Menu
ప్రేమలో మోసపోయానని భర్తకు చెబితే..?

ప్రేమలో మోసపోయానని భర్తకు చెబితే..?

The Girl who Lost and won నేను స్వప్న. నాది ఒక అందమైన ప్రపంచం. అమ్మ, నాన్న, నేను తమ్ముడు. ఎంతో ఆనందంగా ఉండేవాళ్లం. నా ఈ అందమైన ప్రపంచం ఒక్కసారిగా కల్లోలం అయింది. ఏం జరిగిందో ఏంటో అమ్మ, నాన్న విడిపోయారు. నన్ను, తమ్ముడిని ఇద్దరు పంచుకున్నారు. దాంతో ఎప్పుడూ ఆటలు, పాటలు, పొట్లాటలతో మోగుతూ ఉండే మా ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. నేను ఒంటరిగా ఉండిపోయాను. నాకు అమ్మ అండ లేదు. తమ్ముడు తోడు లేదు.