Successful Woman Telugu
నా పేరు వైష్ణవి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన దానిని. మా నాన్నగారికి మేము ఇద్దరం ఆడ పిల్లలు అందులో నేను పెద్ద దానిని. నాన్న ఒక టైలర్ రోజంతా కష్టపడేవారు. నేను ఆయన దగ్గరే ఉండి టైలరింగ్ నేర్చుకుని ఆయనకి సంపాదనలో సాయం చేసేదానిని. అందరి ఆడపిల్లలానే నేను నా పెళ్లి కోసం ఎన్నో కలలు కనేదానిని. కానీ నాకు పెళ్లి శాపం అయ్యింది. 21 సంవత్సరాలు వచ్చాక నాకు మా నాన్నగారూ మా స్థాయికి తగ్గవాళ్లకిచ్చి పెళ్లిచేశారు. చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైనా నాలుగు రోజులకే నా కలలు కన్నీరయ్యాయి. మా అత్త మావయ్యలు సాధింపులు రోజు రోజుకీ పెరుగుతూ వచ్చాయి.
నేను ఏ పని చేసినా వాళ్లకు నచ్చేది కాదు. ప్రతి చిన్నదానికి నన్ను చితగొట్టేవారు. ఓ సారి ఆ దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోయాను. ఇంత జరిగినా నా భర్త మాత్రం ఒక మాట అనలేదు. జరిగిందంతా చూస్తూ ఒక ప్రేక్షకుడుగా చూస్తుండిపోయాడు.
Successful Woman
ఇంత అవమానాన్ని నేను సహించలేకపోయాను. ఆ ఇంట ఒక క్షణం కూడా ఉండకూడదు అనుకుని వాళ్లకు బుద్ధి చెప్పాలని కోర్టులు, పోలీసులు చుట్టూ తిరిగాను. నేను సఫలం అయ్యాను. ఆ మనిషి నుంచి విడాకులు తీసుకుని ఆ రిలేషన్‌కు పుల్‌స్టాప్ పెట్టాను.
అలా ఎనిమిదేళ్లు గడిపోయింది. గాయం మానింది. జరిగిందంతా ఒక పీడ కలగా భావించమని, అలా ఒంటరిగా ఉండడం ఎందుకని చుట్టాలు సలహాలిచ్చారు. నాకు భయం వేసింది. మా వాళ్లందరూ నాకు నచ్చజెప్పారు. నేను రెండో పెళ్లి కోసం సిద్ధమయ్యాను.
Successful Woman
అతనిది కూడా రెండో పెళ్లి నీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు అర్థం చేసుకుంటాడు అన్నారు. రెండో పెళ్లి జరిగింది. అయితే ఈసారి కూడా అలాగే జరగబోతుందని నేను ఊహించలేకపోయాను. పెళ్లైన ఆరు నెలల వరకూ చాలా బాగుంది. మంచి భర్త, మంచి అత్తమామలు దొరికారు అని మురిసిపోయాను.
కానీ ఇక్కడ కూడా నాకు నిబంధనలు మొదలయ్యాయి. ఎవరితోనూ మాట్లడకూడదని, ఇంటి గడప తొక్కి బయటకు వెళ్లకూడదని రూల్స్ పెట్టేవారు. కానీ ఈసారి ఎట్టీ పరిస్థితుల్లోనూ నా జీవితం, నా సంసారం చక్కబెట్టుకోవాలని వాళ్లు ఎలా చెబితే అలాగే వినేదానిని. బహుశా అందుకే వాళ్లకి చులకన అయ్యానేమో.
కొన్ని రోజుల తర్వాత మా అత్త సూటిపోటీ మాటలతో గుచ్చిపొడిచేది. నేను ఏమి చేసినా లోపాలు ఎత్తి చూపించేది. ఏమైనా అంటే నువ్వు ఇలాంటి దానివి గనుకే నిన్ను నీ మొదటి భర్త వదిలేశాడు అనేవారు. ఇక నా రెండో భర్తకి నా అవసరం పడక గదిలోనే.. తప్ప వాళ్ల అమ్మగారు ఏమన్న ఆవిడకే సపోర్ట్ చేసేవారు. రాను రాను నా మీద పిల్లల కోసం ఒత్తిడి ఎక్కువైంది.
నీకు పెళ్లై సంవత్సరం అయింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. హాస్పటల్‌కి వెళ్లు అన్ని ఒత్తిడి చేసేవారు. నన్ను ఒక దాన్నే హాస్పటల్‌కి పంపేవారు. రెండు, మూడు నెలలు డాక్టర్ నార్మల్‌గా మెడిషిన్స్ ఇచ్చి ఒక్కసారి మీ భర్తని తీసుకురండి అన్నారు. ఆ మాట వాళ్లకి చెప్పాను. అంతే ఆవిడ కొడుకులో ఏ లోపం లేదు అన్నారు. లోపం అంతా నాలోనే ఉంది అన్నారు.
నాకు కాపురం చేయడం ఇష్టం లేదు, పిల్లల్ని కనడం ఇష్టం లేదని నేను వంకలు పెడుతున్నానని అన్నారు. అలా రోజురోజుకి గొడవలు పెరగడం మా ఆయన నన్ను కొట్టడం కామన్ అయిపోయింది. అంతేకాదు నన్ను కొట్టి కంట్లో నుంచి కన్నీరు రాకూడదని షరతులు పెట్టేవారు.
