Menu
Unhappy

ప్రేమలో మోసపోయానని భర్తకు చెబితే..?

The Girl who Lost and won

నేను స్వప్న. నాది ఒక అందమైన ప్రపంచం. అమ్మ, నాన్న, నేను తమ్ముడు. ఎంతో ఆనందంగా ఉండేవాళ్లం. నా ఈ అందమైన ప్రపంచం ఒక్కసారిగా కల్లోలం అయింది. ఏం జరిగిందో ఏంటో అమ్మ, నాన్న విడిపోయారు. నన్ను, తమ్ముడిని ఇద్దరు పంచుకున్నారు. దాంతో ఎప్పుడూ ఆటలు, పాటలు, పొట్లాటలతో మోగుతూ ఉండే మా ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. నేను ఒంటరిగా ఉండిపోయాను. నాకు అమ్మ అండ లేదు. తమ్ముడు తోడు లేదు.The girl who lost and won

నా దు:ఖాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. అలా కొంతకాలానికి ఒంటరితనం అలవాటైంది. ఇంతలో మా నాన్న రెండో పెళ్లి చేసుకుని నాకు సవతి తల్లినీ తెచ్చిపెట్టాడు. అసలే బాధలో ఉన్న నాకు కష్టాలు మొదలయ్యాయి.

సవతి తల్లీకి పనిమనిషిగా మారాను. స్కూల్‌కు వెళ్తూ చదువుకుంటూ ఇంటి పనులు అంతా నేనే చూసుకునేదాన్ని. ఇవేవీ మా నాన్నకు తెలియదు. ఎందుకంటే ఆయన పొద్దున్న వెళ్తే రాత్రికే ఇంటికి వచ్చేవారు.

The girl who lost and won

ఇలా నా జీవితంలో నేను తల్లీ, తమ్ముడు ప్రేమనే కాదు.. నాన్న ప్రేమకు కూడా దూరమయ్యాను. ఉండేది నా సవతి తల్లీ నన్ను మా నాన్నకి దూరం చేసింది. ప్రేమ కోసం తహతహలాడుతున్న నా జీవితంలోకి రవి వచ్చాడు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో రవి నాకు దగ్గరయ్యాడు. తనే నా నిజమైన రాకుమారుడు, నా సోల్ మేట్ అనుకుని తనని పూర్తిగా నమ్మాను.

The girl who lost and won

తను నన్ను శారీరకంగా, మానసికంగానూ పూర్తిగా వాడుకున్నాడు. పిచ్చిప్రేమలో ఉన్న నేను తనో గుంట నక్క అని తెలుసుకోలేకపోయాను. ఒక రోజు నాకు తెలియకుండా వేరొకరిని పెళ్లి చేసేసుకున్నాడు. నేను తట్టుకోలేక ఇలా చేశావేంటీ అని నిలదీశాను. దాంతో తను ‘నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లు బలవంతంగా చేశారు.’ ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తానంటూ కన్వీన్స్ చేశాడు. మళ్లీ నమ్మాను.

The girl who lost and won

కొన్ని రోజులకి అతని భార్య ప్రెగ్నెంట్ అయింది. నేను షాక్ అయ్యాను. వదిలేస్తాను అన్నవాడివి… భార్యతో సంబంధం ఎలా పెట్టుకున్నావని అడిగాను. ఈసారి కూడా ఏదో సాకు చెప్పాడు. ఇక తన మాటలు నేను నమ్మలేదు. ఇక తనను వదిలించుకున్నాను.The girl who lost and won

The girl who lost and won

ఈ బాధ నుంచి ఇంకా కోలుకునే లేదు ఇంతలో నాన్న నాకు దగ్గర సంబంధం చూశారు. వరసకు బావ అవుతాడు తానే ముందుకు వచ్చి నేను నచ్చానని ఇంట్లో సంబంధం కలుపుకున్నాడు. ఇంట్లో కూడా ఒత్తిడి చేశారు. ఇక చేసేదేమి లేక నేను ఒప్పుకున్నాను. కట్టుకోబోయే భర్త దగ్గర ఏ నిజం దాచకూడదని జరిగిందంతా చెప్పేశాను.

