African Genius William Kamkwamba క్లాస్‌ల్లో ఇచ్చే మార్కులు, ర్యాంకులను బట్టీ విద్యార్థుల సామర్థ్యం ఉంటుందనే భ్రమలో ఉంటుంటాం. సబ్జెక్ట్ ఉంటే.. మార్కులతో పనేంటీ అని ఒక్కరం కూడా అనుకోం. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో మార్కులు తక్కువచ్చినా ఆగ్రహంతో ఊగిపోతాం. వాస్తవానికి స్కూల్స్ ఇచ్చే గ్రేడ్లు, ర్యాంకులు పిల్లల ప్రతిభకు ప్రామాణికం కావు. అదే జీవితం అంతకన్న కాదు. బడికి వెళ్లకపోయినా.. మార్కులు తెచ్చుకోకపోయినా.. సబ్జెక్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఈ విషయాన్ని ఓ ఆఫ్రికా పిల్లవాడు ప్రాక్టికల్‌గా తెలియజేశాడు.