Winners
ఉన్నవాళ్ల జీవితాలు, లేనివాళ్లు జీవితాలు కూడా ఒకేలా స్టార్ట్ అవుతాయి. అయితే ఉన్నవాళ్ల జీవితాలందరి ముగింపు ఒకేలా ఉంటాయి.
కానీ పేదల జీవితాల ముగింపులు ఒక్కోక్కరిది ఒకోలా ఉంటుంది : టాల్ స్టాయ్
అసామాన్యుల కథలు కాదు.. సామాన్యుల బతుకులే కావాలి. మనలా మెట్టు నిర్మించుకుని ఎక్కేవాళ్లే కథలే మనకు స్ఫూర్తినిస్తాయి. ఆత్మస్థైర్యాన్ని అందిస్తాయి..
Winners
ఒకరుఅన్ని తానై ఇంటికి దీపంలా మారుతారు. తమకంటూ అన్ని వదలుకుని.. ఇంటి బాధ్యతలను భుజానేసుకుంటారు. మరొకరు ఏ గాడ్ ఫాదర్ లేకుండా కొన్ని వృత్తుల్లో తమకంటూ ఓ స్థానాన్నిఏర్పరుచుకుంటారు. ఇంకొరు చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు ఎంతో సంపాదించేవాళ్లు అయి ఉండి ఉంటారు.
Winners
మరికొందరు తమ భార్యా, పిల్లలు, తల్లిదండ్రులు కోసం నచ్చిన జీవితాన్ని, నచ్చిన పనిని వదులకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు ప్రపంచానికి తెలియని విజేతలుగా ఉండిపోతుంటారు.
అలాంటి వాళ్ల తలపులను తెరుద్దాం. మధ్య తరగతి, పేదవాళ్ల జీవితాలను తడిమి చూద్దాం.
అలాంటి జీవిత కథలను తెలుసుకుందాం. చరిత్రకెక్కిన విజేతలు కాదు.. మనలో మనతోపాటే ఉండే విజేతలు కథలు కావాలి.