African Genius William Kamkwamba
క్లాస్‌ల్లో ఇచ్చే మార్కులు, ర్యాంకులను బట్టీ విద్యార్థుల సామర్థ్యం ఉంటుందనే భ్రమలో ఉంటుంటాం. సబ్జెక్ట్ ఉంటే.. మార్కులతో పనేంటీ అని ఒక్కరం కూడా అనుకోం. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో మార్కులు తక్కువచ్చినా ఆగ్రహంతో ఊగిపోతాం. వాస్తవానికి స్కూల్స్ ఇచ్చే గ్రేడ్లు, ర్యాంకులు పిల్లల ప్రతిభకు ప్రామాణికం కావు. అదే జీవితం అంతకన్న కాదు. బడికి వెళ్లకపోయినా.. మార్కులు తెచ్చుకోకపోయినా.. సబ్జెక్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఈ విషయాన్ని ఓ ఆఫ్రికా పిల్లవాడు ప్రాక్టికల్‌గా తెలియజేశాడు.
స్క్రాప్ నుంచి విండ్ మిల్ African Genius William Kamkwamba
స్కూల్‌కు వెళ్లకుండా.. మార్కులు, ర్యాంకులు, గ్రేడ్‌లు గోల లేకుండా ఓ 14 ఏళ్ల పిల్లవాడు అద్భుత యంత్రాన్ని ఆవిష్కరించాడు. వాళ్లింటికి వెలుగులు తీసుకొచ్చాడు. స్క్రాప్ నుంచి విండ్ మిల్‌ను రూపొందించి.. తన సామర్థ్యంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అంటే అందరికి వెంటనే గుర్తొచ్చేది చీకటి. చీకటి ఖండంగా ఆఫ్రికాకు పేరు. ఆ చీకటిని తరిమేందుకే ఓ పిల్లవాడు ప్రయత్నించాడు. అతనే విలియం కామ్‌క్వాంబ.

African Genius William Kamkwamba | బడికి దూరం చేసిన కరువు
విలియం చాలా కరువుతో అల్లాడే ఆఫ్రికా దేశంలోని మాలావిలోని ఓ నిరు పేద కుటుంబంలో పుట్టాడు. వారి కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి జీనవం సాగించేది. కానీ విలియం కామ్ క్వాంబకు ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవడం అంటే ఎంతో ఇష్టముండేది. ఆ ఆసక్తితోనే తన ఫ్రెండ్స్ తో ఒక చిన్న రేడియో మెకానిక్ షాపును పెట్టుకున్నాడు. గ్రామంలోని పాఠశాలలోనూ చదువుకుంటూ ఉండేవాడు. అయితే తీవ్రమైన కరువు కారణంగా విలియం కుటుంబం మరింత చితికిపోయింది. పంటలు ఎండిపోయి.. తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫీజు కట్టలేక 2001లో విలియం స్కూల్ మానేయాల్సి వచ్చింది.
లైబ్రరీ నుంచే చదువు | African Genius William kamkwamba
విలియం స్కూల్‌కు వెళ్లలేకపోయాడు కాని.. తన ఆసక్తికి మాత్రం అడ్డుకట్టవేయలేదు. చదువుకోవాలనే ఆసక్తితో దగ్గరలోని లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాడు. అలా 8వ గ్రేడ్ అమెరికన్ టెక్ట్స్ బుక్ అయిన యూజింగ్ ఎనర్జీని స్టడీ చేశాడు. అప్పుడే తన ఇంటికి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి తాత్కాలిక విండ్ టర్బైన్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంట్లో తినడానికే తిండి లేనప్పుడు పరిశోధనలకు ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది..? అందుకే విలియం చెత్తను ఉపయోగించే తను అనుకున్నది సాధించాడు.
చెత్తతో అద్భుత ఆవిష్కరణ
ట్రాక్టర్ ఫ్యాన్ బ్లేడ్, స్క్రాప్ మెటల్, సైకిల్ విడిభాగాలు, పాత షాక్ అబ్జార్బర్, బ్లూ గమ్ చెట్లను ఉపయోగించి తాత్కాలిక విండ్ టర్బైన్‌ను రూపొందించాడు. దాంతో నాలుగు ఇళ్లలో లైట్లను వెలిగించే విద్యుత్ ఉత్పత్తి అయింది. తర్వాత నీటి పారుదల కోసం నీటి పంపును నడపగల ప్రత్యేక విండ్‌మిల్‌ను నిర్మించాడు. నవంబర్ 2006లో మాలావిలోని డైలీ టైమ్స్ ఈ విషయం గురించి రాయడంతో విలియం వెలుగులోకి వచ్చాడు. అంతర్జాతీయ వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత విలియంకు ఆఫ్రికన్ లీడర్ షిప్ అకాడమీ స్కాలర్ షిప్ ఇచ్చింది. న్యూ హాంప్‌షైర్‌లోని హనోవర్‌లోని డార్ట్మౌత్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు.
తిండే దొరకని పరిస్థితి… Africa
కొన్ని సంవత్సరాలు ఆఫ్రికా వ్యవసాయ, ఆర్థిక సంక్షోభంతోనే కొట్టుమిట్టాడుతుంది. ఇక కరెంట్ సదుపాయం అక్కడ ఉండదు. వాస్తవానికి ఆసియా దేశాల్లో విద్యుద్దీకరణలో 80 శాతానికి చేరుకున్నాయి. ఆఫ్రికాలో మాత్రం ఆ పర్సేంటేజ్ 43 శాతంగా ఉంది. ఆ కరెంట్ లేకపోవడంతో అక్కడ ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. కరువు, కాటకాలతో కనీసం తిండి దొరకని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడ ప్రజలకు తిండి, విద్య, వైద్యం దొరకడం అంత మామూల విషయం కాదు. వాటికోసం జీవితంతో పెద్ద యుద్ధమే చేయాలి.
అలా తన తల్లిదండ్రులు చేస్తున్న సమరాన్ని విలియం చూసి ఆగలేకపోయాడు. వారి అవసరాలను తీర్చడానికి తనకు తానుగా ఏదో చేయాలని తపించాడు. ఆ అవసరం గొప్ప ఆవిష్కరణకు కారణమైంది. పేదల అవసరాలను తీర్చగలిగే ఏదైనా గొప్ప ఆవిష్కరణే అవుతుంది. అందుకే విలియం తన ఇంటి వరకూ పరిమితం కాకుండా తన గ్రామంలో సౌర శక్తితో పనిచేసే నీటి పంపును రూపొందించాడు.
బయోపిక్.. Bio pic
తర్వాత కాలంలో తన వాళ్ల వ్యథను తన కథగా మార్చి విలియం పుస్తకం కూడా రాశాడు. అదే ది బాయ్ హూ హెర్నస్‌డ్ విండ్. విలియం రాసిన పుస్తకం ఆధారంగా తన జీవితంపై ఆఫ్రికాలోని పరిస్థితులను అద్దం పట్టేలా 2019లో బయోపిక్‌గా కూడా తెరకెక్కింది.
విలియం రూపొందించిన పరికరం వెనుక ఓ ఆకలి ఉంది. అవసరం ఉంది. బతుకు పోరాటం ఉంది. అందుకే చాలామంది సైంటిస్టుల కంటే విలియం రూపొందించిన పరికరం ఎంతో అద్భుతమైనదని చెప్పాలి. అందుకే ఆ 14 ఏళ్ల పిల్లవాడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.