Johaar Movie Telugu ఓటీటీ ప్లాట్‌ఫాం ఎక్కిన మరో విలువైన మూవీ జోహార్. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టింది. ఓటేసిన కోట్లాది మంది ప్రజల సమస్యలను రెండు గంటల్లో విప్పి చెప్పింది. ఇందులోని ప్రతీ పాత్రలో మనముంటాం లేదా మన పక్కింటోళ్లు ఉంటారు. చూసిన తర్వాత మూవీ మన మెదళ్లలో మళ్లీ మళ్లీ తిరుగుతుంది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి.