Udham Singh Telugu
ఆకలితో అలమటించాడు.. ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు.. దేశంకాని దేశానికి వెళ్లి.. తను అనుకున్నది సాధించాడు. మాతృదేశం కోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమేనని గర్వంగా ప్రకటించాడు. బ్రిటిష్ వారి వెన్నులో వణికు పుట్టించి.. భారత యువత గుండెల్లో అగ్గి రగిల్చాడు. అతనే ఉద్దమ్ సింగ్. ఆ వీరుడు సాహసం ఇప్పుడు వెండితెరకెక్కబోతుంది.
భారత స్వతంత్ర ఉద్యమంలో నిజానికి భగత్ సింగ్ తెలిసినంతగా.. ఉద్దమ్ సింగ్ గురించి చాలామందికి తెలియదు. భారత స్వతంత్ర్య సంగ్రామం గురించి మాట్లాడుకున్నప్పుడు కచ్చితంగా ఉద్దమ్ సింగ్ గురించి చెప్పుకోవాలి. అంతటి గొప్ప సాహస వంతుడు ఉద్ధమ్ సింగ్.

Udham Singh
ఉద్దమ్ సింగ్ పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని సునం తెహసీల్‌కు చెందిన కలన్ గ్రామంలో జన్మించాడు. 1899 డిసెంబర్ 26న ఓ పేద ఇంట్లో ఉద్దమ్ సింగ్ పుట్టాడు. ఉద్దమ్ సింగ్ అసలు పేరు షేర్ సింగ్. ఉద్ధమ్ సింగ్ ఓ దళితుడు.
అతని తల్లీ పేరు నారాయణ్ కౌర్ చిన్నప్పుడే చనిపోగా.. తండ్రి పేరు తెహాల్ సింగ్ కూడా 1907లో మరణించారు.
తర్వాత ఉద్దమ్ సింగ్ తన అన్న ముక్తా సింగ్‌తో కలసి అనాథశ్రమంలో చేరాడు.
అప్పుడే షేర్ సింగ్‌కు. ఉద్దమ్ సింగ్‌గా పేరు మార్చారు.
తర్వాత కొన్నాళ్లకు ఉద్దమ్ సింగ్ అన్నయ్య కూడా చనిపోయాడు. దీంతో ఉద్దమ్ అనాథయ్యాడు.
టీనేజ్‌లోనే ఉద్దమ్ సింగ్‌కు దేశభక్తి అమితంగా ఉండేది. 14 ఏళ్ల వయస్సు వెయ్యి మందికిపైగా బలైన జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఉద్దమ్ సింగ్ నెత్తురును మండించింది. 1919 సంవత్సరంలో అమృతసర్‌లో జరిగిన ఈ సభకు అనాథ శరణాలయం నుంచి హాజరైన ఉద్దమ్ సింగ్ నేలమీద పడుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు.
అక్కడ శవాల గుట్టలను చూసి రగలిపోయాడు.. ఆ నెత్తుటి ధారను చూసి చలించిపోయాడు. అప్పుడే ఆ రక్తమంటిన మట్టిని చేతబట్టుకుని ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిని చంపేదాక తను చావనని వాగ్దానం చేశాడు.
వాగ్ధానం Udham Singh
అప్ప
టి నుంచి జలియన్ వాలాబాగ్‌కు కారణమైన డయ్యర్స్‌ను వెతుక్కుంటూ ఉద్దమ్ సింగ్ ముందుకు సాగాడు. అనేక విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తుపాకీ కాల్చడం కూడా నేర్చుకున్నాడు. ఉద్దమ్ సింగ్ 1940 మార్చి 13న లండన్ కాక్స్‌టన్ హాల్లో మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు. దీనికోసం ఉద్దమ్ సింగ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. పేరు మార్చుకున్నాడు.
మారువేషాలు వేశాడు. ఎట్టకేలకు డయ్యర్ ఆ కాన్ఫరెన్స్‌కు హాజరవుతాడని తెలుసుకుని.. లండన్ చేరుకుని, ఎంట్రీ పాస్ సంపాదించి.. పిస్టల్‌ను పుస్తకంలో పెట్టుకుని
వెళ్లి.. డయ్యర్‌పై గుళ్ల వర్షం కురిపించాడు.

Udham Singh
అనంతరం నా దేశ ప్రజల ఆత్మను భంగపరిచాడని, అందుకే వాడిని చంపానని కోర్టులో వెల్లడించాడు. అతనిని చంపాడానికి 21 సంవత్సరాలు వేచి చూశానని అన్నాడు. తను చంపేంత తప్పు చేశాడని ప్రకటించాడు. తాను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నానని, నా దేశం కోసం మరణిస్తున్నానని అది నా బాధ్యత అని వెల్లడించాడు.
తర్వాత 1940 జూలై 31న ఉద్ధమ్ సింగ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. ఈ స్వాతంత్ర్య సమరయోధుడు జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. ఇందులో ఉద్దమ్ సింగ్ పాత్రలో రణబీర్ కపూర్‌ను నటించనున్నట్టు తెలుస్తోంది.
సో ఫ్రెండ్స్… ఇలాంటి చరిత్ర పుటల్లో అట్టడుగునే ఉండిపోయిన స్వతంత్ర సమరయోధుల గురించి మీకు తెలుసా..? ఇంకెవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి.