Metro Life Telugu Movieమనుషుల్లోని ఏమోషన్స్‌కు రూపాన్ని ఇస్తే మెట్రో కథలు. OTT ఫ్లాట్‌ఫాంపై ఆడుతున్న ఈ ఫిల్మ్. సమస్యలను, ప్రేమను, ఆడవాళ్ల నిస్సహాయతను కళ్లకు కట్టాయి. ఏదైనా కాస్త భిన్నంగా జరిగితే ఇది తప్పు కదా.. అని తేలికగా చెప్పే మనం వాటి వెనుక ఉన్న లోతులను చూడలేం. ఆ ప్రయత్నమే మెట్రో కథలు. ఇందులో నాలుగు కథలు ఉన్నాయి. ప్రపోజల్, ఘటన, సెల్ఫీ, తేగలు. అన్నీ మనస్సును తడుముతాయి. పది, 15 నిమిషాల్లో అయిపోయే ఈ కథలు ముగిసిన తర్వాత కూడా మన బుద్ధికి, మనస్సుకు పరీక్ష పెడతాయి.