Save Girls
ఆ నెత్తురు ధార.. ఆగలేదు
ప్రకృతి పాఠశాలలో
పాఠాలే నేర్వని ఆరేళ్ళ
ముద్దుల శిరీష
అత్యాచార విలయంలో
ఆగని ఆర్తనాదమయ్యింది.
ప్రకృతి దారులు రెండూ
ఒకటే రక్తపు ధా(దా)రై
బొట్లు బొట్లుగా
దారి పొడుగుతునా పారింది
ముద్దలై ముక్కలై నేల రాలింది
ఆ నెత్తురు ధార.. ఆగలేదు
దోసిలే పట్టినా
గుడ్డలే కుక్కినా
నెత్తుటి గుడ్డే అయ్యింది
పసి “బిడ్డసంచి” చినిగింది
అమ్మ గుండె పగిలింది
తప్పేనా?!
యోని దారులకు కుట్లు
గర్భసంచికి మాట్లు

ఆ నెత్తురు ధార.. ఆగలేదు
ఇంటర్నెట్ సమాచార వనం
పెంచిన సెక్సహింసల
విషఫలాలకి
మాలిన్యాల నిక్షిప్తమైన
మానవ మస్తిష్కం
ముద్దు గులాబీల పై
కురిపిస్తున్న ముళ్ళ వర్షానికి
లలిత లావణ్య శిరీష సరోజల
లేత శరీరాలు
పసిబాల్యాలు
వశివాడిపోతున్నాయి.
అన్నపూర్ణ..