What is Your Strength ..?
ఓ చిన్న కథ.. ఓ చిన్న ఘటన.. ఒక్కోసారి జీవితంలోని పెద్ద చిక్కుముడులను.. తేలికగా విప్పేస్తాయి. అలా ఎంతో మందికి ప్రేరణగా నిలిచే కథ..
సిటీలో ఒక అమ్మాయి జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయినా ఏ ఉద్యోగం సెట్ కాదు. ఇంట్లో పని చేయలేని స్థితిలో ఉన్న అమ్మ, నాన్నలు, ఓ చెల్లి. వాళ్లను పోషించాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంటుంది. వారందరూ కనీసం ఒక పూట గడవని పరిస్థితిలో ఉంటారు.
దాంతో ఆ అమ్మాయి జాబ్ కోసం తీవ్రంగా కష్టపడుతుంది. కానీ ఏది రాదు. ఆ టైంలో ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకు రమ్మని కాల్ వస్తుంది. దాంతో ఎలాగైనా ఈ ఉద్యోగంలో చేరాలనే పట్టుదలతో అక్కడకు వెళ్తుంది.
What is Your Strength ..?
అక్కడ చాలామంది తనలాగే ఇంటర్వ్యూకు వచ్చి ఉంటారు. వాళ్లను చూసి తనకు ఈ ఉద్యోగమైనా వస్తుందా..? అని అనుకుంటుంది. ఒక్కొక్కరుగా ఇంటర్వ్యూ ఛాంబర్‌కు వెళ్తుంటారు. వెళ్లిన వారు తిరిగి చెమటలతో అక్కడ నుంచి బయటకొస్తుంటారు.
అది చూసినా.. ఆ అమ్మాయి చాలా కష్టమైన ప్రశ్నలు వేస్తున్నారేమో అని అనుకుంటుంది. ఇక తన వంతు వస్తుంది. లోపలకు వెళ్తుంది. అక్కడ ముగ్గురు ఉంటారు. వయస్సు, క్వాలిఫికేషన్, ఎక్కడ చదువుకున్నావు.. ఏ ఊరు అన్ని అడుగుతారు. అన్ని చెబుతుంది. దాంతోపాటు తనకు జాబ్ ఎంత అవసరమో కూడా చెబుతుంది.
What is Your Strength ..?
అప్పుడు వాళ్లు ‘‘కంగారు పడకు.. మేం ఏం ప్రశ్నలు వేయం. ఒక చిన్న టాస్క్ ఇస్తాం.. అది చేస్తే.. నీకు ఈ ఉద్యోగం వచ్చేస్తుంది’’ అని చెబుతారు. దానికి ఆ అమ్మాయి ‘‘సరే ఏదైనా చేస్తాను’’.. అని అంటోంది.
అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్లు.. ఆ గదిలో ఉన్న ఓ బీరువాను చూపిస్తారు. ‘‘అది టన్ను బరువుంటుంది. నీకు గంట సమయం ఇస్తాం’’ నీ శక్తినంతా ఉపయోగించి.. ఆ బీరువాను.. రెండు అంగుళాలు కదిలిస్తే..చాలు’’ నీకే ఈ ఉద్యోగం వస్తుందని చెబుతారు.
What is Your Strength ..?
అది విన్న ఆ అమ్మాయికి మతిపోతుంది. ‘‘అదేంటి..సార్ టన్ను బరువున్న దానిని నేనెలా కదపగలను’’.? అని అడుగుతుంది. అప్పుడు.. అక్కడున్న వారు.. ‘‘నీ శక్తినంతా ఉపయోగించు.. గంట సమయం ఉంది.. ప్రయత్నించు’’ అంటారు.
ఇక ఆ అమ్మాయి ఆ బీరువాను కదిలించడానికి ప్రయత్నిస్తుంది.. కానీ ఒక ఇంచు కూడా కదిలించలేకపోతుంది. గట్టిగా ప్రయత్నిస్తోంది.. అయినా ప్రయోజనం ఉండదు.. అలా గంట సమయం అయిపోతుంది. దాంతో అక్కడున్న వారు ‘‘నీకిచ్చిన సమయం అయిపోయింది. నీకు ఈ ఉద్యోగం రాదు’’ అని చెప్పేస్తారు.
దాంతో ఆ అమ్మాయి బాగా ఫ్రస్టేట్ అయిపోయి ఇదేం పరీక్ష సార్.. ఈ ఉద్యోగానికి.. మీరు ఇచ్చిన టాస్క్‌కు ఏమన్న సంబంధం ఉందా..? నా ఒంట్లో శక్తి ఎంతా..? మీరు లాగమన్నా బరువెంతా..? అని గట్టిగా అరుస్తోంది.
What is Your Strength ..?
దాంతో ఆ అధికారులు.. ‘‘మేం కరెక్టే టాస్కే ఇచ్చాం.. దానిని నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేదంటారు. నీ శక్తినంతా ఉపయోగించి.. బీరువా కదపమన్నాం.. గంట సమయం ఇచ్చాం. అంటే.. నీ శక్తి అంటే.. కేవలం ఒంట్లో శక్తి మాత్రమే కాదు.. నీ సర్కిల్లో నీ వాళ్ల నుంచి వచ్చిన శక్తి కూడా అని చెబుతారు.
నీకు ఫ్రెండ్స్, సన్నిహితులు, చెల్లి.. తల్లిదండ్రులు.. ఇలా ఎంతోమంది ఉంటారు వారందరూ నీ బలమే కదా. వారందరినీ పిలిచి.. వాళ్లతో కలసి బీరువాను రెండు అంగుళాలు కదపగలిగితే.. ఈ ఉద్యోగం నీకు వచ్చేది కదా అని ఆ ఆఫీసర్లు చెబుతారు.
నీ శక్తేమిటో.. నీకే తెలియలేదు.. ఇప్పుడు ఈ ఉద్యోగం ఇస్తే.. ఏం చేయగలుగుతావ్.. అని ప్రశ్నిస్తారు.
అంతేకదా.. మన శక్తి అంటే.. కేవలం మన ఒక్కరిది మాత్రమే కాదు.. మన అనుకునే వాళ్లు ఇచ్చే ప్రోత్సాహం, ప్రేరణ, ఆలోచన, ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవన్నీ కలిసే మన శక్తి. ఒక్కసారి మన ఆలోచన తీరు మార్చుకుంటే.. జీవితంలో కచ్చితంగా విజయాలు మన సొంతం అవుతాయి.