Migrant Workers Telugu పగిలిన పాదాలకిపుడు ఒకటే ఆశ పదిలంగా పల్లెకు పోవాలి రాజ్యానికి పట్టలేదు లాఠీలేమో తరిమికొడుతున్నాయి అందుకే పట్టణాల నుండి పట్టాల బాట పట్టారు గుండె చెదిరినా కాళ్ళు అరిగినా చర్మం కమిలినా మనసు రగిలినా ఊరు వైపే పయనం Migrant Workers ఆ పయనాన్ని ఆకలీ, చావులూ ఆపలేదు పురిటి నొప్పులసలే ఆపలేదు నవశిశువుల ఏడుపునీ చెరిగిపోతున్న బాల్యాన్ని మోస్తూనే. ఆఖరి మజిలీకి మిగిలింది నడకొక్కటే. Migrant Workers – అన్నపూర్ణ ముద్దు గులాబీలపై.. ముళ్ల వర్షం