నాకు రవితో ఫిజికల్‌గా కూడా రిలేషన్ ఉండేదని కూడా చెప్పాను. మా బావ చాలా క్యాజువల్‌గా గతం కాదు ప్రజెంట్ ముఖ్యం నువ్వు గతంలో ఏం చేశావో నాకు అనవసరం అన్నాడు. ఆ మాట విని నేను చాలా సంతోషించాను. మా బావా చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్ అని ఇంక నా లైఫ్ బాగుంటుందని అనుకున్నాను. ఏ చీకు చింతా లేకుండా స్వచ్ఛంగా పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టాము. కానీ ఓ తుఫాను వచ్చే ముందు సైలన్స్ ఆవహించినట్టు నా ఈ ఆనందం కొట్టుకుపోతున్నట్టు నేను అప్పుడు ఊహించలేదు.

The girl who lost and won

ఈసారి కూడా ప్రేమ పేరుతో మోసపోతానని అనుకోలేదు. పెళ్లైన నెలకే మా బావలో మార్పులు వచ్చాయి. నేను ఎవర్ని కలిసినా, మాట్లాడిన కూడా నీడలా ఉండేవాడు. రోజురోజుకి తనలో అనుమానం పురుగు పెరుగుతా వచ్చింది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు కలవలేదు. ఇక తనతో కలసి జీవించడం కష్టమైంది.

The girl who lost and won

ఇంట్లో చెబితే నాన్న సపోర్ట్ చేయలేదు. సవతి తల్లీ మళ్లీ వాళ్లపై ఎక్కడ భారం అవుతానోనని నన్ను ఇంట్లోకి రానివ్వ లేదు. ఇప్పుడు నాకు ఇద్దరు మగ పిల్లలు . నా పిల్లల జీవితం నాలా అవ్వకూడదని నా సంసారాన్ని చక్కబెట్టుకోవాలని చాలా ప్రయత్నించాను. కానీ ఇంక నా వల్ల కాలేదు. ఇప్పుడు నా ఇద్దరి పిల్లల్ని తీసుకుని ఎవరి సాయం లేకుండా నేను ఒక దానిని స్వతహాగా స్కూల్లో టీచర్‌గా పనిచేసుకుంటూ సంతోషంగా ముందుకు సాగుతున్నానుThe girl who lost and won

ఈ అసమాన సమాజంలో ఆడవాళ్లు ఏకకాలంలో బాధ్యతలు, గుండెల్లో బాధలను మోయాల్సి ఉంటుంది. అలాంటి ఎందరో ఆడవాళ్లకు స్వప్న ఓ ఐకాన్‌గా కనిపిస్తుంది. స్వప్న ప్రేమ కోసం పరితపించింది. అందుకే నిజంగా ప్రేమించింది. నమ్మింది. వారి పట్ల అంతే నిజాయితీగా వ్యవహరించింది. గొప్ప సంస్కారం కలిగిన అమ్మాయి.

The girl who lost and won

కానీ ప్రియుడు, భర్త ఇద్దరు ఆమెను నమ్మించి, వంచించారు. కానీ మన సొసైటీలో ఉండే దారుణం ఏంటంటే ఆ ప్రియుడిని, భర్తను ఏమి అనరు. వాళ్లు మగవాళ్లు వాళ్లంతే ఈ అమ్మాయే తప్పు చేసింది అంటారు.

వాస్తవానికి నమ్మడం, ప్రేమించడం ఏ మాత్రం తప్పులు కావు. అవి మనిషికి ఉండాల్సిన సహజమైన లక్షణాలు. కానీ ఆడవాళ్ల విషయం వచ్చేటప్పటికీ ఆ లక్షణాలు, ఆ విలువలు తప్పు అయిపోతాయి.ఈ లాజిక్‌ ఏంటో అర్థం కాదు. ఎన్ని సమస్యలొచ్చినా ఒక రిలేషన్‌లో నిజమైన ప్రేమ ఉండాలి.

నిజాయితీ ఉండాలి. ఒక వేళ నమ్మిన వ్యక్తులు మోసం చేస్తే.. వాటిని ఎదుర్కొని సమాధానం చెప్పే సత్తా కూడా ఉండాలి. అలా నిలబడిన స్వప్న.. కచ్చితంగా చాలామంది అమ్మాయిలకు.. ఓ కాంతి రేఖే.

AnuRadha Lanka..

ఆ ‘ప్రకటనలు’ అర్థమయ్యాయా..?

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *