Proposal Rejection
అల వైకుంఠపురం సినిమాలో రామచంద్రరావు క్యారెక్టర్ చెప్పినట్టు ఒక ఆఫర్‌కు నో అని చెప్పాలంటే.. నిజంగానే గట్స్ ఉండాలి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. మనకు ఇష్టం లేనప్పుడు ఎన్ని కోట్లు వచ్చినా వద్దని చెప్పగలగాలి. ఎన్ని ప్రయోజనాలున్న కుదరదని తేల్చి చెప్పేయాలి. బుజ్జగించినా.. బెదిరించినా అదే స్టాండ్‌పై నిలబడగలగాలి. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలా కొంతమంది ఉన్నారు.
ఇటీవల కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ చేస్తే రూ.200 కోట్లు ఇస్తానన్నా ఆ యాడ్ చేయనని హీరోయిన్ సాయి పల్లవి తెగేసి చెప్పింది. ఎందుకు చేయదో క్లారిటీ కూడా ఇచ్చింది. ఎన్ని కోట్లు ఇచ్చినా.. అబద్ధాలను ప్రచారం చేయనని కుండబద్దలు కొట్టేసింది. నిజంగానే హైబ్రీడ్ పిల్ల అనిపించుకుంది.
Proposal Rejection
ఇలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. బాలీవుడ్‌లో తన మాటలతో హీట్ పుట్టించే క్వీన్ కంగనా రనౌత్ కూడా ఇలాంటి ఓ ప్రపోజల్‌ను రిజక్ట్ చేసింది. యువతలో తప్పుడు ఆలోచనలను ప్రచారం చేసే ఉత్పత్తులకు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉత్పత్తుల యాడ్స్ చేయడానికి ఒప్పుకోలేదు. అలా రూ.2 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను కంగనా తిరస్కరించింది.
అలాగే సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఓ సంతకం చేసుకుని అతి చిన్న వయస్సులోనే చనిపోయిన సుశాంత్ రాజ్‌పుత్ కూడా రూ.15 కోట్ల ఒప్పందాన్ని తిరస్కరించాడు. ఓ సందర్భంగా ఒక స్కిన్ టోన్ మరొకదాని కంటే ఉత్తమం అనే ఆలోచనను తాను ఆమోదించనని, తప్పుడు మెసెజ్ పంపకపోవడం ప్రతి నటుడి కర్తవ్యం అని సుశాంత్ అభిప్రాయపడ్డాడు.
Proposal Rejection
అదేవిధంగా యువతలో రేసిజం, సెక్సిజం వంటి తప్పుడు ఆలోచనలను ప్రచారం చేసే దేనినీ తాను ఎప్పటికీ ఆమోదించనని అనుష్క శర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పింది. ఇతర దానికంటే ఇంకొటి మంచిదనే దేనిని యాక్సెప్ట్ చేయనని స్పష్టం చేసింది.
ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉత్పత్తులు, ప్రకటనలను నిషేధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్స్‌లో తాప్సీ కూడా ఒకరు. అందాలను ప్రామాణికంగా తీసుకోవడం అనేది తాను ఎప్పటికీ ఆమోదించనని ఆమె స్పష్టంగా చెప్పేసింది.
పాకిస్తాన్ జాతీయ నటి తాను కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్‌లను నిరాకరిస్తున్నట్టు వెల్లడించింది. ఫెయిర్‌నెస్ బ్రాండ్‌ను తాను ఎప్పటికీ ఆమోదించనని అన్నారు. తాను షారుఖ్ ఖాన్ సరసన 2017 లో వచ్చిన రీస్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
వీళ్లతోపాటు ఆదిత్య వర్మ సినిమాతో పాపులర్ అయిన నటి బనితా సంధు కూడా ఫెయిర్ నెస్ క్రీమ్ ఉత్పత్తులకు సంబంధించిన ప్రచారాలను ఆమోదించనని చెప్పారు. బోల్డ్‌గా మాట్లాడే బాలీవుడ్ బ్యూటీ స్వర కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ప్రచారాలు యువతలో జాత్యహంకారానికి బీజం వేస్తాయని అభిప్రాయపడింది.
Proposal Rejection
వీళ్లతో పాటు కోట్ల రూపాయలు ఇస్తామన్న నేను చేయను అని చెప్పిన ఇంకో బాలీవుడ్ సూపర్ స్టార్ ఉన్నారు. ఆమె విద్యాబాలన్. లాస్ట్ ఇయర్ కోబ్రో పోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం తెలిసింది. దేశంలో ఎలక్షన్ హీట్ నడుస్తున్న సమయంలో ఓ సంస్థ కొంతమంది బాలీవుడ్ స్టార్స్‌కు డబ్బులు ఇస్తామని, తాము చెప్పే పార్టీలకు, ఆ పార్టీల నాయకులు అనుగుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని దీనికి కోట్లలో డబ్బులిస్తామని ఆశ చూపించారు.
ఈ ఆఫర్‌కు సోనుసూద్ కూడా ఫిదా అయిపోయారు. పార్టీలకు అనుగుణంగా తమ వాయిస్‌ను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సొనూసూద్‌తో పాటు అమీష పటేల్, వివేక్ ఓబేరాయ్, మహిమా చౌదరి, శక్తి కపూర్ వంటి మొత్తం 36 మంది సెలబ్రిటీలు అంగీకరించారు. కానీ ఆ ఆఫర్‌ను విద్యా బాలన్ మాత్రం తిరస్కరించారు. డబ్బులు కోసం మనస్సాక్షిని అమ్ముకోవడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. దీంతో అప్పట్లో విద్యాబాలన్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిసింది.
Proposal Rejection
ఇలా కొంతమంది నమ్ముకున్న విలువల ముందు డబ్బు విలువ పడిపోయింది. డబ్బు కంటే విలువలు ఎంత గొప్పవో మరోసారి తెలియజేశారు. నో చెప్పి తమ ప్రత్యేకతను చాటుకోవడమే కాదు.. గొప్ప ఆలోచనలను వెల్లడించారు. మరికొద్దిమందికి రోల్ మోడల్ కూడా అవుతున్నారు. ప్రజల సొమ్ముతోనే బతుకుతూ.. వారికి చెడు చేసే ప్రొడక్ట్‌లకు ప్రచారం చేయడం ఏ మాత్రం సరైనది కాదు. ఆ బాధ్యతను గుర్తించడం ఎంతైనా చెప్పుకోదగ్గ విషయమనే చెప్పాలి.
అలాగే ఏదో సాధించాలని.. సమాజానికి మంచి చేయాలనే పెద్ద పెద్ద గోల్స్ లేకపోయినా.. మన మనస్సుకు విరుద్ధం అనుకున్నప్పుడు.. దేనిని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని అంతే ధీటుగా కూడా చెప్పగలగాలి. డబ్బులు వస్తాయనో.. మొహమాటానికో.. ఇంక దేనికో రాజీ పడిపోతూ బతకాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తిత్వాలు ఇప్పుడు చాలా అవసరం. సొంత అభిప్రాయాలను వెల్లడించి.. వాటితో బతకగలిగే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక వేళ లేకపోతే.. దానిని ప్రశ్నించి సాధించాల్సిన అవసరం కూడా ఉంది.
Very good
Very good qlty
Spr msg
Thank you so much..