Tragedy Story
నేనో ప్రభుత్వోద్యోగిని. భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద నాకో చిన్న అటెండర్ పోస్ట్ ఇచ్చారు. సిటీకి దగ్గరగా ఉన్న చిన్న గ్రామం. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నది వ్యవసాయం.
నాన్న పెంపకంలో ఆడుతూ పాడుతూ తిరిగేదాన్ని. చదువు అవసరం గుర్తించలేదు. అమ్మ వంటలు నేర్చుకోమనేది. అలా పొద్దున లేస్తే ఊళ్లో ఎవరింట్లో పిండి వంటల కార్యక్రమం ఉన్నా అక్కడ వాలిపోయేదాన్ని. అందువలన అన్ని రకాల వంటలు వంటబట్టాయి. చదువుతప్ప.
Tragedy Story
ఎందుకో ఊహ తెలిసినప్పటి నుంచి అంటే పెళ్లి అనే మాట ఎక్కడ విన్నా.. గవర్నమెంట్ ఉద్యోగినే పెళ్లి చేసుకోవాలని బలంగా అనుకునేదాన్ని. వ్యవసాయమన్నా, బిజినెస్ అన్నా భయం. ఒడిదుడుకుల ప్రయాణం అవుతుందని నా భయం.
నా కోరిక మేరకు అలాంటి సంబంధమే చూసి చేశారు. అప్పుడు 18 ఏళ్లు నాకు. తెగ సంబరపడ్డాను. కానీ కొద్దికాలంలోనే ఆ సంబరమంతా ఆవిరైపోయింది.
Tragedy Story
పెళ్లైనా ఆర్నెళ్లకే నా భర్త అనారోగ్యానికి గురయ్యాడు. మా అత్త, మామ జాండీస్ అన్నారు. కానీ నన్ను నా భర్తను ఒక గదిలో ఉంచేవారు. తిండి తిప్పలు అక్కడికే పంపేవారు. మా గిన్నెలు, గ్లాసులు వాళ్ల గిన్నెల్లో కలిపేవారు కాదు. అంటుకునేవారు కాదు. నాతో నీ భర్తకు సేవలు చెయ్యు చాలు అనేవారు.
Tragedy Story
అలా నా భర్తను ఓ సారి హాస్పటల్‌కి తీసుకెళ్లిన డాక్టర్ నన్ను నువ్వు టెస్ట్ చేయించుకున్నావా..? అని అడిగారు. వెర్రి మొహం పెట్టాను. బాగా లేనిది మా ఆయనకండి అన్నాను. అతను నా వంక ఒక చూపు చూసి నీ భర్తకు ఎయిడ్స్ అందుకనీ నువ్వు హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకుంటే మంచిదమ్మ అని చెప్పాడు.
పల్లెటూరు తనం. అడగడానికో చెప్పడానికో నాతో ఎవరూ లేరు. నిలువు గుడ్లేసుకుని నిలబడిపోయాను. నా భర్త ఇంట్లో అందరికీ తెలిసే ఈ పెళ్లి చేశారని మాత్రం అర్థమైంది. నేను నా కుటుంబం అంతా మోసానికి గురయ్యామని తెలిసింది. ఏడాది తిరిగేలోగా నా భర్త చనిపోయాడు.
Tragedy Story
తర్వాత నేను టెస్ట్ చేయించుకున్నాను. హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చింది. అలా 19 ఏళ్లకే నా జీవితం ఆగిపోయింది. అప్పుడప్పుడే ఎయిడ్స్ గురించి ప్రచారం మొదలైన కొత్త.
నా సంగతి తెలిసిన. నా బంధువులు, చివరకు నా అన్న, వదిన కూడా నన్ను దరి చేరనీయలేదు. నన్ను ఒంటరిగా వదిలేశారు. నా బతుకు అన్యాయమైపోయిందనే జాలి, దయ ఎవరూ చూపలేదు.
Tragedy Story
నా దు:ఖంతో ఒంటరిగా మిగిలిపోయాను. చివరకు నాకు పెళ్లి సంబంధం చూసిన వాళ్లు మాత్రం మాకు తెలియకుండా నీకు చెడు చేశాం క్షమించమన్నారు. నా భర్త జాబు నాకు వేయించేవరకు బాధ్యత పడ్డారు. చివరకు ఉద్యోగం మిగిలింది.
25 ఏళ్లుగా అదే నా అనారోగ్యానికి ఆసరా అయింది. నా జబ్బు గురించి తెలుసుకున్నాను. ఎంత ఏడ్చినా, ఎందరు ఓదార్చినా నా జీవితం మారదు. ఆ విషయం అర్థమయ్యాక మానసికంగా ధైర్యంతో జీవితం మొదలుపెట్టాను. ఎయిడ్స్‌పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను.
Tragedy Story
తర్వాతర్వాత ఎయిడ్స్ గురించి అవగాహన కలిగిందో లేక నాకొచ్చే ఆదాయం, నాన్నిచ్చిన ఆస్తి కోసమో అందరూ దరి చేరడం మొదలుపెట్టారు. ఇప్పుడు అన్న కుటుంబానికి నేనే ఆసరా అయ్యాను. పెద్దమ్మ పిల్లలకు నేనే దన్ను. ఎవరికీ చెడు చేయకుండా నా జీవితం అలా గడిచిపోతుంది.
Tragedy Story
ఇది ఓ మహిళ జీవిత కథ. మోసం, ద్రోహం, వివక్షత అనే బలమైన గాయాల నుంచి తనను తాను మళ్లీ నిర్మించుకున్న కథ. ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసంతో మళ్లీ తన జీవితాన్ని నిలబెట్టుకున్న కథ. మాటలకందని ఈ లైఫ్ గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. అయినా ఈ జీవితం గురించి అందరికీ తెలియాలి. ధైర్యం ఉంటే ఎంత చిమ్మ చీకట్ల నుంచైనా వెలుగులోకి అడుగులు వేయోచ్చు. అందుకే ఈ అసామాన్యమైన జీవితం ప్రతిఒక్కరికి అవసరం. ప్రతి ఆడపిల్లకు ఓ పాఠం.
..Annapoorna
I am negative person
I want to speek pastive
Persons ❤❤❤❤❤?wish u a happy new year 2021
Happy New Year Sir
ఎలాంటి రోగిలుకైనా ధైరయం చోపినపుడు
వారు తన రోగాని మర్చి
పోతారు ఎంతుకంటే
కొంతారు మాటలు అలాగే..
కునుక నాతో ఎక్సపీరియన్సు చోపుతున్నాను.