముక్కలై నేల రాలింది ఆ నెత్తురు ధార.. ఆగలేదు దోసిలే పట్టినా గుడ్డలే కుక్కినా నెత్తుటి గుడ్డే అయ్యింది పసి “బిడ్డసంచి” చినిగింది అమ్మ గుండె పగిలింది తప్పేనా?! యోని దారులకు కుట్లు గర్భసంచికి మాట్లు ఆ నెత్తురు ధార.. ఆగలేదు ఇంటర్నెట్ సమాచార వనం పెంచిన సెక్సహింసల విషఫలాలకి మాలిన్యాల నిక్షిప్తమైన మానవ […]
గాజుపెంకు
అనుకున్నా… ఆ హృదయం పూలవనమనీ వణికే చిగురాకనీ కరిగే వెన్నముద్దనీ చల్లని మంచుబిందువనీ అందుకే ముద్దాడాను వెర్రిబాగులదాన్ని కదా నా బుగ్గ నెత్తురుముక్కయ్యింది అర్థం చేసుకున్నా… ఆ హృదయం గాజుపెంకని.. — అన్నపూర్ణ
ఉద్దమ్ సింగ్
ఆకలితో అలమటించాడు.. ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు.. దేశంకాని దేశానికి వెళ్లి.. తను అనుకున్నది సాధించాడు. మాతృదేశం కోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమేనని గర్వంగా ప్రకటించాడు. బ్రిటిష్ వారి వెన్నులో వణికు పుట్టించి.. భారత యువత గుండెల్లో అగ్గి రగిల్చాడు. అతనే ఉద్దమ్ సింగ్.
చరిత్ర చెప్పని కథ … ఝల్కారీ బాయ్
Jhalkari Bai ఒక అసామాన్య మహా రాణి వెనుక.. ఒక సామాన్య విరోచిత మహిళ ఉందని మీకు తెలుసా..? ఓ దళిత మహిళ.. మహా రాణికి అండగా ఉందని తెలుసా..? అసలు బ్రిటీష్ వాళ్లతో వీరోచితంగా పోరాడింది.. ఝాన్సీ లక్ష్మీ బాయా..? ఝల్కారీ బాయ్‌నా..? రణ రంగంలో పోరాడుతూ చనిపోయిన అసలు వీరనారి ఎవరు..? ఝల్కారీ బాయ్..ఝాన్సీ లక్ష్మీ బాయ్ షాడో నా..? అసలు ఝల్కారీ బాయ్ ఎవరు..?
విజేతలు..
Winners ఉన్నవాళ్ల జీవితాలు, లేనివాళ్లు జీవితాలు కూడా ఒకేలా స్టార్ట్ అవుతాయి. అయితే ఉన్నవాళ్ల జీవితాలందరి ముగింపు ఒకేలా ఉంటాయి. కానీ పేదల జీవితాల ముగింపులు ఒక్కోక్కరిది ఒకోలా ఉంటుంది : టాల్ స్టాయ్ అసామాన్యుల కథలు కాదు.. సామాన్యుల బతుకులే కావాలి. మనలా మెట్టు నిర్మించుకుని ఎక్కేవాళ్లే కథలే మనకు స్ఫూర్తినిస్తాయి. ఆత్మస్థైర్యాన్ని అందిస్తాయి.. Winners ఒకరుఅన్ని తానై ఇంటికి దీపంలా మారుతారు. తమకంటూ అన్ని వదలుకుని.. ఇంటి బాధ్యతలను భుజానేసుకుంటారు. మరొకరు ఏ గాడ్ ఫాదర్ లేకుండా కొన్ని వృత్తుల్లో తమకంటూ ఓ స్థానాన్నిఏర్పరుచుకుంటారు. ఇంకొరు చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు జర్నీ స్టార్ట్ చేసి […]
తడుస్తూనే…..
తడుస్తూనే వుంటాను… దూఃఖంలొ…అలసటలో…ఆనందంలో.. తడుస్తూనే వుంటాను.. నా కల చెదిరినా.. నె వెరొకరి కలనయినా.. గత కాలాపు క్షణాలన్నిటిని తడి ఆరని నా కళ్ళు తలుస్తూనే వుంటాను