Bhagat Singh life story in Telegu: చరిత్రలో చాలామంది విప్లవకారులు, అభ్యుదయవాదులు, స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. అందులో కొద్ది మంది మాత్రం ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేయగలిగే నాయకులుగా నిలిచారు. అందులో ప్రధానంగా భగత్ సింగ్ (Bhagat singh life story in Telegu) గురించి చెప్పుకోవాలి. ఇప్పటికీ భగత్ సింగ్ అని పేరు వినగానే ఒక తెలియని కరెంట్ పాస్ అవుతుంది. మన మనస్సుల్లో గర్వం ఉప్పొంగిపోతుంది. ఎందుకలా? భగత్ సింగ్‌లో అంత ప్రత్యేకత ఏమిటీ?
భగత్ సింగ్ జీవితం (Bhagat Singh life Story in Telegu)
భగత్ సింగ్ (Bhagat Singh) కంటే ముందు, తర్వాత కూడా చాలామంది విప్లవకారులు, స్వతంత్ర సమర యోధులు వచ్చారు. కానీ భగత్ సింగ్ మాత్రం ఒక గీటు రాయిలా (Bhagat Singh life story in Telugu) నిలిచాడు. చాలామందికి ఆదర్శాలు, ఆశయాలు ఉండొచ్చు. కానీ నిజాయితీగా వాటికి కట్టుబడి ఉండడం, పని చేయడం అందరికీ సాధ్యం కాదు. తాను ఎంచుకున్న మార్గంలో ముందున్నదంతా ముళ్ల మార్గమే అని తెలిసి కూడా చివరి వరకు దానిని అంతే ప్రేమించడం ఎవరికి సాధ్యం అవుతుంది. భగత్ సింగ్ లాంటి వాళ్లకి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎంతటి పెద్ద పెద్ద స్వతంత్ర సమర యోధులైనా కావొచ్చు కానీ బలహీనతలకు లొంగిపోని వ్యక్తిత్వం ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలా ఉన్న వ్యక్తి భగత్ సింగ్.

భగత్ సింగ్ గురించి (Bhagat Singh life Story in Telugu)
భగత్ సింగ్ అపర మేధావి. కేవలం 23 ఏళ్ల వయస్సులో (Bhagat Singh age) ఒక వేళ భారత దేశానికి స్వతంత్రం వచ్చినా ఎలా ఉంటుందనే విషయం అప్పుడే గ్రహించాడు. అలాంటి స్వతంత్రం కాదు మనకి కావాల్సిందని గర్జించాడు. నినదించాడు. సమసమాజం కావాలని ఆకాంక్షించాడు. దానికోసం అహర్నిశలు కృషి చేశాడు. తాను చదివిన ప్రతి విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నించాడు. భగత్ సింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే ఆయన తన మిత్రులకి, కుటుంబ సభ్యులకి రాసిన ఉత్తరాల (Bhagat Singh letter) ద్వారా తెలుస్తుంది. తాము నమ్ముకున్న ఆశయం కోసం ఎలాంటి పరిస్థితుల్లోలైనా పని చేయాలి. భగత్ సింగ్ కూడా అదే చేశాడు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, జైలు గోడల మధ్య ఉన్నా పోరాటాన్ని, అధ్యయాన్ని వదల్లేదు. దేశం కోసం పని చేయడం ఆదర్శం అనుకోలేదు బాధ్యత అనుకున్నాడు. అందుకే ప్రాణాలు తీయడానికైనా, ప్రాణం ఇవ్వడానికైనా ఏ మాత్రం వెనుకాడలేదు.
భగత్ సింగ్ లైఫ్ (Bhagat Singh life Story)
భగత్ సింగ్ 1907, సెప్టెంబర్ 27వ తేదీన బంగా, జారన్‌వాలా తహ్సీల్, ఫైసలాబాద్ జిల్లాలోని పంజాబ్‌లో పుట్టాడు. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది. 1931 మార్చి 23లో భగత్ సింగ్‌ని (Bhagat Singh life) ఉరి తీశారు. బ్రిట్ చెరలో ఉన్న భారత దేశ విముక్తి కోసం భగత్ సింగ్ విప్లవ బాట (Bhagat Singh Revolutionary movement) పట్టాడు. భగత్ సింగ్ తండ్రి పేరు కిషన్ సింగ్, తల్లి పేరు విద్యావతి. భగత్ సింగ్ (Bhagat Singh contribution in freedom struggle) దేశం కోసం హిందూస్తాన్ గణతంత్ర సంఘంలో చేరి, దానిని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌గా మార్చాడు. ఆ అసోసియేషన్ వేదికగా దేశం కోసం పని చేశాడు. భగత్‌సింగ్ పని తీరు, ఆచరణ వల్ల చాలా తక్కువ టైమ్‌లోనే ప్రజల మద్దతును భగత్ సింగ్ కూడగట్టుకున్నాడు.
