Menu
aadivasi

ఆ మతం వద్దన్న ఆదివాసీలు..!

They are Not Hindus

  •  ఆదివాసీలు హిందువులు కాదని తీర్మానం,

  • కీలక ప్రటకన చేసిన ముఖ్యమంత్రి

  • త్వరలో ఆదివాసీలకు కొత్త గుర్తింపు

రాంచీ – జార్ఖండ్ అసెంబ్లీ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివాసీలు హిందువులు కాదని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని ఆదివాసీలు ఇక హిందువులు కాబోరని, త్వరలోనే వారికి కొత్త గుర్తింపు రానుందని వ్యాఖ్యానించారు.  జార్ఖండ్ రాష్ట్రంలోని ఆదివాసీలు తాము హిందువులం కాదని చాలా కాలంగా వాదిస్తున్నారు. తమను హిందువులుగా గుర్తించవద్దు అంటూ కూడా కోరుతున్నారు.

They are Not Hindus

They are Not Hindus

They are Not Hindus

తమను ప్రత్యేకంగా గుర్తించాలని ఆదివాసీలు జార్ఖండ్ రాష్ట్రంలో చాలాకాలంగా ఉద్యమాలు కూడా చేశారు. ఆదివాసీలను పురాతన కాలం నుంచి కూడా బ్రాహ్మణులు హిందువులుగా మార్చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆదివాసీల డిమాండ్‌కు అనుకూలంగా జార్ఖండ్ అసెంబ్లీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఇప్పుడు ఆదీవాసీలకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినట్లయితే హిందూ ఓటు బ్యాంక్ గా ఆదీవాసీలను గుర్తించే అవకాశం ఉండకపోవచ్చు.

They are Not Hindus

2011 లెక్కల ప్రకారం దేశంలో సుమారు 50 లక్షల మంది ఆదివాసీలున్నారు. 32 తెగలున్నాయి. అందులో 8 బాగా బలహీనమైనవి. వారంతా సర్నా మతంగా భావిస్తారు. వాళ్లు ప్రకృతిని ఆరాధిస్తారు. చెట్లు, కొండలు, నీరు, అడవే వారి దేవుడు. వాళ్లది ప్రత్యేక మైన భాష. అందులో కొందరిని క్రిస్టియన్లు కన్వర్ట్ అయ్యారు.

They are Not HindusThey are Not Hindus

మిగతావారిని హిందువులుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆదివాసీలు ఆరోపిస్తున్నాయి. ఆదివాసీలు మాత్రం తమ ఉనికిని, నమ్మకాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 1871 నుంచి 1951 వరకు జార్ఖండ్‌లోని సర్నా ఆదివాసీలకు ప్రత్యేక కోడ్ ఉండేది. ఆ కోడ్ ద్వారా వారి ప్రత్యేకతను కాపాడుకునేవారు. 1961-62 లో దాన్ని మార్చేశారు. అప్పటి నుంచి వారు ప్రత్యేకత కోల్పోయారు.

They are Not Hindus

అదే విధంగా కన్వర్టెడ్ క్రిస్టియన్లు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. తమకు మాత్రం అందడం లేదని గొడవలు మొదలయ్యాయి. రాంచి సమీపంలోని సింగ్ పూర్ గ్రామంలో 2013లో మేరీ మాత విగ్రహం పెట్టడంతో ఆ గొడవలు తారస్థాయికి చేరాయి.

బాల ఏసును తన జోలెలో పెట్టుకుని ట్రైబల్ రూపంలో ఉన్న ఆ మేరీమాత విగ్రహ ఆవిష్కరణ ఆదివాసీలను తమలో కలుపుకునే కుట్ర అని సర్నా తెగ నాయకులు ఆరోపించారు. 2017లో బీజేపీ చేసిన మత మార్పిడీకి వ్యతిరేక బిల్లు కూడా వారి మధ్య మరింత చిచ్చు రేపింది.

ఆ ‘ప్రకటనలు’ అర్థమయ్యాయా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *