Protest Of Goa
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశ రాజధాని రైతు ఉద్యమంతో రగులుతుంటే.. పర్యాటకులతో ఎప్పుడు సందడిగా ఉండే గోవా నిరసనోద్యమాలకు వేదికైంది. సేవ్ మొల్లెం పేరుతో ఎప్పటి నుంచో అక్కడే ఆందోళన సాగుతుంది. అక్కడి ప్రజలు గోవాలో కేంద్రం ఆమోదించిన మూడు కొత్త ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు.
వాటిపై ఎప్పటి నుంచో తీవ్రంగా నిరసనలు చేపడుతున్నారు. డిసెంబర్ 19న గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున శాంతి యుతంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా 30 మందికిపైగా యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో మైనర్లు కూడా ఉన్నారు.
Protest Of Goa
గోవాలో ప్రభుత్వం మూడు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవి హైవే విస్తరణ, రైల్వే లైన్ విస్తరిస్తూ రెండు ట్రాకులు వెయ్యడం, ట్రాన్స్మిషన్ పవర్ లైన్ ఏర్పాటు చేయడం.
అయితే ఈ మూడు ప్రాజెక్టుల వల్ల దక్షిణ గోవాలోని పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
పురాతనమైన అడవులకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీవ వైవిధ్యానికి ఆలంబనగా ఉండే మొల్లెం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి పెద్ద ముప్పు ఉందని చెబుతున్నారు.
ఈ కేంద్రం భారతదేశ పశ్చిమ కనుమల్లో 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో విశేషాలు గోవాలో ఉన్నాయి. దూద్ సాగర్ ఫాల్స్, 12వ శతాబ్దానికి చెందిన ఒక హిందూ దేవాలయం ఉంది. ఇక్కడ అడవుల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
128 రకాల మొక్కలు, వివిధ రకాల పక్షులు, సీతాకోక చిలుకలు, సరీసృపాలు, చిరుతలు, బెంగాల్ పులులు, పాంగొలిన్స్‌లతో పాటు అనేక రకల వన్యమృగాలు ఉన్నాయి.
Protest Of Goa
అంతేకాదు ఇప్పుడు ప్రతిపాదించిన రైల్వే ట్రాక్ విస్తరణ ప్రాంతంలో ఒక ప్రత్యేక జాతికి చెందిన తూనీగలు ఉన్నట్టు తెలిసింది. ఈ జాతి తూనీగలు గోవాలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేవని రికార్డులు చెబుతున్నాయి.
అలాగే పవర్ లైన్ కోసం కేటాయించిన ప్రాంతంలో ఒక ప్రత్యేక జాతి చీమలు ఉన్నాయి. అవి ఇండియాలో రెండు చోట్ల మాత్రమే ఈ రకం చీమలు ఉన్నాయని రికార్డుల్లో నమోదైంది. మూడు ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల 60 వేల నుంచి 80 వేల చెట్లను నరికి వేయవల్సి వస్తుంది.
Protest Of Goa
పర్యావరణంపై ఎంత ప్రభావం పడుతుందో అంచనా నివేదికను తయారు చేయకుండానే, జీవవైవిధ్య ప్రభావ అంచనాను తయారు చేయకుండానే ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వన్యప్రాణులకు సంబంధించి ఎటువంటి ఉపశమన చర్యలను సిఫారసు చేయకుండా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ 2020 ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్టును ఆమోదించింది. లాక్‌డౌన్ సమయంలో ఆమోదం తెలిపింది.
Protest Of Goa
ఇంత అత్యవసరంగా ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఎందుకు ఆమోదం తెలిపిందని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. కేవలం బొగ్గు రవాణాను సులభతరం చెయ్యడం కోసమే ఇదంతా చేస్తుందని విమర్శిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతం మొత్తం బొగ్గు కేంద్రంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు. గోవాలో ఉన్న ఏకైక ఓడరేవు ఎంపీటీ పోర్ట్‌లో సుమారు 90 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి అవుతోంది. చుట్టుపక్కల రాష్ట్రాలకు అవసరమైన బొగ్గును ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు.
2030 కల్లా ఐదు కోట్ల టన్నులకు పైగా బొగ్గును దిగుమతి చేసుకోవడమే ఎంపీటీ లక్ష్యమని రిపోర్టులు తెలుపుతున్నాయి.
Protest Of Goa
ఇలా దిగుమతి చేసుకున్న బొగ్గును గోవా మీదుగా ఇతర రాష్ట్రాల్లోని అదానీ గ్రూపు, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, వేదాంత లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అక్కడ బొగ్గు దిగుమతితో చుట్టుపక్కల ప్రాంతాల్లో బొగ్గు దూళీ ఎగిరి ఇళ్లలో పేరుకుపోతుంది. స్థానికుల కాళ్లకు, చేతులకు అంటుకుంటుంది. చాలామందికి శ్వాశ కోశ సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి ఊపిరితిత్తులు పాడేపోతున్నాయి.
Protest Of Goa
దీంతో నిరసనకారులు సేవ్ గోవా లంగ్స్ అనే నినాదంతో ఉద్యమిస్తున్నారు. ప్రజల ప్రాణాలను తీసి.. పర్యావరణాన్ని పాడుచేసే ఈ నిర్ణయాలు ఎందుకని, ఇది నిజంగా అభివృద్ధా..? స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నిజమే.. కోట్లాది జీవులను, ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకునే ఈ నిర్ణయాలు నిజంగా డెవలప్‌మెంటేనా..? వ్యక్తులు, పర్యావరణాన్ని నాశనం చేసే అభివృద్ధి అవసరమా..? అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి.
Protest Of Goa
ప్రజలకు కావాల్సింది.. ప్రజలు కోరుకునేది.. కేవల ప్రజలకు మంచి చేసే పనులు.. అది వారిని సంప్రదించిన తర్వాత మాత్రమే చేయడం ప్రభుత్వం బాధ్యత. ఇక్కడ అలా ఏ మాత్రం జరగడం లేదు.
ఇటు వ్యవసాయ చట్టాలైనా.. అటు గోవా ప్రాజెక్టులైనా.. అసలు ప్రజలే వద్దంటుంటే.. ప్రభుత్వం మాత్రం ఎందుకు మొండిగా ముందుకు వెళ్తుంది..? ఇందులో ప్రజా ప్రయోజనాలే ఉన్నాయా..?
You have some really pretty ones! I love the little paperclip bookmarks, and the ones that appear to be metal with cut-out patterns are gorgeous. I need those! Cicily Peterus Maurreen
Plans are underway for this litter of 6 pups to travel to Vancouver towards the end of February. Wonderful that mom has joined her pups in the garden and is feeding them and being well-nourished herself. I look forward to meeting them all and finding them good homes in greater Vancouver area. Ginny Quentin Warms
I would like to thank you for the efforts you have put in writing this site. I am hoping the same high-grade site post from you in the future as well. Actually your creative writing skills has encouraged me to get my own site going now. Actually blogging is spreading its wings and growing quickly. Your write up is a good example. Aloysia Teador Winni