జైల్లో నిరాహార దీక్ష (Bhagat Singh Hunger Strike in Jail)
భారత, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల (Bhagat Singh hunger strike in jail) నిరాహారదీక్షను చేపట్టాడు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపాడు. అసెంబ్లీలో బాంబు వేసి బ్రిటిష్ నాయకుల్లో వణుకు పుట్టించాడు. కోర్టు బోనే వేదికగా తన భావాలను ఈ దేశ ప్రజలకు వెల్లడించాడు. భగత్ సింగ్ సుఖ్‌దేవ్‌తో కలసి లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. లాహోర్‌లో పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను చంపడానికి ప్లాన్ చేశాడు. అయితే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ సాండర్స్‌పై కాల్పులు జరిపారు.

భగత్ సింగ్ గురించి తెలియని కొన్ని నిజాలు (Unknown facts of Bhagat Singh)
- భగత్ తన పాఠశాల విద్యను దయానంద్ ఆంగ్లో-వేద ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. తర్వాత లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చదివాడు.
- భగత్ సింగ్ తొలినాళ్లలో మహాత్మా గాంధీ చెప్పే అహింస ఆదర్శాలను అనుసరించేవాడు.
- భగత్ సింగ్ మార్క్సిజాన్ని ఆరాధించాడు. వ్లైమిర్ లెనిన్, లియోన్ ట్రోత్స్కీ, మిఖాయిల్ బకునిన్ రచనల నుంచి మోటీవేట్ అయ్యాడు.
- జలియన్‌వాలాబాగ్ (Jallianwala Bagh History) ఊచకోతతో భగత్ సింగ్ ఎంతగానో కలత చెందాడు.
- భగత్ సింగ్ గొప్ప నటుడు. కాలేజీలో ‘రాణా ప్రతాప్’, ‘భరత్-దుర్దాశ’ వంటి నాటకాలలో అనేక పాత్రలు పోషించాడు.
- భగత్ సింగ్ తన చిన్నతనంలో ఎప్పుడూ తుపాకుల గురించి మాట్లాడేవాడు. వాటి ద్వారా బ్రిటీష్ వాళ్లని తరిమికొట్ట వచ్చని నమ్మేవాడు.కేవలం ఎనిమిదేళ్ల సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతను ఎప్పుడూ బొమ్మలు లేదా ఆటల గురించి మాట్లాడటానికి బదులుగా భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడం గురించి మాట్లాడేవాడు.
- తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నప్పుడు భగత్ సింగ్ ఇంటి నుంచి కాన్పూర్ పారిపోయాడు. పైగా “ఈ బ్రిటీష్ పానలోని భారతదేశంలో వివాహం చేసుకుంటే నా వధువు నా మరణం అవుతుంది” అని తల్లిదండ్రులకు చెప్పాడు.
- భగత్ సింగ్ తన కౌమార దశలోనే లెనిన్ నేతృత్వంలో సోషలిజం, సోషలిస్టు విప్లవాల పట్ల ఆకర్షితుడై వాటి గురించి చదవడం మొదలుపెట్టాడు.
- “వారు నన్ను చంపవచ్చు, కానీ నా ఆలోచనలను కాదు” అని భగత్ సింగ్ వెల్లడించాడు.
- డిసెంబరు 17, 1928న, వారు లాహోర్‌లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో తమ ప్రణాళికను అమలు చేశారు, అయితే వారు జేమ్స్ స్కాట్‌కు బదులుగా, స్కాట్ సహాయకుడు జాన్ పి సాండర్స్‌ను పొరపాటున చంపినట్లు వారు గ్రహించారు.
- సహచరులతో కలసి భగత్ సింగ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరాడు.వారు ఎవరినీ గాయపరచాలని కోరుకోరు. బాంబులు తక్కువ గ్రేడ్ పేలుడు పదార్థాలతో తయారు చేయడం జరిగింది.
- భగత్ సింగ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే శక్తివంతమైన నినాదాన్ని రూపొందించాడు, ఇది భారతదేశ సాయుధ పోరాటానికి నినాదంగా మారింది.
- మార్చి 23, 1931న అధికారిక సమయానికి గంట ముందుగా భగత్ సింగ్‌ని (Bhagat Singh Hanged) ఉరి తీశారు. భగత్ సింగ్ ఉరి వేసినప్పుడు నవ్వుతూనే ఉన్నారని చెబుతారు. నిజానికి, ఇది “అధోకరణం చేయబడిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం” కోసం నిర్భయతతో జరిగింది.
… Andaluri Rudra Veni …
ఇది కూడా చదవండి: దేశం కోసం ప్రాణం వదిలిన తొలి ముస్లిం : అష్ఫాకుల్లా ఖాన్