Successful Woman
ఇలా ఉండగా ఒక రోజు నా సహనాన్ని కోల్పోయాను. ఇంక నేను ఊరుకోలేదు. నేను తిరగబడ్డాను. మా అత్త నన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసింది. నేను కూడా ఇంకా ఆ ఇంట్లో అడుగు పెట్టనని గట్టిగా అనుకున్నాను. అలా ఐదు నెలలు గడిచింది. మా ఆయనకు నా అవసరం కలిగి నాకు భార్య కావాలి… నేను నా భార్యను తెచ్చుకుంటానన్నాడు. అలా అదే ఇంట్లో పై ఫోర్లో నన్ను పెట్టాడు. తీసుకొచ్చిన మూడు నెలల వరకు నేను పంజరంలో ఉన్న ఒక పక్షిలా బయటకు రాకుండా కిందకి దిగకుండా ఎవరితోనూ కలవకుండా చేశారు. మా అత్త కింద నుంచి నేను ఎంత తినాలి. ఎంత తాగాలో అన్ని కొలతలు వేసి మరీ ఇచ్చేది.
అసలు ఇదంతా ఏంటీ..? నేను తాగేది, తినేది కూడా ఇంకొకరు డిసైడ్ చేయాలా అని ఆలోచించాను. ఇంక ఈ డిప్రెషన్‌ను నుంచి బయటకు రావాలని డిసైడ్ అయ్యాను. నన్ను నేను చీకటి నుంచి బయటకు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను స్వతాహాగా బతకగలను నా చేతిలో పని ఉంది. మళ్లీ మెషిన్ కుట్టడం మొదలు పెట్టాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడం వల్ల మంచి డిజైన్స్‌లో బట్టలు కుట్టడం మొదలు పెట్టాను. అందరూ డిజైనింగ్ బట్టలు కుట్టించుకోవడానికి వచ్చేవారు. అలా ఇప్పుడు నెలకు పది నుంచి 15 వేలు వరకూ సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు నా భర్త నన్ను గౌరవంగా చూస్తున్నాడు. మా అత్త నన్ను చూసి తలవంచుకుంటుంది.
Successful Woman
కొడతాం.. కానీ కన్నీరు రాకూడదు..! తిడతాం కానీ బాధ పడకూడదు..! బహుశా ఈ ఆంక్షలు ఈ సొసైటీలో ఒక్క మహిళలకే మాత్రమే ఉంటాయి. కనీసం జంతువులకు కూడా ఇలాంటి షరతులు ఉండవు. బాధపడడానికి, ఏడ్వడానికి వాటికి స్వేచ్ఛ ఉంటుంది. ఇలాంటి వాటితో ఆడవాళ్లు ఈ సమాజంలో ఏ స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఇలాంటి అనుభవాన్ని వైష్ణవి ఒక్కసారి కాదు.. రెండు సార్లు పొందింది. అయితే వైష్ణవి జీవితం, తనను తాను నిలబెట్టుకునే విధానం కచ్చితంగా ఎంతోమంది గృహిణులకు ఆదర్శమనే చెప్పాలి. అలాగే ఇంకో విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే. పెళ్లే ఆడ పిల్లల కలలకు.. కదలికలకు కేరాఫ్ కాదు. ఎప్పుడైనా సొంత వ్యక్తిత్వంతో.. తనకంటూ ఉండే సంపాదనతో కచ్చితంగా జీవితంలో ఎంతో స్థాయికి ఎదుగుతారు.
Anuradha Lanka.
‘ఎంత ఐనా నా బిడ్డ కాదు ga’. అనే వాళ్ళ ప్రవర్తన మదంతో అనాలో పొగరుతో అనాలో అర్దం కావడం లేదు..మనిషిని మనిషిగా చూడని మనుషుల మధ్య రోజూ మానవ సంబంధాలు ఛిద్రమవుతూనే ఉన్నాయి.
తనను నమ్మి ఉన్న కుటుంబం కోసం ఒక గృహిణి రోజుకి వంద సార్లు చస్తూ బ్రతుకుతుంది
సాటి మనిషిని ప్రేమించలేని డబ్బు,హోదా ఎందుకు?
ఎప్పటికయినా సమ సమాజం లో మార్పు రావాలి అండి
అది నా కల కావొచ్చు
నిజం కంటే నాకు అదే బావుంది
కల కాదండి.. కచ్చితంగా ఆడవాళ్లకు గౌరవం దక్కే సమాజం వస్తుంది. అలా సొసైటీ మారుతుంది
ఆత్మవిశ్వాసంతో అడుగేయటం బాగుంది.. ఎప్పుడూ అది వదలకండీ.. అభినందనలు ???
Thankyou Mam…
మన సమాజం లో, ఆడవాళ్ళను అమ్మ లా చుాడాలని అంగడి బొమ్మలా చుాడకూడదని, ఆడవాళ్ళు మగవారి జీవనానికి వారి ఎదుగుదలకు మార్గదర్శకాలను, వారి తెలివి విజ్ఙత మన సమాజానికి ఎంతో అవసరమని తెలియజేసే విధంగా ఒక ఆర్టికల్ వ్రాయండి
తప్పకుండా.. రాస్తామండి